| Title : | Raayinaina kaakapothini |
| Movie: | Gorantha Deepam |
| Singers: | P. Suseela గారు |
| Lyricist: | Aarudra గారు |
| Composer: | K.V. Mahadevan గారు |
| Director: | Baapu గారు |
రాయినైన కాకపోతిని రామపాదము శోకగ.. బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ..
కడవనైన కాకపోతిని స్వామికార్యము తీర్చగ.. పాదుకైన కాకపోతిని భక్తిరాజ్యమునేలగ..
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా.. అందువలనా రామచంద్రుని అమిత కరుణను నోచనా..
కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయన.. కాలమెల్ల రామభద్రుని నీలిగురుతులు మోయన
రాయినైన కాకపోతిని రామపాదము శోకగ.. బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ..
కాకినైన కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ.. గడ్డీ పోచను శరముచెసి ఘనత రాముడు చూపగ..
మహిని అల్పజీవులే ఈ మహిమలన్ని నోచగ.. మనిషినై జన్మించినాను మత్సరమ్ములు రేపగ.. మదమత్సరమ్ములు రేపగ...
రాయినైన కాకపోతిని రామపాదము శోకగ.. బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ..
Watch and Listen
English
rAyinaina kAkapOtini rAmapAdamu SOkaga.. bOyanaina kAkapOtini puNyacharitamu pADaga..
kaDavanaina kAkapOtini swAmikAryamu tIrchaga.. pAdukaina kAkapOtini bhaktirAjyamunElaga..
aDavilOpala pakShinaitE ativa sItanu kAchanA.. aMduvalanA rAmachaMdruni amita karuNanu nOchanA..
kaDali gaTTuna uDatanaitE buData sAyamu chEyana.. kAlamella rAmabhadruni nIligurutulu mOyana
rAyinaina kAkapOtini rAmapAdamu SOkaga.. bOyanaina kAkapOtini puNyacharitamu pADaga..
kAkinaina kAkapOtini ghAtukammunu chEyuchU.. gaDDI pOchanu Saramuchesi ghanata rAmuDu chUpaga..
mahini alpajIvulE I mahimalanni nOchaga.. manishinai janmiMchinAnu matsarammulu rEpaga.. madamatsarammulu rEpaga...
rAyinaina kAkapOtini rAmapAdamu SOkaga.. bOyanaina kAkapOtini puNyacharitamu pADaga..