Showing posts with label cnarayanareddy. Show all posts

Monday, July 9, 2012

Nee Vadanam [ నీ వదనం ]

Song: Nee Vadanam 
Movie: Neeraajanam
Lyrics: Dr. C. Narayana Reddy [సినారె]
Music: O P Nayyar
Singer(s): SP Balu, Janaki

నీ వదనం విరిసే కమలం    నా హృదయం ఎగసే కావ్యం   [4]

పాదం నీవై పయనం నేనై  ప్రసరించె రసలోకతీరం - ప్రాణం మెరిసి ప్రణయం కురిసి ప్రభవించె గంధర్వగానం

నీ వదనం విరిసే కమలం    నా హృదయం ఎగసే కావ్యం   [2]

నాదాలెన్నో రూపాలెన్నో ననుచెరే లావణ్యనదులై - భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవరాగనిధులై

English

nI vadanaM virisE kamalaM    nA hRudayaM egasE kAvyaM   [4]

pAdaM nIvai payanaM nEnai  prasariMche rasalOkatIraM - prANaM merisi praNayaM kurisi praBaviMche gaMdharvagAnaM [2]

nI vadanaM virisE kamalaM    nA hRudayaM egasE kAvyaM [2]

nAdAlennO rUpAlennO nanucherE lAvaNyanadulai - BuvanAlannI gaganAlannI ravaLiMche navarAganidhulai [2]

nI vadanaM virisE kamalaM    nA hRudayaM egasE kAvyaM [2]

Sunday, May 31, 2009

Vatapatra sai [వటపత్ర సాయికి] - Swathi Muthyam

Movie : Swathi Muthyam
Language : Telugu
Music Dir: Illayaraja garu
Singer: P. Susheela garu
Director: K. Viswanath garu
Lyrics: Dr. C. Narayana Reddy garu [సి.నా.రె]

లాలి లాలి లాలి లాలి (2)

వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ...అ....అ....అ....అ....
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి

కళ్యాణ రామునికి కౌశల్య లాలి (2)
యదువంశ విభునికి యశోద లాలి (2)
కరి రాజ ముఖునికి .... కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి (2)
పరమ అంశ  భవునికి పరమాత్మ లాలి
వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి

జొ జొ జొ జొ జొ..... (2)
అలమేలు పతికి అన్నమయ్య లాలి (2)
కొదండ రామునికి గోపయ్య లాలి (2)
శ్యమలాంగునికి శ్యామయ్య లాలి (2)
ఆగమనుతునికి త్యాగయ్య లాలి

వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి

English
laali laali laali laali (2)

vaTapatra Saayiki varahaala laali, raajeeva nEtruniki ratanaala laali
muripaala kRshNuniki ...a....a....a....a....
muripaala kRshNuniki mutyAla laali, jagamElu swaamiki pagaDaala laali
vaTapatra Saayiki varahaala laali, raajeeva nEtruniki ratanaala laali

kaLyANa raamuniki kauSalya laali (2)
yaduvaMSa vibhuniki yaSOda laali (2)
kari raaja mukhuniki .... kari raaja mukhuniki giri tanaya laali (2)
parama amSa bhavuniki paramaatma laali
vaTapatra Saayiki varahaala laali, raajeeva nEtruniki ratanaala laali

jo jo jo jo jo..... (2)
alamElu patiki annamayya laali (2)
kodanDa raamuniki gOpayya laali (2)
SyamalaaMguniki SyAmayya laali (2)
aagamanutuniki tyAgayya laali