Monday, October 19, 2009

Neenu saitham/Ontariga/Cheppalani vundi [నేను సైతం] - Rudraveena

Title :Nenu saitam / Ontariga / Cheppalani vundi
Movie:Rudraveena
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Sirivennela seetaramasastry గారు
Composer:Illayaraja గారు
Director:K. Balachander గారు

ఓంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కద గుండెబలం తెలిసేది
ధుఖాఃనికి తలవంచితె తెలివికింక విలువేది
మంచైన చెడ్డైనా పంచుకోనునేలేనా, ఆమాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని, అంతటి ఏకాంతమైన చింతలేమిటండి...

చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
గుండెల్లొ సుడితిరిగే కలతకధలూ చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది

కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని ఐనవాళ్ళువెలివేస్తే ఐనానేనేకాకిని
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని ఐనవాళ్ళువెలివేస్తే ఐనానేనేకాకిని
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
పాటబాట మారాలని చెప్పటమే నానేరం గూడువిడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం తేటితేనెపాట పంచవన్నెల విరితోట
వసంతాల అందం విరబూసే ఆనందం తేటితేనెపాట పంచవన్నెల విరితోట
బతుకుపుస్తకంలొ ఇది ఒకటేనా పుట
మనిషి నడుచుదారుల్లొ లేదా ఏ ముళ్ళబాటా
మనిషి నడుచుదారుల్లొ లేదా ఏ ముళ్ళబాటా
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది

యేటి పొడుగునా వసంతమొకటేనా కాలం, ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు, కంటినీటి కుంభవృష్టిలో జడిలో ఇంకొకడు
మంచువంచనకు మోడై గోడుపెట్టువాడొకడు
వీరిగొంతులొన కేక వెనుక వున్నదేరాగం, అనుక్షణం వెంటాడె ఆవేదనదేనాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగె మర్తకోకిలా
కళ్ళువున్న కబోదిలా చెవులువున్న బధిరునిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాశనం
కాదన్నందుకు అక్కడ కరువాయను నా స్థానం
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది

అసహాయతలో ధడధడలాడే హృదయ మృదంగధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆగని శోకం
ఎడారి బ్రతుకుల నిత్యం చస్తూసాగే భాధల బిడారు
దిక్కూ మొక్కూ తెలియని దీనుల వ్యధార్దజీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిజెయ్యాలి
జనగీతిని వద్దనుకుంటూ నాకునేనె పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగ్రొంతుకవిచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకుపాటకు గొంతుకలిపేను
నేను సైతం నేను సైతం బ్రతుకుపాటకు గొంతుకలిపేను
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతీ జీవనంలో నందనం వికసించుదాకా
పాతపాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
పాతపాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం

No comments:

Post a Comment