| Title : | rAma kanavEmirA |
| Movie: | Swathi muthyam |
| Singers: | S.P. Bala Subramanyam గారు |
| Lyricist: | C Narayana Reddy గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | K. Viswanath గారు |
రామ కనవేమిరా.. రామ కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా ... రామ కనవేమిరా
రమణీలలామ నవలావణ్యసీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడిరాగా....
రామ కనవేమిరా...
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట ..
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని.. సభాసదులందరు పదే పదే చూడగా
శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమయ్యా అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనూంగు చెలికత్తెలు
రామ కనవేమిరా.. రామ కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా ... రామ కనవేమిరా
రమణీలలామ నవలావణ్యసీమ .. ఆ..
రమణీలలామ నవలావణ్యసీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడిరాగా....
రామ కనవేమిరా
ముశి ముశి నగవుల రసిక శిఖామణులు... సానిదమ పమగరిస
ఒస పరి చూపుల అసదృస విక్రములు.. సగరిగ మనిదమనిని
ముశి ముశి నగవుల రసిక శిఖామణులు... తాతకిట తకఝణుత
ఒస పరి చూపుల అసదృస విక్రములు.. తకఝణు తకధిమితక
మీసం మీటే రోషపరాయణులు నీ.దమ పమా.గరిగ
మా సరి ఎవరను మత్తగులోల్మణులు అహా..
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామ కనవేమిరా.. కనవేమిరా..
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలుకక్కిన దొరలు భూవరులు
తొడగొట్టి ధనువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలుకక్కిన దొరలు భూవరులు .. భూవరులు
తొడగొట్టి ధనువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొఖమెత్తాలెక సిగ్గేసిన నరపుంగవులు
తమ వొళ్ళూ వొరిగి రెండు కళ్ళూ తిరిగి వొగ్గేసిసిన పురుషాగ్రణులు
ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
ఆ ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అరెరెర్రెరె ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అహ ఎత్తేవారు.. లేరా.. అ విల్లు ఎక్కుపెట్టే.. వారు.. లేరా ... తకతయ్యకు తాధిమితా
రామాయ రామభద్రాయా రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు ఆవింటి మీదా చెయ్యి వేసినాడు..
అంతలో రామయ్య లేచినాడు ఆవింటి మీదా చెయ్యి వేసినాడు..
సీతవంక ఓరకంట చూసినాడు... సీతవంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు.. చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు
పెళ పెళ.. పెళ పెళ.. పెళ పెళ.. పెళ పెళ..
పెళ పెళ.. విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు
జయ జయ రామ .. రఘుకుల సోమ.. జయ జయ రామ .. రఘుకుల సోమ..
దశరధ రామ దైత్యవిరామ.. దశరధ రామ దైత్యవిరామ..
జయ జయ రామ .. రఘుకుల సోమ.. జయ జయ రామ .. రఘుకుల సోమ..
దశరధ రామ దైత్యవిరామ.. దశరధ రామ దైత్యవిరామ..
సితాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
సితాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయ్యమే .. అనగ అనగ రమణీయ్యమే
కనగ కనగ కమనీయ్యమే .. అనగ అనగ రమణీయ్యమే
సితాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
రామయ్యా అదిగోనయ్య ..
రమణీలలామ నవలావణ్యసీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడిరాగ....
రామ కనవేమిరా శ్రీరఘురామ కనవేమిరా ... రామ కనవేమిరా.. కనవేమిరా

Excellent Lyrics.. Beauty of Telugu language can be shown in lyrics
ReplyDeleteExcellent lyrics. Beauty of Telugu language can be shown in lyrics
ReplyDeleteAwesome lyrics
ReplyDeleteVery difficult song to write ....it is mix of literary and folk
ReplyDeleteSong Lyricist by C. Narayana Reddy, please see and correct
ReplyDeleteGoddess
ReplyDeleteGoddess
ReplyDeleteచాలా బాగా సాహిత్యం ఉంచారు మీకు ప్రత్యేక ధన్యవాదములు.
ReplyDelete🙏🙏
ReplyDeleteThey are many mistakes in the lyrics please correct them, examples చూడడేమయ్యా, మాదరి, ఓ వరుడు, తొడగొట్టి ధరువు etc
ReplyDeleteDhanyosmi.
ReplyDeleteదన్యోస్మి మాతే దన్యోస్మి🙏🙏🙏🌻🌻🌞🌞
ReplyDelete