| Title : | Lalita priya kamalam |
| Movie: | Rudraveena |
| Singers: | K.J. Yesudas గారు, K.S. Chitra గారు |
| Lyricist: | Sirivennela seetaramasastry గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | K. Balachander గారు |
లలిత ప్రియకమలం విరిసినదీ
లలిత ప్రియకమలం విరిసినదీ
కన్నుల కొలనిని ఆ...ఆ....ఆ...ఆ..
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని
అమృత కలశముగా ప్రతినిమిషం
అమృత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియకమలం విరిసినదీ
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళీ రాగచరితరగల మృదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల సోల దరహాసముల మనసులు మురిసెను
లలిత ప్రియకమలం విరిసినదీ, కన్నుల కొలనిని ఆ...ఆ....ఆ...ఆ..
ఉదయ రవికిరణం మెరిసినదీ
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాశే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినదీ.. మనసు హిమగిరిగా మారినదీ
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలిప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకు రదం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని ఆ.. ఆ... ఆ...ఆ...
లలిత ప్రియకమలం విరిసినదీ కన్నుల కొలనిని ఆ...ఆ....ఆ...ఆ..
లలిత ప్రియకమలం విరిసినదీ....

No comments:
Post a Comment