Showing posts with label Abhilaasha. Show all posts
Showing posts with label Abhilaasha. Show all posts

Sunday, May 4, 2025

eureka sakamika [యురేకా సకమికా] - Abhilaasha

Song Name :Yureka sakamika
Movie:Abhilaasha
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Veturi Sundara Rama murthy garu
Composer:Illayaraja garu
Director:Kodanda Ramireddy garu

యురేకా...

హే..నవ్వింది మల్లెచెండూ.. నచ్చింది గాళ్‌ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు. జరుపుకో భలే రొమాన్సూ

యురేకా సకమికా .. నీ ముద్దు తీరేదాకా 

నవ్వింది మల్లెచెండూ.. నచ్చింది గాళ్‌ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు. జరుపుకో భలే రొమాన్సూ

యురేకా సకమికా ... సకమికా సకమికా సకమికా సకమికా 


లవ్వు సిగ్నల్ నాకివ్వగానే.. నవ్వుకున్నై నా యెవ్వనాలే 

నవ్వుతోనే నమిలెయ్యగానే నాటుకున్నై నవనందనాలే 

అహ చూపుల్లో నీ రూపం, కను రెప్పల్లో నీ తాళం

కన్ను కొట్టి కమ్ముకుంట కాలమంత అమ్ముకుంట.. రపప్పా రపప్పా రపప్పా రపప్పా 

కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా... 

నవ్వింది మల్లెచెండూ.. నచ్చింది గాళ్‌ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు. జరుపుకో భలే రొమాన్సూ

యురేకా సకమికా ... హ హ హ


కస్సుమన్నా ఓ కన్నెపిల్ల, ఎస్సు అంటే ఓ కౌగిలింత

కిస్సులిచ్చి నే కౌగిలిస్తే, అరె తీరిపోయే నాకున్న చింత

నేను పుట్టిందే నీ కోసం, ఈ జన్మంతా నీ ధ్యానం 

ముద్దు పెట్టి మొక్కుకుంటా, మూడుముళ్ళు వేసుకుంటా 

షభబ్బ రిబబ్బ షబబ్బ షబరిబరిబ..

ఏడుజన్మలేలుకుంటా నేను జంటగా...

నవ్వింది మల్లెచెండూ.. నచ్చింది గాళ్‌ఫ్రెండు.. హుర్రే 

దొరికెరా మజాగ ఛాన్సు. జరుపుకో భలే రొమాన్సూ

యురేకా సకమికా .. నీ ముద్దు తీరేదాకా 

యురేకా సకమికా .. నీ ముద్దు తీరేదాకా 

యురేకా సకమికా .. నీ ముద్దు తీరేదాకా .. హుర్రే....య్యా  


Wednesday, April 16, 2025

Urakalai godavari [ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి] - Abhilasha

Song Name :Urakalai godavari
Movie:Abhilasha
Singers:S.P. Bala subramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundararama murthy garu
Composer:Illayaraja garu
DirectorA. Kodandarami reddy garu 

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావనీ విరిసె నా సిగలోనికి 
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయ జగతీ 
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

నీ ప్రణయ భావం, నా జీవ రాగం 
నీ ప్రణయ భావం, నా జీవ రాగం 
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి 
అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయ జగతీ 

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏ నాడో నీదైనది 
నీవన్న మనిషే ఈ నాడే నాదైనదీ 
ఒక గుండె అభిలాష పదిమందికి బ్రతుకైనది 
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావనీ విరిసె నా సిగలోనికి 
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ 
రసమయ జగతీ  

Friday, June 26, 2009

Vela paala ledu - Abhilaasha

Movie : Abhilaasha
Music Dir: Illayaraja
Singer: S.P. Balasubramanyam,

తారా..రం రం
వేళాపాళాలేదు కుర్రాళ్ళాటకు ఓడేమాటలేదు ఆడేవాళ్ళకు
ఏది గెలుపో హొయ్ హొయ్ ఏది మలుపో హొయ్ హొయ్
తెలియవరకు ఇదే ఇదే ఆట మనకు
తకధిమితథొంత తకధిమితథొంత తకధిమితథొంత తరికిటతరికిటథా

మన్మధుడు నీకు మంత్రి అనుకొకు నీ వయసు కాచేందుకు
వయసు ఒక చాకు అది వాడుకోకు నా మనసు కోసేందుకు
మనసే లెడు నీకు ఇచ్చెసావు నాకు
లేదనీ నీదని కలగని నిజమని అనుకొని ఆడకు ..
లా లా లా లా లా లా లా లా
తకధిమితథొంత తకధిమితథొంత తకధిమితథొంత తరికిటతరికిటథా

కలలకొక రూపు కనులకొక కైపు తొలిమాపు విరిపానుపు
కవితలిక ఆపు కలుసుకొ రేపు చెబుతాను తుది తీరుపు
అహ ఏ తీర్పు వద్దు ఇదిగొ తీపి ముద్దు
వద్దని ముద్దని చిదుమని పదమని చిటికెలు వేయకు

వేళాపాళాలేదు కుర్రాళ్ళాటకు ఓడేమాటలేదు ఆడేవాళ్ళకు
ఏది గెలుపో హొయ్ హొయ్ ఏది మలుపో హొయ్ హొయ్
తెలియవరకు ఇదే ఇదే ఆట మనకు
తకధిమితథొంత తకధిమితథొంత తకధిమితథొంత తరికిటతరికిటథా