Thursday, August 7, 2025

Sommu penchaku baabayo telugu lyrics [సొమ్ము పెంచకు బాబయో] - Baabai abbai

Song Name :Sommu penchaku babayo
Movie:Baabai abbai
Singers:S.P. Balasubramanyam garu, 
Lyricist:Veturi Sundararama murthy garu
Composer:K. Chakravarthi garu
Director:Jandhyala garu

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

పెరిగిపోతే పైకం ఎదుగుతుందీ మైకం .. బాబయో.. అబ్బయో .. బాబయో

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

నల్లడబ్బుని దాచడానికి గుడ్డిగ నమ్మాలీ

నానా గడ్డీ కరవాలి, ఎందరి కాళ్ళో పట్టాలి 

తెల్ల డబ్బుపై హక్కు కోసము బొక్కలు వెతకాలి

ఎన్నో ట్రిక్కులు చేయ్యాలీ, టాక్సులు తక్కువ కట్టాలీ 

కుప్ప తెప్పలుగ చెరువు నిండితే కప్పలు చేరుట ఖాయం 

అప్పలంగా వచ్చిన సొమ్ము దిక్కు పెట్టడం ఖాయం 

చెలిమికి చేసిపొవురా గాయం, యూయం యూయం మయం మయం 

యూయం యూయం మయం మయం 

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

డబ్బులెక్కకు ఇంటికుక్కలు తరగక తప్పదురా 

అవి మొరగక తప్పదురా 

నిన్నే కరవక మానవురా 

మనఃశ్శాంతికి ఆరోగ్యానికి తిప్పలు తప్పవు రా, 

గుళికలు మింగక తప్పదురా, చావుకు లొంగక తప్పదురా 

జబ్బు చేసినా, డబ్బు చేసినా తాగక తప్పదురా, మందు తాగక తప్పదు రా 

ఆసుపత్రిలో ఆసుపత్రమో తగలక తప్పవురా మనిషి మారుట తధ్యమురా 

సొమ్ములు కూడబెట్టడం పాపం, శాంతం సౌఖ్యం మాయం మాయం

శాంతం సౌఖ్యం మాయం  మాయం

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

పెరిగిపోతే పైకం ఎదుగుతుందీ మైకం .. బాబయో.. అబ్బయో .. బాబయో

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో 

No comments:

Post a Comment