Showing posts with label sukumar. Show all posts
Showing posts with label sukumar. Show all posts

Saturday, January 10, 2026

entha sakkagunnave [ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే] - Rangasthalam

Title :entha sakka gunnave
Movie:Rangasthalam
Singers:Devi Sri Prasad గారు
Lyricist:Chandrabose గారు
Composer:Devi Sri Prasad గారు
Director:Sukumar గారు

క్రింది పాటలో కోస్తాంధ్ర మాండలిక ప్రయోగాలని సాహిత్యంలో మార్చకుండ రాసాను.

ఏరుశెనగకోసం మట్టిని తవ్వితే ఎకంగా తగిలిన లంకెబిందెలాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే, సేతికి అందిన చందమామలాగా  

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

మల్లెపూల మధ్య ముద్దబంతిలాగా ఎంత సక్కగున్నావే 

ముత్తైదువా మెళ్ళో పసుపుకొమ్ములాగా ఎంత సక్కగున్నావే 

సుక్కలసీర కట్టుకున్న ఎన్నెలలాగ ఎంత సక్కగున్నావే 

ఏరుశెనగకోసం మట్టిని తవ్వితే ఎకంగా తగిలిన లంకెబిందెలాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే, సేతికి అందిన చందమామలాగా  

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

ఓ, రెండుకాళ్ళ సినుకువి నువ్వు, గుండేసేన్లో దూకేసినావు  

అలల మూటా ఇప్పేసినావు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

మబ్బులేని మెరుపువి నువ్వు నేలమీద నడిసేసినావు 

నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

సెరుకుముక్క నువ్వు కొరికి తింటావుంటే ఎంత సక్కగున్నావే 

సెరుకుగెడకే తీపిరుసి తెలిపినావే ఎంత సక్కగున్నావే 

తిరనాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చినతల్లి సిరునవ్వులాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

గాలిపల్లకీలో ఎంకిపాటలాగా, ఎంకిపాటలోన తెలుగుమాటలాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

కడవనువ్వు నడుమనబెట్టి కట్టమీదనడిసొత్తావుంటే, సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

కట్టెలమోపు తలకెత్తుకోని అడుగులోన అడుగేత్తావుంటే అడవినీకు గొడుగట్టినట్టు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

బురదసేలో వరినాటు ఏత్తావుంటే ఎంత సక్కగున్నావే 

భూమిబొమ్మకు నువ్వు ప్రాణంబోస్తునట్టు ఎంత సక్కగున్నావే 

ఏరుశెనగకోసం మట్టిని తవ్వితే ఎకంగా తగిలిన లంకెబిందెలాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే, సేతికి అందిన చందమామలాగా  

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

Sunday, August 24, 2025

Ranga Ranga Rangasthalana [రంగా రంగ రంగస్థలానా] - Rangasthalam

Title :Ranga ranga rangastalana
Movie:Rangasthalam
Singers:Rahul Sipligunj
Lyricist:Chandrabose గారు
Composer:Devi Sri Prasad గారు
Director:Sukumar గారు

రంగా రంగ రంగస్థలానా...  ఊ..

రంగా రంగ రంగస్థలానా...  ఊ.. ఓ..హో.

వినబడేట్టు కాదురా, కనబడేట్టు కొట్టండెహే ..

రంగా రంగ రంగస్థలానా రంగుపూసుకోకున్నా వేషమేసుకోకున్నా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

హే, రంగా రంగ రంగస్థలానా ఆటమొదలెట్టాకా మధ్యలోని ఆపలేని 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

కనపడని సెయ్యేదో ఆడిస్తున్నా ఆటబొమ్మలం అంటా

వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలుబొమ్మలం అంటా 

డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 

హే.. డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 

గంగంటే శివుడుగారి పెళ్ళామంటా, గాలంటే హనుమంతుడి నాన్నగారటా 

గాలిపీల్చడానికైన గొంతుతడవడానికైన వాళ్ళు కనికరించాలంట  

వేణువంటే కిట్టమూర్తి వాద్యం అంటా, శూలమంటె కాళికమ్మ ఆయుధమంట 

పాటపాడడానికైన పోటుపొడవడానికైన వాళ్ళు ఆనతిస్తేనే అన్నీ జరిగేనంట 

రంగా రంగ రంగస్థలానా రంగుపూసుకోకున్నా వేషమేసుకోకున్నా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

పదితలలు ఉన్నోడు రావణుడంట, ఒక్కతలపుకూడ చెడులేదే రాముడికంట 

రామరావణులబెట్టి రామాయణమాటగట్టి మంచిచెడులమధ్య మనని పెట్టారంట 

ధర్మన్ని తప్పనోడు ధర్మరాజట, దయలేనివాడు యమధర్మరాజట  

వీడిబాట నడవకుంటె వాడివేటు తప్పదంటు ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట 

రంగా రంగ రంగస్థలానా ఆడడానికంటెముందు సాధనంటుసెయ్యలేని 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

హే.. డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 

డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 

Saturday, March 8, 2025

Uppenanta ee premaki [ఉప్పెనంత ఈ ప్రేమకి] - Aarya 2

Song Name :Uppenanta ee Premaki
Movie:Aarya 2
Singers:K.K garu
Lyricist:Balaji
Composer:Devi Sri Prasad garu
DirectorSukumar (Sukku) garu 

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెండంత గుండె ఏమిటో 

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో

రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో 

నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో 

రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని సెక్షన్లెందుకో

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెండంత గుండె ఏమిటో 

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు, సెకనుకోసారైనా చంపేస్తావూ

మంచులా ఉంటావు మంట పెడుతుంటావు, వెంటపడి నా మనస్సు మసిచేస్తావూ

తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి

గుచ్చుకోకు ముళ్ళులా మరి గుండెల్లో సరాసరీ..

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెండంత గుండె ఏమిటో 

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే, మబ్బులే పోగేసి కాల్చేయ్యనా 

చీలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే, తొలకరే లేకుండా పాతెయ్యనా 

నిన్నుకోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే 

నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడెస్తా ఆ కళ్ళనే  

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెండంత గుండె ఏమిటో 

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో