Showing posts with label comedy. Show all posts
Showing posts with label comedy. Show all posts

Monday, February 23, 2026

Kobbarinilla jalakaladi [కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి ] - Rendu Jalla seetha

Song Name :Kobbarinilla jalakaladi
Movie:Rendu Jalla seetha
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు 
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Ramesh Naidu గారు
DirectorJandhyala గారు 

కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి 

పొద్దుటెండ తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తావా

ముద్దుతీర్చే సందిటికొస్తావా, ముద్దుతీర్చే సందిటికొస్తావా 

కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి 

పొద్దుటెండ తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తాలే

ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే 

ఆకాశవీణల్లో నేను అనురాగమే పాడుకుంటా

గోంగూరపచ్చట్లో నేను ఉల్లిపాయే నంజుకుంటా..నీరుల్లిపాయె నంజుకుంటా

ఆకాశవీణల్లో నేను అనురాగమే పాడుకుంటా

శృంగారవీధుల్లో నేను రసనాట్యమే ఆడుకుంటా ప్రేమరసనాట్యమే ఆడుకుంట 

మాటివ్వునాకు మనసిచ్చుకుంటా, వదిలేస్తే వంకాయ వండించుకుంటా

iam sorry వంకాయవంటి కూరయే పంకజముఖి సీతవంటి భార్యామణి అని అన్నారుకదండి, అందుకని అలపాడానన్నమాట .. ఒహో

కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి 

పొద్దుటెండ తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తావా

ముద్దుతీర్చే సందిటికొస్తావా, ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే

అమ్మవారి ఎదుటనేను, నీ కుంకుమే దిద్దుకుంటా, నీకోసమే కాచుకుంటా

అమ్మతో చెప్పినేనూ అప్పచ్చులే తెచ్చుకుంటా,  

అమ్మవారి ఎదుటనేను, నీ కుంకుమే దిద్దుకుంటా, నీకోసమే కాచుకుంటా

అసురసంధ్యవేళ నాను, ఆలయంలోవేచిఉంటా, నీ హారతే అందుకుంటా 

మాగాయల్లోనా పెరుగేసుకుంటా ... వదిలేస్తే నాదారి నేచూసుకుంటా

చూడండి, మాగాయ మాహాపచ్చడి పెరుగేస్తే మహత్తరి, అదివేస్తే అడ్డవిస్తరి మానిన్యామహాసుందరి.. అని అన్నారు కదండి అందుకే అలా పాడానన్నమాట 

కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి 

పొద్దుటెండ తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తావా

ముద్దుతీర్చే సందిటికొస్తావా, ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే 

Thursday, August 7, 2025

Sommu penchaku baabayo telugu lyrics [సొమ్ము పెంచకు బాబయో] - Baabai abbai

Song Name :Sommu penchaku babayo
Movie:Baabai abbai
Singers:S.P. Balasubramanyam garu, 
Lyricist:Veturi Sundararama murthy garu
Composer:K. Chakravarthi garu
Director:Jandhyala garu

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

పెరిగిపోతే పైకం ఎదుగుతుందీ మైకం .. బాబయో.. అబ్బయో .. బాబయో

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

నల్లడబ్బుని దాచడానికి గుడ్డిగ నమ్మాలీ

నానా గడ్డీ కరవాలి, ఎందరి కాళ్ళో పట్టాలి 

తెల్ల డబ్బుపై హక్కు కోసము బొక్కలు వెతకాలి

ఎన్నో ట్రిక్కులు చేయ్యాలీ, టాక్సులు తక్కువ కట్టాలీ 

కుప్ప తెప్పలుగ చెరువు నిండితే కప్పలు చేరుట ఖాయం 

అప్పలంగా వచ్చిన సొమ్ము దిక్కు పెట్టడం ఖాయం 

చెలిమికి చేసిపొవురా గాయం, యూయం యూయం మయం మయం 

యూయం యూయం మయం మయం 

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

డబ్బులెక్కకు ఇంటికుక్కలు తరగక తప్పదురా 

అవి మొరగక తప్పదురా 

నిన్నే కరవక మానవురా 

మనఃశ్శాంతికి ఆరోగ్యానికి తిప్పలు తప్పవు రా, 

గుళికలు మింగక తప్పదురా, చావుకు లొంగక తప్పదురా 

జబ్బు చేసినా, డబ్బు చేసినా తాగక తప్పదురా, మందు తాగక తప్పదు రా 

ఆసుపత్రిలో ఆసుపత్రమో తగలక తప్పవురా మనిషి మారుట తధ్యమురా 

సొమ్ములు కూడబెట్టడం పాపం, శాంతం సౌఖ్యం మాయం మాయం

శాంతం సౌఖ్యం మాయం  మాయం

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

పెరిగిపోతే పైకం ఎదుగుతుందీ మైకం .. బాబయో.. అబ్బయో .. బాబయో

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో 

Tuesday, February 25, 2025

Oh sita hello my sita (ఓ సీత హల్లో మై సీత) - Seetha Raamayya gari Manavaralu

Song Name :Oh sita hello my sita
Movie:Sita ramaiaha gari manavaralu
Singers:S.P. Balasubramanyam garu garu
Lyricist:Veturi garu
Composer:M.M. Keeravani garu
DirectorKranthi Kumar garu 

ఓ సీత హల్లో మై సీత, చెలి ఓ సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
ఓ సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
ఊరంత సెర్చిన మాయే కదా నన్నూరించి గిల్లేది నీవే కదా 
ఓ సీత చెలి యూ సీత, హల్లో మై సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
వేర్వేరు సెర్చిన నోయే కదా  

సీదా సాది పేరట్టువో ఆంధ్రా ఫేమస్ పెసరట్టువో 
ఐసు నేను కొట్టేవేళ క్రీమైపోయే నా ప్రేమే 
ట్వింకిల్ ట్వింకిల్ స్టారువో చందా అంకుల్ లైటువో 
సైటు నీకు కొట్టే వేళా నైటై పోయే డే టైమే 
ఓ మిస్సా ఒహ్ ఎస్సు అనరాదా 
అదె చేత ఓ కిస్సు కొడితే నే యూ.యెస్. లో పడతానే
ఓ సీత చెలి యూ సీత, హల్లో మై సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
వేర్వేరు సెర్చిన నోయే కదా  
 
ఐసా పైసా తేల్చుకో విసా తెచ్చి ఇచ్చుకో 
వాషింగ్టన్ను తాలూకాకే తాసిల్దారై పోతానే 
వైటుహౌసు తోటలో నైటు క్వీను కోటలో 
ఎంకిపాట బ్రేకే చేసి మంకీ డిస్కో ఆడేస్తా 
ఉసి మీద ఉన్నానే శశిరేఖ అన్నానే రేలంగి మోడల్లో రెచ్చిపోతున్నానే 
ఓ సీత చెలి యూ సీత, హల్లో మై సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 

ఓ సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
ఊరంత సెర్చిన మాయే కదా నన్నూరించి గిల్లేది నీవే కదా 
ఓ సీత చెలి యూ సీత, హల్లో మై సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
వేర్వేరు సెర్చిన నోయే కదా  

Sunday, November 10, 2024

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను (chantabbai)

Song Name :Atlanti itlanti
Movie:Chantabbai
Singers:S.P. Balasubramanyam garu, S.P. Sailaja garu
Lyricist:Veturi Sundararama Murthy garu
Composer:Chakravarthi garu
DirectorJandhyala garu

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను

మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు

స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ

ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి

లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ 

నార్వేలోని మ్యారిమణుల గుండెల దాగిన ఖైదీని 

చల్లపిల్లిలో పిల్లిపిల్లలా దొరికిపోయిన ఖైదీవా 

హాంకాంగులో కింగ్ కాంగ్ నే తలదన్నిన మగధీరుణ్ణీ

బందరులోన బల్లిని చూసి బావురుమన్న మగధీరుడివా.. యా..

నా భాషకూ గ్రామర్ హ్యూమర్, నా ఫేసుకూ గ్లామర్ హ్యూమర్ 

ఇది ఎవరూ నమ్మని రూమర్, ఇక వెయ్యకు నాకీ హేమర్..

నే చార్లీ చాప్లిన్నీ....

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను

మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు

స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ

ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి

లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ 

సిడ్నీ వెళ్ళి కిడ్నీ తీసి దానమిచ్చిన విజేతనూ 

వడ్లపూడి ఇడ్లీ పోటిలో ఓడిపోయిన విజేతవా 

మాస్కో డిస్కో ఒలింపిక్సులో కాస్కోమన్న రాజునీ .. మగమహారాజునీ 

మంగళగిరిలో మహిళామండలి అధ్యక్షతకే అర్హతవున్న మగువరాజువా.. మగమహారాజువా 

నా కంటికి రెప్పలు కామెడి, నా వొంటికి ఊపిరి కామెడి 

వనమంతా చెరిచెను తా చెడీ..డి డి డీ.. అది కోతికి చెందిన ట్రాజెడీ...డి డి డీ...

నే చార్లీ చాప్లిన్నీ....

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను

మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు

స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ

ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి

లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ 

Sunday, September 8, 2024

వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు (Vaah re vaah yemi fesu)

Song Name :Vah re vah yemi fesu
Movie:Money
Singers:Sirivennela garu, Satyam, Srinivasa murthy
Lyricist:Sirivennela Seetarama sastry garu
Composer:Srinivasa  Murthy garu
Director:Siva Nageswara Rao garu

 వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు

వచ్చింది సినిమా ఛాన్సు.. ఇంక వేసేయి మరో డోసు..

వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు

వచ్చింది సినిమా ఛాన్సు.. ఇంక వేసేయి మరో డోసు..

పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డ్యాన్సు...

చెప్పింది చెయ్యరా, నీవెరా ముందు డేసు..

వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు

అమితాబచ్చను కన్నా ఎం తక్కువ నువ్వైన.. హాలివుడ్లో ఐనా ఎవరెక్కువ నీకన్నా..

ఫైటూ, ఫీటు, ఆట, పాట రావా నీకైనా..

చిరంజీవైనా పుడుతూనే మెగాస్టారైపొలేదయ్యా, తెగించే సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా..

బాలయ్యా, వెంకటేషు, నాగార్జునా, నరేషు, రాజేంద్రుడు, సురేషు, రాజశేఖరు అదర్సు 

మొత్తంగా అందరూ అయి పొవాలోయ్ మటాషూ. 

వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు

గూండా, రౌడీ, దాదా అంటారే బైటుంటే.. ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే 

ఓహో అంటూ జైకొడతారు తేడా మేకప్పే.. నువ్వుంటే చాల్లే అంటారు, కథెందుకు పోన్లే అంటారు 

కటౌట్లూ గట్రా కడతారు, టికెట్లకు కొట్టుకు ఛస్తారు  

బావుంది గాని ప్లాను, పల్టీ కొట్టిందో ఏమి గాను 

బేకారీ బాత్ మాను, జర దారు తగ్గించు ఖాను.. 

అరె ఛీ పో.. శకున పక్షిలా తగులుకోకు ముందు 

వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు

వచ్చింది సినిమా ఛాన్సు.. ఇంక వేసేయి మరో డోసు..

Listen & Watch here