Showing posts with label aditya369. Show all posts
Showing posts with label aditya369. Show all posts

Sunday, June 7, 2026

Chilipi yatralo [చిలిపియాత్రలో ఛల్ ఛల్ ] - Aditya 369

Title :Chilipi yatralo
Movie:Aditya 369
Singers:K.S. Chitra గారు, S.P. Balasubramanyam గారు
Lyricist:Sirivennela Seetarama sastry గారు
Composer:Illayaraja గారు
Director:Singeetam Sreenivasa rao గారు

చిలిపియాత్రలో ఛల్ ఛల్ ఛల్ ఛల్, జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో

పడుచుగుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్, తెలుసుకుందిలే ఫ్యుచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో 

పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో... అరెరెరే 

చిలిపియాత్రలో ఛల్ ఛల్ ఛల్ ఛల్, జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో

పడుచుగుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్, తెలుసుకుందిలే ఫ్యుచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

ఎదురుగ వుంది ఏదో వింత, పదపద చూద్దాం ఎంతో కొంత

కలలకు కూడా కొత్తే ఔనా, కనబడలేదే నిన్న మొన్న

కనులవిందుగా ఉందీ లోకం, కనక ఇక్కడే కాస్సేపింకా ఉందాం

కలవరింతలా ఉందీ రాగం, కనక మెల్లగా మళ్ళి మళ్ళీ విందాం

ఎవర్నైన హలో అందాం, ఎటేముందో కనుక్కుందాం 

టుమారోల సమాచారమంతా సులువుగ తెలిసిన తరుణము కద ఇది 

చిలిపియాత్రలో ఛల్ ఛల్ ఛల్ ఛల్, జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో

పడుచుగుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్, తెలుసుకుందిలే ఫ్యుచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో 

పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో... అరెరెరే 

చిలిపియాత్రలో ఛల్ ఛల్ ఛల్ ఛల్, జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో

పడుచుగుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్, తెలుసుకుందిలే ఫ్యుచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

వినపడలేదా కూ కూ వెల్‌కం, అథిధులమంటూ అన్సెర్ చేద్దాం

తళ తళలాడే తారా తీరం, తలుపులు తీసే దారే చూద్దాం 

మునుపు ఎప్పుడూ లేదీ మైకం, మయుడి మిస్టరీ ఎమో ఈ మా లోకం 

మెదడు విక్టరీ చేసే చిత్రం, తెలివి డిక్ష్నరీ చెప్పే మాయా మంత్రం 

నిదానించి ప్రవేశిద్దాం, రహస్యాలు పరీక్షిద్దాం 

కనుకున్న చమత్కారాలన్ని చిలవలు పలవలు కలిపి తెలుపుదాం

చిలిపియాత్రలో ఛల్ ఛల్ ఛల్ ఛల్, జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో

పడుచుగుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్, తెలుసుకుందిలే ఫ్యుచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో 

పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో... అరెరెరే 

చిలిపియాత్రలో ఛల్ ఛల్ ఛల్ ఛల్, జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో

పడుచుగుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్, తెలుసుకుందిలే ఫ్యుచర్ మంజిల్ ఇప్పుడే అందుకో 

Thursday, November 27, 2014

Century lu kotte [సెంచరీలు కొట్టే] from Aditya 369

Song Name :Century lu kotte..
Movie:Aditya 369
Singers:S.P. Balu, S.Janaki
Lyricist:Veturi Sundararama Murthy
Composer:Ilayaraja
DirectorSingeetam Srinivasa Rao

ఆలాపన (గుస గుస):
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ..
బౌండరీలు దాటే మనస్సు మాదీ..

పల్లవి:

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ..
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
చాకిరీలనైనా మజామజావళీలు చేసి
పాడు సోలో.. ఇక ఆడియోలో
వీడియోలో..చెలి జోడియోలో..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ..
బౌండరీలు దాటే మనస్సు మాదీ..

చరణం1:
మేఘమాలనంటుకున్న యాంటెనాలతో..
మెరుపుతీగ మీటిచూడు తందనాలతో..
సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో.. 
వలపు వేణువూది చూడు వందనాలతో.. 
చక్రవాక వర్షగీతి వసంతవేళ పాడు
తుళ్ళిపడ్డ ఈడుజోడు తుఫానులో..
కన్నెపిల్ల వాలుచూపు కరెంటు షాకుతిన్న
కుర్రవాళ్ళ ఈలపాట ఉషారులో..
లైఫు వింత డాన్సు.. లిఖించు కొత్త ట్యూన్సు..
ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు..
వాయులీన హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ..

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
చాకిరీలనైనా మజామజావళీలు చేసి 
పాడు సోలో.. ఇక ఆడియోలో
వీడియోలో..చెలి జోడియోలో..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..

చరణం2: 
వెచ్చనైన ఈడుకున్న వేవులెంక్తు లో
రెచ్చి రాసుకున్న పాటకెన్ని పంక్తులో...
విచ్చుకున్న పొద్దుపూవు ముద్దు తోటలో..
కోకిలమ్మ పాటకెన్ని కొత్త గొంతులో..
ఫాక్సుట్రాటు బీటు మీద పదాలు వేసిచూడు..
హార్టు బీటు కలుపుకున్న లిరిక్కులో..
కూచిపూడి గజ్జెమీద ఖవాలి పాడిచూడు 
కమ్ముకున్న కౌగిలింత కథక్కులో..
నిన్న మొన్న కన్నా.. నిజనిజాలకన్నా..
గతాగతాల కన్నా.. ఇవాళనీది కన్నా..
పాటలన్ని పూవులైన తోట లాంటి లేత యవ్వనాన..

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
చాకిరీలనైనా మజామజావళీలు చేసి
పాడు సోలో.. ఇక ఆడియోలో
వీడియోలో..చెలి జోడియోలో..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..

జింగిచాకు చచ్చ జిజిక్కుచాచా..
జింగిచాకు చచ్చ జిజిక్కుచాచా..

Friday, April 26, 2013

Jaanavule Varavinavule [నెరజాణవులే వరవీణవులే] - Aditya 369

Title :Jaanavule varavinavule
Movie:Aditya 369
Singers:Jikki గారు, S.P. Balasubramanyam గారు, S.P. Sailaja
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:Singeetam Sreenivasa rao గారు

నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలొ.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 
కన్నులలొ సరసపు వెన్నెలలే.. సన్నలలొ గుసగుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో.. 
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 

మోమటుదాచి మురిపెం పెంచే లాహిరిలొ అహహహా... 
మూగవుగానే మురళినివూదే వైఖరిలొ 
చెలివొంపులలొ హంపికళ వూగే ఉయ్యాల.. చెలి పైయెదలొ తుంగ అలా పొంగే ఈ వేళ 
మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా..
జాణవులే వరవీణవులే కిలికించితాలలో.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 
కన్నులలొ సరసపు వెన్నెలలే.. సన్నలలొ గుసగుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో.. 
జాణవులే వరవీణవులే కిలికించితాలలో.. అహహహా.. 
నెరజాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ  

చీకటికోపం చెలిమికి లాభం కౌగిలిలో.. అహహాహహా.. ఒహొహోహొహో..
వెన్నెలతాపం వయసుకు ప్రాణం ఈ చలిలొ..
చెలి నారతిలా హారతిల నవ్వాలీవేళ.. తొలిసోయగమే ఓసగమై ఇవ్వాలీవేళ 
పరువానికి పగవానికి ఒకన్యాయమింక సాగున..

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 
కన్నులలొ సరసపు వెన్నెలలే.. సన్నలలొ గుసగుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో.. 
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 

Watch and Listen

English

nerajANavulE varavINavulE giligiMchitAlalo.. ahahahA.. 
jANavulE mRudupANivilE madhusaMtakAlalo 
kannulalo sarasapu vennelalE.. sannalalo gusagusa temmeralE..
mOvigani moggagani mOjupaDina vELalO.. 
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA.. 
jANavulE mRudupANivilE madhusaMtakAlalo 

mOmaTudAchi muripeM peMchE lAhirilo ahahahA... 
mUgavugAnE muraLinivUdE vaikharilo 
chelivoMpulalo haMpikaLa vUgE uyyAla.. cheli paiyedalo tuMga alA poMgE I vELa 
maryAdaku viripAnupu savariMchavEmirA..
jANavulE varavINavulE kilikiMchitAlalO.. ahahahA.. 
jANavulE mRudupANivilE madhusaMtakAlalo 
kannulalo sarasapu vennelalE.. sannalalo gusagusa temmeralE..
mOvigani moggagani mOjupaDina vELalO.. 
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA.. 
nerajANavulE mRudupANivilE madhusaMtakAlalo  

chIkaTikOpaM chelimiki lAbhaM kougililO.. ahahAhahA.. ohohOhohO..
vennelatApaM vayasuku prANaM I chalilo..
cheli nAratilA hAratila navvAlIvELa.. tolisOyagamE Osagamai ivvAlIvELa 
paruvAniki pagavAniki okanyAyamiMka sAguna..