Title : | Jai Jai ganesha |
Movie: | Jai chiranjeeva |
Singers: | S.P. Balasubramanyam గారు |
Lyricist: | Chandrabose Chగారు |
Composer: | Mani Sharma గారు |
Director: | Vijaya Bhasker గారు |
ఓం జై గణపతి జై జై జై గణపతి (4)
జై జై గణేషా జైకొడతా గణేషా జయములివ్వు బొజ్జ గణేషా
హాయ్ హాయ్ గణేషా అడిగేస్తా గణేషా అభయమివ్వు బుజ్జి గణేషా
లోకం నలుమూలలా లేదయ్యా కులాసా, దేశం పలువైపులా ఎదో రభసా
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి, గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
గణేశా గం గణపతి గణేశా గం గణపతి గణేశా గం గం గం గం గణపతి

లంబోదరా శివ సుతాయ, లంబోదరా నీదే దయ
లంబోదరా శివ సుతాయ, లంబోదరా నీదే దయ
నందేమో నాన్నకీ సింహం మీ అమ్మకీ వాహనమై ఉండలేదా
ఎలకేమో తమరికీ నెమలేమో తంబికీ రథమల్లే మారలేదా
పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం భోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పర మాకూ సోదరభావం, మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా
గణేశా గం గణపతి గణేశా గం గణపతి గణేశా గం గం గం గం గణపతి
జై జై గణేషా జైకొడతా గణేషా జయములివ్వు బొజ్జ గణేషా
హాయ్ హాయ్ గణేషా అడిగేస్తా గణేషా అభయమివ్వు బుజ్జి గణేషా
చందాలను అడిగిన దాదాలను దండిగా, తొండంతో తొక్కవయ్యా
లంచాలను మరిగిన నాయకులను నేరుగా, దంతంతో దంచవయ్యా
ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ, మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా
మాలో చెడునే ముంచాలయ్యా, లోలో అహమే వంచాలయ్యా
నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ
గణేశా గం గణపతి గణేశా గం గణపతి గణేశా గం గం గం గం గణపతి
జై జై గణేషా జైకొడతా గణేషా జయములివ్వు బొజ్జ గణేషా
హాయ్ హాయ్ గణేషా అడిగేస్తా గణేషా అభయమివ్వు బుజ్జి గణేషా
లోకం నలుమూలలా లేదయ్యా కులాసా, దేశం పలువైపులా ఎదో రభసా
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి, గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
గణేశా గం గణపతి గణేశా గం గణపతి గణేశా గం గం గం గం గణపతి
గణపతి బప్పా మోరియా, ఆధాలడ్డూ ఖాలియా (4)