Title : | Are emaindi |
Movie: | Aaraadhana [Chiranjeevi] |
Singers: | S.P. Balu గారు, and S. Janaki గారు |
Lyricist: | Aacharya Aatreya గారు |
Composer: | Illayaraja గారు |
Director: | Bhaarathi Raaja |
అరె ఏమైంది.....
అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది..
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది..
అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది..
నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది.. నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది..
పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను.. నేలపైన కాళ్ళులేవు - నింగివైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు.. అది దోచావూ...ల ల ల
బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది.. పాడలేని గొంతులోన పాటఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు.. మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు
రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో.. చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు.. మనిషౌతాడూ..
అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది..
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది..
అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది..
Watch and Listen
English
are EmaiMdi.....
are EmaiMdi.. oka manasuku rekkalochchi ekkaDiko egiriMdi..
adi EmaiMdi.. tana manishini vedukutu ikkaDochchi vAliMdi..
kalagAni kalaEdo kaLLeduTe nilichiMdi..adi nIlo mamatanu niddura lEpiMdi..
are EmaiMdi.. oka manasuku rekkalochchi ekkaDiko egiriMdi..
adi EmaiMdi..
niMgi vaMgi nElatOTi nEstamEdo kOriMdi.. nEla poMgi niMgi kOsam pUladOsilichchiMdi..
pUlu nEnu chUDalEnu - pUjalEvi chEyalEnu.. nElapaina kALLulEvu - niMgivaipu chUpulEdu
kannepilla kaLLalOki ennaDaina chUsAvo kAnarAni guMDelOki kannamEsi vachchAvu.. adi dOchAvU...la la la
bIDulOna vAna chinuku.. pichchi molaka vEsiMdi.. pADalEni goMtulOna pATaEdo palikiMdi
guMDe okkaTunna chAlu.. goMtu tAne pADagaladu.. mATalanni dAchukuMTe pATa nIve rAyagalavu
rAta rAnivADi rAta dEvuDEmi rAsADO.. chEtanaite mArchichUDu vIDu mAripOtADu.. maniShoutADU..