Tuesday, September 17, 2024

దండాలు దండాలు అమ్మోరు తల్లో (Ammoru)

Title :Dandaalu dandaalu ammoru tallo
Movie:Ammoru
Singers:Chitra గారు , Mano గారు 
Lyricist:Malle maala గారు
Composer:Sri గారు
Director:Kodi Ramakrishna గారు

అమ్మ అమ్మ అమ్మోరమ్మ

మాయమర్మం ఎరగనోళ్ళం, మట్టిపిసికి బతికెటోళ్ళం 

ఊరిదేవతైన నిన్నె, ఊపిరిగ కొలిచెటోళ్ళం 

గండవరం నెయ్యి పోసి గారెలొండి తెచ్చినాము

బుజ్జిముండ కల్లుకుండ వెంటబెట్టుకొచ్చినాము 

దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మతల్లో 

పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో

అంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో 

ఆరగించి మమ్మేలు అమ్మోరుతల్లో 

దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మతల్లో 


ఆదిశక్తిని నేనే.. ఆన్నపూర్ణను నేనే

ఏయ్ సకలలోకాలేలు సర్వమంగళి నేనే

బెజవాడ దుర్గమ్మ, తెలంగాణ ఎల్లమ్మ, నిడదోలు సత్తెమ్మ నేనే

ఏయ్ నెల్లూరు, కల్లూరు, ఆలేరు, సీలేరు అన్నూళ్ళ దేవతను నేనే ఆ..

మీ బాధలను తీర్చి , మీ కోర్కెలీడేర్చి  అలరించి పాలించు అమ్మోరు నేనే ఆ..

దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మతల్లో 

కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో 

చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో 

No comments:

Post a Comment