Sunday, September 15, 2024

ఏదో తెలియని బంధమిది (Yedo teliyani) - Naayakudu

Song Name :Edo teliyani bandhamidi
Movie:Naayakudu
Singers:S.P. Bala subramanyam garu, S.P Sailaja garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
Director:Mani Ratnam garu

ఏదో తెలియని బంధమిది , 

ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే రాగమిదీ.. 

ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే రాగమిదీ.. 

ఏదో తెలియని బంధమిది


పూజకు నోచని పూవునుకోరి వలచిన స్వామివి నువ్వేలే

రూపం లేని అనురాగానికి ఊపిరినీ చిరునవ్వేలే 

కోవెలలేని..కోవెలలేని దేవుడవు, గుండెలగుడిలో వెలిశావు 

పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావు

తనువు మనసు ఇక నీవే...

ఏదో తెలియని బంధమిది, 

ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే రాగమిదీ.. 

ఏదో తెలియని బంధమిది


వేసవి దారుల వేసటలోన వెన్నెల తోడై కలిశావు

పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిచావు 

ఆశలు రాలే... ఆశలు రాలే శిశిరంలో ఆమని నీవై వెలిశావు 

ఆలుమగలా అద్వైతానికి అర్ధం నీవై నిలిచావు 

తనువు మనసు ఇక నీవే...

ఏదో తెలియని బంధమిది, 

ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే రాగమిదీ.. 

ఏదో తెలియని బంధమిది 

No comments:

Post a Comment