| Title : | Satyam sivam sundaram |
| Movie: | Pasivadi pranam |
| Singers: | S.P. Bala subramanyam గారు |
| Lyricist: | Veturi Sundara Ramayya garu గారు |
| Composer: | Chakravarthy గారు |
| Director: | A Kodanda Rami reddy గారు |
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానమూ దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా అది స్వార్థం కాదుపోరా
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
ఆ దేవుడు మస్తుగ తాగి బొమ్మల్నే శృష్టిచేసి
అరె గజిబిజి పడుతున్నాడు తన తప్పే తనకు తెలిసి
ఓయ్ .. ఉన్నవాడిదే దోపిడీ లేనివాడికే రాపిడి
లోకం ఇట్టా ఏడ్చెరా దీనిని ఎవ్వడు మార్చురా
ప్రతిఒక్కడు ఏమార్చురా, గుడికెళ్ళినా గుణమేదిరా
హుష్..తప్పైపొయిందిరో క్షమించరోయ్ క్షమించు
నరుడా మందుకొట్టే వాడు నీకూ పరమ గురుడా..
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
ఏ నాయకుడైనా పాపం వచ్చేది సేవకోసం
అరె కడుపులు వాడే కొడితే, అది కుర్చీలోని దోషం
రాజకీయ్యాలెందుకు తన్నుకుచచ్చేటందుకు
రాత్రీపగలు తాగితే రాజూ-బంటు ఒక్కటే
నా మాటలో నిజముందిరా, అది నమ్మితే సుఖముందిరా
వాదాలెందుకయ్యా మందు వెసేయ్ ముందు భయ్యా..
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానమూ దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా అది స్వార్థం కాదుపోరా రేయ్
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం.. నిత్యం ఇదే అనుభవం

No comments:
Post a Comment