Sunday, October 11, 2026

Neevuleka Veena [నీవులేక వీణ పలుకలేనన్నది] - Dr Chakravarthy

Title :Neevuleka veena
Movie:Dr Chakravarthy
Singers:P. Suseela గారు
Lyricist:Acharya Aatreya గారు
Composer:S. Rajeswara Rao గారు
Director:Adurthy Subbarao గారు

నీవులేక వీణ పలుకలేనన్నది నీవురాక రాధా నిలువలేనన్నది

నీవులేక వీణ 

జాజిపూలు నీకై రోజు రోజు పూసే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే

చందమామ నీకై తొంగి తొంగి చూచి 

చందమామ నీకై తొంగి తొంగి చూచి, సరసను లేవని అలికలుబోయే

నీవులేక వీణ 


కలలనైన నిన్ను కనుల చూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడ రావే

కదలలేని కాలం విరహగీతి రీతి

కదలలేని కాలం విరహగీతి రీతి, పరువము వృధగా బరువుగ సాగే 

నీవులేక వీణ 


తలుపులన్ని నీకై తెరచి ఉంచినాను, తలపులెన్నో మదిలో దాచివేసినాను

తాపమింక నేను ఓపలేను స్వామి

తాపమింక నేను ఓపలేను స్వామి, తరుణిని కరుణను ఏలగ రావా

నీవులేక వీణ పలుకలేనన్నది నీవురాక రాధా నిలువలేనన్నది

నీవులేక వీణ 

No comments:

Post a Comment