| Song Name : | Goruvecchani suridamma |
| Movie: | Jayasudha |
| Singers: | P. Suseela గారు |
| Lyricist: | C. Narayana reddy (sinare) గారు |
| Composer: | Ramesh Naidu గారు |
| Director | K.V. Nandana rao గారు |
గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా రావద్దన్నా, గుండెల్లో గుడిసవేసి అది గుడిగాచేసి
ఆ గుడిలో దాగున్నాడమ్మా, ఆ గుడిలో దాగున్నాడమ్మ
గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
మిట్టమధ్యానం నడినెత్తిన వచ్చాడు
మిట్టమధ్యానం నడినెత్తిన వచ్చాడు, ఒంటరిగా పోతుంటే వెంటెంట పడ్డాడు
వినకుండా పోతుంటే అరిసరిసీ పిలిచాడు ...ఆ...
పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు, యెతికి యెతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు
ఆ ఏడిదిగాలంటే నా తోడుకావాలంట, నే తోడుఇస్తానంటే తను దిగివస్తాడంటా
గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
పొద్దుగూకేవేళ ఎదురుగా వచ్చాడు
పొద్దుగూకేవేళ ఎదురుగా వచ్చాడు, వెనుతిరిగిపోతుంటే ఎనకెనకా పిలిచాడు
పోనీ అని తిరిగితే ఎరుపెక్కి ఉన్నాడు ఆ...
ఆగి ఆగి ఆగలేక దిగివచ్చానన్నాడు, చూసి చూసి మత్తెక్కి పిచ్చెత్తిందన్నాడు
ఆ పిచ్చిదిగాలంటే నా తోడుకావాలంట, నే తోడు ఇస్తానంటే పొమ్మన్నా పోడంట
గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా రావద్దన్నా, గుండెల్లో గుడిసవేసి అది గుడిగాచేసి
ఆ గుడిలో దాగున్నాడమ్మా, ఆ గుడిలో దాగున్నాడమ్మ
గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

No comments:
Post a Comment