Showing posts with label g. Anand. Show all posts
Showing posts with label g. Anand. Show all posts

Saturday, April 4, 2026

Dikkulu chudaku ramayya [దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా] - Kalpana

Title :Dikkulu chudaku ramayya
Movie:Kalpana
Singers:G. Anand గారు, P. Suseela గారు
Lyricist:Veturi sundara rama murthy గారు
Composer:Chakravarthi గారు
Director:K. Raghavendra Rao గారు

దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా 

దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా.. సీతమ్మా

సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకురావే ముద్దులగుమ్మ 

సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకురావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ 


ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగిఉంటావో

ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగిఉంటావో

కదలికలన్ని కధలుగ అల్లి కవితలే రాసుకుంటావో.. రామయ్యా

పొన్నలు పూచిన నవ్వు సిరి వెన్నెల దోచి నాకివ్వు 

పొన్నలు పూచిన నవ్వు సిరి వెన్నెల దోచి నాకివ్వు ..

ఆ వెన్నెలలో నీ కన్నులలో ...

ఆ వెన్నెలలో నీ కన్నులలో 

సన్నజాజులేరు కను సన్నజాజులేరు

సన్నజాజులేరు కను సన్నజాజులేరు.. సీతమ్మా.. సీతమ్మా 

దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా

సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకురావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ 


కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో..

కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో..

కలలిక మాని కలయికలో నా కనులలో చూసుకుంటావో .. రామయ్యా

వెల్లువలైనది సొగసు తొలి వేకువ నీ మనసు 

వెల్లువలైనది సొగసు తొలి వేకువ నీ మనసు 

ఆ వెల్లువలో నా పల్లవిలో 

ఆ వెల్లువలో నా పల్లవిలో 

రాగమే పలికించు అనురాగమై పులకించు 

రాగమే పలికించు అనురాగమై పులకించు సీతమ్మా సీతమ్మా 

దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా

సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకురావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ  

Saturday, June 7, 2025

Oka Venuvu vinipinchenu [ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక] - America Ammayi

Song Name :Oka Venuvu vinipinchenu
Movie:America Ammayi
Singers:G. Anand garu
Lyricist:Mylavarapu Gopi garu
Composer:G.K Venkatesh garu
DirectorSingeetam Srinivasa Rao garu 


ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక 

ఒక రాధిక అందించెను నవరాగ మాలిక 

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక 


సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో 

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో 

నవమల్లిక చినబోయెను, నవమల్లిక చినబోయెను, చిరునవ్వు సొగసులో 

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక 


వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెను 

వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెను 

రేరాణియె నా రాణికి, రేరాణియె నా రాణికి పారాణి పూసెను 

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక 


ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా

ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా

నా గుండెలో వెలిగించెను, నా గుండెలో వెలిగించెను సింగార దీపిక