Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S.P. Balasubramanyam,
సాహసం నా పదం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా
లొకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటటం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటనా ఈ పిడికిలితో తానొదుగునుగా
సాహసం నా పదం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా
నిశ్చయం నిశ్చలం నిర్భయం నా హయం
కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుంటే
తప్పని ఒప్పని తర్కమే చేయను కష్టమో నష్టమో లెక్కలే వేయను
ఊరుకుంటే లోకమంతా జారిపోదా ఊహవెంటా
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నే పిలువనా
సాహసం నా పదం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా
అదరనీ బెదరని ప్రవృత్తి ఒదగని మదగజమే మహర్షి
వేడితే లేడి ఒడి చేరితుందా వేట సాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా
అంతము సొంతము పంతమే వీడను మందలొ పందలా ఉండనే ఉండను
నీరువల్లే పారిపోను రేయి వొళ్ళో దూరిపొను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురుపడునా ఏ అపజయం
సాహసం నా పదం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా
లొకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటటం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటనా ఈ పిడికిలితో తానొదుగునుగా
సాహసం నా పదం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా

nice ones dude !!!
ReplyDelete--- Lokame 'Baanisai'.. cheyada....
--- Vedithey 'Ledi' odicherutundha...
---'Bheeruv'alle paariponu....
Good , but lot many spell mistakes .
ReplyDeleteTrue. Good effort but spelling mistakes and misnomers could have been avoided.
DeleteTrue, just realized that there are quite a few of them. corrected the ones i could. Let me know if you see more.
Delete