Showing posts with label p.suseela. Show all posts
Showing posts with label p.suseela. Show all posts

Friday, September 25, 2026

Janaki kala ganaledu [జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు] - Rajkumar

Title :Janaki kalaganaledu
Movie:Rajkumar
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela  గారు
Lyricist:Veturi sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Gutta Raamineedu గారు

జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు 

ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం మన జీవన పారాయణం 

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు 

చెలిమనసే శివధనుస్సైనది తొలిచూపుల వశమైనది

వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది

ఒక బాణము ఒక భార్యన్నది శ్రీరాముని చిర యశమైనది

శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి

తొలిచుక్కవు నీవే చుక్కానివి నీవే

తుదిదాకా నీవే మరుజన్మకు నీవే

జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు 

సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం 

ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం 

సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం

ప్రతిరోజూ ఒక శ్రీకారం పరవశ శృంగారం 

గతమంటే నీవే కథ కానిది నీవే 

కలలన్నీ నావే కలకాలం నీవే 

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు 

జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం మన జీవన పారాయణం  

Monday, January 20, 2025

Iruvuru bhamala kougililo [ఇరువురు భామల కౌగిలిలో స్వామీ] - Naari Naari Naduma Murari

Song Name :Iruvuru bhaamala kougililo
Movie:Naari Naari Naduma Murari
Singers:S.P. Balasubramanyam garu, P. Suseela garu
Lyricist:Acharya Atreya garu
Composer:K.V. Mahadevan garu
DirectorA. Kodanda rami reddy garu

ద్వాపరమంతా సవతులసంత జ్ఞాపకముందా గోపాలా 

కలియుగమందు ఇద్దరిముందు శిలవయ్యావే శ్రీలోలా 

కాపురాన ఆపదలను ఈదిన శౌరీ, ఏదీ నాకూ చూపవా ఒక దారి 

నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి 

ఇరువురు భామల కౌగిలిలో స్వామీ, ఇరుకున పడి నీవు నలిగితివా 

ఇరువురు భామల కౌగిలిలో స్వామీ, ఇరుకున పడి నీవు నలిగితివా 

వలపుల వానల జల్లులలో స్వామీ, తలమునకలుగా తడిసితివా 

చిర్రుబుర్రులాడేటి శ్రీదేవీ, నీ శిరస్సును వంచిన కధ కన్న

రుసరుసలాడేటీ భూదేవీ నీ పరువును తీసినా కధ విన్న

గోవిందా... గోవిందా... గోవిందా

సాగిందా జోడుమద్దెల సంగీతం, బాగుందా భామలిద్దరి బాగోతం

ఇంటిలోన పోరంటె ఇంతింత కాదయ, అన్నాడు ఆ యోగి వేమన

నా తరమా భవసాగరమీదను, అన్నాడు కంచర్ల గోపన్న  

పరమేశా  గంగవిడుము పార్వతి చాలు, ఆ మాటలు విని ముంచకు స్వామీ గంగను 

ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే, సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే

ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే, సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే

ఇరువురు భామల కౌగిలిలో స్వామీ, ఇరుకున పడి నీవు నలిగితివా 

భామ కాలు తాకిందా, కృష్ణుడే గోవింద, అన్నాడు ఆ నంది తిమ్మన 

ఒక మాట ఒక బాణము ఒక సీత నాదనే, అన్నాడు సాకేత రామన్నా

ఎదునాధ భామ విడుము రుక్మిణి చాలున్, రఘునాధ సీతనుగొని విడు శూర్పనఖన్ 

రాసలీలలాడాలని నాకులేదులే, భయ భక్తులున్న భామ ఒకతే చాలులే 

రాసలీలలాడాలని నాకులేదులే, భయ భక్తులున్న భామ ఒకతే చాలులే 

ఇరువురు భామల కౌగిలిలో స్వామీ, ఇరుకున పడి నీవు నలిగితివా 

వలపుల వానల జల్లులలో స్వామీ, తలమునకలుగా తడిసితివా 

గోవిందా... గోవిందా... గోవిందా

Friday, January 17, 2025

Aakulo Aakunai puvvulo puvvunai [ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై] - Meghasandesam

Song Name :Aakulo aakunai
Movie:Meghasandesam
Singers:P. Suseela  garu
Lyricist:Devulapalli Krishna sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై 

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై 

జలజలని పారు సెలపాటలో తేటనై  

పగడాల చిగురాకు తెరచాటు చేతినై

పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై 

ఈ అడివి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడివి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల 

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల 

చదలెక్కి చలదంపు నీలంపు నిగ్గునై 

ఆకలా దాహమా చింతలా వంతలా  

ఈ కదలీ వెర్రినై ఏకతమా తిరుగాడ   

ఈ అడివి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడివి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా