Showing posts with label kranthikumar. Show all posts
Showing posts with label kranthikumar. Show all posts

Friday, July 3, 2026

Swara raga ganga pravahame [స్వరరాగ గంగా ప్రవాహమే] - Sarigamalu

Title :swara raga ganga pravahame
Movie:Sarigamalu
Singers:K.J. Yesudas గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Bombay Ravi గారు
Director:Kranthi Kumar గారు

ప్రవాహమే... గంగా ప్రవాహమే  

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక

స్వరరాగ గంగా ప్రవాహమే

కొండలలోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి 

పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి 

మట్టింటి రాయే మాణిక్యమైపోయే, సంగీత రత్నాకరానా 

స్వరసప్తకాలే కెరటాలుకాగా, ఆ గంగ పొంగింది లోన 

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక 

స్వరరాగ గంగా ప్రవాహమే

చైతన్య వర్ణాల ఈ చైత్రసుమగీతి వినిపించు రాగాలనంతాలులే

ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలులే 

పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతలా పుష్యరాగాలులే 

మలిసంధ్య దీపాలు గుడిగంట నాదాలు మౌనాక్షరీ గాన వేదాలులే 

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక

స్వరరాగ గంగా ప్రవాహమే

స్వరరాగ గంగా ప్రవాహమే 

Tuesday, February 25, 2025

Kaliki chilakal koliki (కలికి చిలకల కొలికి మాకు మేనత్త) - Sita Raamayya gari manavaralu

Song Name :Kaliki chilakala koliki
Movie:Sita ramaiaha gari manavaralu
Singers:K.S. Chitra garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:M.M. Keeravani garu
DirectorKranthi Kumar garu 

కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి 

కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి 

అత్తమామల కొలుచు అందాల అతివ, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి

మేనాలు తేలేని మేనకోడల్ని, అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని 

వాల్మీకినే మించు వరస తాతయ్య, మాఇంటికంపించవయ్య మావయ్యా.. 

కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి 

ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి, ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి 

నేటి అత్తమ్మా నాటి కోడలివి, తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి 

తలలోని నాలికై తల్లిగా చూసే, పూలల్లొ దారమై పూజలే చేసే 

నీ కంటి పాపలా కాపురం చేసే, మా చంటి పాపనూ మన్నించి పంపూ 

కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి 

మసకబడితే నీకు మల్లెపూదండా, తెలవారితే నీకు తేనె నీరెండా  

ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు, ఏడు జన్మల పంట మా అత్త చాలు 

పుట్టగానే పూవు పరిమళిస్తుంది, పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది 

తెలుసుకో తెలుసుకో తెలుసుకో 

తెలుసుకో తెలుసుకో మనసున్న మామా, సయ్యోధ్య నేలేటి సాకేత రామా 

కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి 

కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి 

Oh sita hello my sita (ఓ సీత హల్లో మై సీత) - Seetha Raamayya gari Manavaralu

Song Name :Oh sita hello my sita
Movie:Sita ramaiaha gari manavaralu
Singers:S.P. Balasubramanyam garu garu
Lyricist:Veturi garu
Composer:M.M. Keeravani garu
DirectorKranthi Kumar garu 

ఓ సీత హల్లో మై సీత, చెలి ఓ సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
ఓ సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
ఊరంత సెర్చిన మాయే కదా నన్నూరించి గిల్లేది నీవే కదా 
ఓ సీత చెలి యూ సీత, హల్లో మై సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
వేర్వేరు సెర్చిన నోయే కదా  

సీదా సాది పేరట్టువో ఆంధ్రా ఫేమస్ పెసరట్టువో 
ఐసు నేను కొట్టేవేళ క్రీమైపోయే నా ప్రేమే 
ట్వింకిల్ ట్వింకిల్ స్టారువో చందా అంకుల్ లైటువో 
సైటు నీకు కొట్టే వేళా నైటై పోయే డే టైమే 
ఓ మిస్సా ఒహ్ ఎస్సు అనరాదా 
అదె చేత ఓ కిస్సు కొడితే నే యూ.యెస్. లో పడతానే
ఓ సీత చెలి యూ సీత, హల్లో మై సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
వేర్వేరు సెర్చిన నోయే కదా  
 
ఐసా పైసా తేల్చుకో విసా తెచ్చి ఇచ్చుకో 
వాషింగ్టన్ను తాలూకాకే తాసిల్దారై పోతానే 
వైటుహౌసు తోటలో నైటు క్వీను కోటలో 
ఎంకిపాట బ్రేకే చేసి మంకీ డిస్కో ఆడేస్తా 
ఉసి మీద ఉన్నానే శశిరేఖ అన్నానే రేలంగి మోడల్లో రెచ్చిపోతున్నానే 
ఓ సీత చెలి యూ సీత, హల్లో మై సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 

ఓ సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
ఊరంత సెర్చిన మాయే కదా నన్నూరించి గిల్లేది నీవే కదా 
ఓ సీత చెలి యూ సీత, హల్లో మై సీత నీవంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా 
వేర్వేరు సెర్చిన నోయే కదా  

Thursday, November 27, 2014

Odanu Jaripe muchchata kanare from Rajeswari Kalyanam [ఓడను జరిపే ]

Song Name :Odanu Jaripe..
Movie:Rajeswari Kalyanam
Singers:S.P. Balu, Chitra
Lyricist:Veturi Sundararama Murthy
Composer:M.M.Keeravani
DirectorKranthi Kumar

పల్లవి:
ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...
ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...
ఆడువారు యమునకాడా...ఆ ఆ ఆ...
ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి..
ఆడుచు పాడుచు అందరూ చూడగా...
ఓడను జరిపే ముచ్చట కనరే..ఏ.. 

చరణం1:
వలపుతడీ తిరనాలే.. పొంగిన యేటికి అందం..
కెరటాలకు వయ్యారం.. కరిగే తీరం..
తిలకమిడీ.. కిరణాలే..పొద్దుటి తూరుపుకందం.
చినదానికి సింగారం.. సిగమందారం..
పదాల మీదే పడవ.. పెదాలు కోరే గొడవ..
ఎదల్లో మోగే దరువే.. కదంగానావే నడవ.. 
ఇలా నీలాటిరేవులో..

ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...
ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...

చరణం2:
చిలిపితడీ వెన్నలలే గౌతమి కౌగిలికందం..
తొలిజోలకు శ్రీకారం.. నడకే భారం..
ఉలికిపడే ఊయలలే.. కన్నుల పాపలకందం..
నెలవంకల శీమంతం ఒడిలో దీపం..
తరాలు మారే జతలే.. స్వరాలు పాడే కథలో..
సగాలై పోయే మనువే సృజించే మూడో తనువే..
త్యాగయ్య రామ లాలిలో..

ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...
ఓడను జరిపే ముచ్చట కనరే..