Movie : Maathrudevobhava
Language : Telugu
Music Dir: M.M. Keeravaani
Lyrics: Veturi
Singer: M.M. Keeravaani
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే తొటమాలినీ తోడులేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే లొకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా కలికీ రాచిలకా పాడకు నిన్నటి నీ రాగం
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే తొటమాలినీ తోడులేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే లొకమెన్నడో చీకటాయెలే
చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గొరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లొ చేరగ మనసు మాంగళ్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే తొటమాలినీ తోడులేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే లొకమెన్నడో చీకటాయెలే
అనుభంధమంటేనే అప్పులే కరిగే భంధాలన్ని మబ్బులే హేమంతరాగాల చేమంతులే వాడిపోయే
తనరంగుమార్చింది రక్తమే తనతఒ రానంది పాశమే దీపాల పండక్కి దీపాలుకొండెక్కి పొయే
పగిలేఆకాశము నీవై జారిపడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగతెగే వీణియవై