Showing posts with label Asalem gurtukuradu. Show all posts

Monday, October 19, 2009

Assalem gurthukuraadu [అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా] - Antahpuram

Title :Asalem gurtukuradu
Movie:Antahpuram
Singers:K.S. Chitra గారు
Lyricist:Sirivennela seetaramasastry గారు
Composer:Illayaraja గారు
Director:Krishna Vamsi గారు

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషంపాటు నిన్ను చూడక

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతె బతకగలనా

గోరువెచ్చని ఊసుతో చిన్నబుచ్చకని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ
అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్‌చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయ్యే వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారమ్
మళ్ళీ మళ్ళీ... మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం