Showing posts with label chanti. Show all posts

Saturday, May 3, 2025

Paavuraniki panjaraniki (పావురానికి పంజరానికి పెళ్ళిచేసె పాడులోకం ) - Chanti

Song Name :Pavuraniki panjaraniki
Movie:Chanti
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Veturi Sundara Rama murthy garu
Composer:Illayaraja garu
Director:Raviraja Pinisetti garu

పావురానికి పంజరానికి పెళ్ళిచేసె పాడులోకం 

కాళరాత్రికి చందమావకి ముళ్ళుపెట్టె మూఢలోకం 

కొడిగట్టిన దీపాలే గుడిహారతులయ్యేనా... ఓ..ఓ..ఓ..

తానిచ్చుపాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లి

లాలించు పాటలో నీతంత తెలిపీ పెంచింది నాలోన మంచి

కపటలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను 

చేసిన పాపములా ఇవు ఆ విధి శాపములా 

మారని జాతకమా ఇది దేవుని శాశనమా 

ఇది తీరేదే కాదా... ఆ..

పావురానికి పంజరానికి పెళ్ళిచేసె పాడులోకం 

కాళరాత్రికి చందమావకి ముళ్ళుపెట్టె మూఢలోకం 

కొడిగట్టిన దీపాలే గుడిహారతులయ్యేనా... ఓ..ఓ..ఓ..

పావురానికి పంజరానికి పెళ్ళిచేసె పాడులోకం 

కాళరాత్రికి చందమావకి ముళ్ళుపెట్టె మూఢలోకం 

తాళంటె తాడనే తలచాను నాడు అది ఏదొ తెలిసేను నేడు 

ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజమూ తరువాత తెలిసేమి ఫలము 

ఏమైన ఏదైన జరింది ఘోరం నామీద నాకేలె కోపం 

నా తొలి నేరములా ఇవి తీరని వేదనలా 

నా మది లోపములా ఇవి ఆరని శోకములా 

ఇక ఈ బాధే పోదా ... ఆ...

పావురానికి పంజరానికి పెళ్ళిచేసె పాడులోకం 

కాళరాత్రికి చందమావకి ముళ్ళుపెట్టె మూఢలోకం 

కొడిగట్టిన దీపాలే గుడిహారతులయ్యేనా... ఓ..ఓ..ఓ..

పావురానికి పంజరానికి పెళ్ళిచేసె పాడులోకం 

కాళరాత్రికి చందమావకి ముళ్ళుపెట్టె మూఢలోకం 

Idi Tailam petti taalam patti [ఇది తైలం పెట్టీ తాళం పట్టీ] - Chanti

Song Name :Idi tailam petti 
Movie:Chanti
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Veturi Sundara Rama murthy garu
Composer:Illayaraja garu
Director:Raviraja Pinisetti garu

అబ్బా. గట్టిగా కొట్టొద్దురరేయ్.. వాయించడనికి ఇదేం తబలా కాదు.. మెల్లిగ మెల్లిగా ఆ...

ఇది తైలం పెట్టీ తాళం పట్టీ తళాంగుతో తలంటీతే మోత 

ఇది వొళ్ళేరుద్దీ బుద్ధే శుద్ధీ చేసేకొద్దీ తమాషాలే తీత 

ఓ నమహాః శివాయహాః ఒంట్లో వేడే మాయం, తమకాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండీ గాయం

ఇది తైలం పెట్టీ తాళం పట్టీ తళాంగుతో తలంటీతే మోత .. హా.. హా

నవ్విస్తూ నడిపిస్తా పనిపాటలూ, మిము కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు

మమతల మారాజులులే ఈ అన్నలూ, పశి మనసున్న మల్లికలే ఆ చెల్లెలూ 

పెంచానండీ కండ ఆ కండల్లోనే గుండే, మీరే నాకు అండ మీరంతా చల్లంగుండా 

ఆ ఎగాణైనా మాగాణైనా ఎంతోకొంత ఉండాలండి, ఉందీ మనసుందీ 

ఇది తైలం పెట్టీ తాళం పట్టీ తళాంగుతో తలంటీతే మోత 

ఇది వొళ్ళేరుద్దీ బుద్ధే శుద్ధీ చేసేకొద్దీ తమాషాలే తీత 

ఓ నమహాః శివాయహాః ఒంట్లో వేడే మాయం, తమకాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండీ గాయం

ఇది తైలం పెట్టీ తాళం పట్టీ తళాంగుతో తలంటీతే మోత .. హో...హో..

గుళ్ళోకి పోలేదు నేనేప్పుడూ, అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు నా దేవుడూ 

బళ్ళోకీ పోలేదూ చిన్నప్పుడూ, పల్లె పాఠాలే నేర్చాడూ ఈ భీముడూ 

మీ పాదాలంటే చోటే నే పాగావేసే కోట, చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట 

పలుగాకులలో పుట్టానండీ కోకిలగా మారానండీ.. కా...కా..ఇది కూ.. కు..

ఇది తైలం పెట్టీ తాళం పట్టీ తళాంగుతో తలంటీతే మోత 

ఇది వొళ్ళేరుద్దీ బుద్ధే శుద్ధీ చేసేకొద్దీ తమాషాలే తీత 

ఓ నమహాః శివాయహాః ఒంట్లో వేడే మాయం, తమకాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండీ గాయం

ఓ నమహాః శివాయహాః ఒంట్లో వేడే మాయం, తమకాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండీ గాయం

ఇది తైలం పెట్టీ తాళం పట్టీ తళాంగుతో తలంటీతే మోత .. హా...హో..