Showing posts with label vijaybhaskar. Show all posts
Showing posts with label vijaybhaskar. Show all posts

Tuesday, April 22, 2025

Akasam digivachchi [ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి ] - Nuvvu Naku Nachchav

Song Name :Aakasam digi vachchi
Movie:Nuvvu Naku nachchav
Singers:S.P. Balasubramanyam garu 
Lyricist:Sirivennela Seeta Rama Sastry garu
Composer:Koti garu
Director:Vijay Bhaskar garu

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం

ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం

మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే 

అక్షింతలేసి ఆశిర్వదించమను పిలుపులైనవి గాలులే 

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

చెంపలో విరబూసె అమ్మాయి సిగ్గుదొంతరలు, ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు 

ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో , వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో

తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా

ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా..

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు, సన సన్నగా రుసరుసలు వియ్యాలవారి గుసగుసలు

సందుచూసి చకచక ఆడే జూదశిఖామణులు, పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు 

తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 

తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ..

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం

ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం

మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే 

అక్షింతలేసి ఆశిర్వదించమను పిలుపులైనవి గాలులే 

Tuesday, March 4, 2025

Marala Telupana (మరల తెలుపన ప్రియా) - Swayamvaram

Song Name :Marala telupana
Movie:Swayamvaram
Singers:K.S. Chitra garu
Lyricist:Bhuvana Chandra garu
Composer:Vandemataram Srinivas garu
DirectorVijay bhaskar garu 

మ ప మ ప ని రి మ రి మ స

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా 

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా 

యెదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని 

యెదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని 

కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా 

విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని 

విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని 

అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని 

అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని 

నిదురపోని కన్నులలో పవళించు ఆశలని 

చెప్పలేక చేతకాక మనసుపడే తడబాటుని 

మరల తెలు...ప్రియా..మరల తెలుపన 

నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూసి 

నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూసి 

మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి

మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి

ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన 

తెలియరాక తెలుపలేక మనసుపడే మధురబాధ  

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా 

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా