| Title : | Eto vellipoyindi manasu |
| Movie: | Ninne Pelladuta |
| Singers: | S.P. Balasubramanyam గారు |
| Lyricist: | Sirivennela seetaramasastry గారు |
| Composer: | Sandeep Chowta గారు |
| Director: | Krishna Vamsi గారు |
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఓంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో
ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసూ
ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో
ఏ స్నేహమో కావాలనీ ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ
చెలిమి చిరునామ తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏవిటో
ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఓంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో
కలలన్నవే కొలువుండనీ కనులుండి ఏం లాభముంది
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకందీ
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది అంటూ
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఓంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో
అహాహాహహ మనసు ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో అహాహాహా
No comments:
Post a Comment