Showing posts with label ladiestailor. Show all posts
Showing posts with label ladiestailor. Show all posts

Saturday, January 17, 2026

GopiLola ni paala paddamura [గోపీలోల నీపాల పడ్డామురా ] - Ladies Tailor

Title :gopilola nipaala paddamura
Movie:Ladies Tailor
Singers:S.P. Balasubramanyam గారు, and S.P. Sailaja గారు
Lyricist:Sirivennela Seetaraama sastry గారు
Composer:Illayaraja గారు
Director:Vamsy గారు

గోపీలోల నీపాల పడ్డామురా , లీలాలోలా అల్లాడుతున్నామురా 

చన్నీళ్ళలో ఉన్నమురా, చిన్నారులం మన్నించరా 

భామా భామా తీరాన్ని చేరాలమ్మా, పరువేకోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా 

అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలూ 

గోపీలోల నీపాల పడ్డామురా 

కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా, మచ్చ మచ్చ మచ్చ మచ్చా (2)

జాలిమాలిన ఈ గాలి, తేరిపారా చూసి వేసే ఈల 

మావి మాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోల 

తరుణిరో, కరుణతో మోక్షం చూపే కిరణమై నిలిచానే 

తనువుతో పుట్టే మాయను తెలుపగా పిలిచానే 

మోక్షం కన్నా మానం మిన్న, మిన్ను మన్ను కన్నులు మూసేనా 

గోపీలోల నీపాల పడ్డామురా , భామా భామా తీరాన్ని చేరాలమ్మా

చన్నీళ్ళలో ఉన్నమురా, చిన్నారులం మన్నించరా 

గోపీలోల నీపాల పడ్డామురా 

వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ 

నేనుకోరే ఆ తార ఏది మీలోన భామ భామ భామ 

తగదురా, ఇది మరీ చోద్యంకాదా సొగసరి గోవింద 

అందరూ నీవారేగా ఒకరితో ముడివుందా 

చూసే కలలు ఎన్నోవున్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా 

గోపీలోల నీపాల పడ్డామురా , లీలాలోలా అల్లాడుతున్నామురా 

అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలూ 

భామా భామా తీరాన్ని చేరాలమ్మా, పరువేకోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా 

Monday, April 21, 2025

Ekkada ekkada ekkada [ఎక్కడ ఎక్కడ ఎక్కడ, ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క] - Ladies Tailor

Song Name :Ekkada ekkada 
Movie:Ladies Tailor
Singers:S.P. Balasubramanyam garu 
Lyricist:Sirivennela Seeta Rama Sastry garu
Composer:Illayaraja garu
Director:Vamsi garu

సుందరీ ఎందుకే ఇట్టా రావే ఇట్టా రావే, తిప్పుకుంటూ తిప్పుకుంటూ అట్టా అట్టా పోతావేవే 

కొత్త రైక చక్కగుందే ముచ్చటేస్తా ముద్దుగుందే 

కన్ను కుట్టే కుట్టు సూడు కుట్టినోడు గట్టివాడు కట్టుకున్న నిన్నుసూసి కన్ను కొట్టనోడు ఎవడు 

సోకునట్ట సుట్టబెట్టి సంబరంతొ పొంగుతున్న ఇంత సిత్తరాల రైక కుట్టినోడు ఎవ్వడే..

పడమటీటి సందులోన పాత ఇంటి ముందరున్న టైలరూ పేరు సుందరం...ఆఆ...

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ, ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క 

ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ, టక్కుల టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట

మచ్చున్న భామా కనులకు కనరావా , ఉన్నను రావా నలు చరగులు తిరుగుదు మరి

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ, ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క 

ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ, టక్కుల టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట

ఆకారం చూస్తే సరిపోదంటా ఒకటే గురుతూ తెలిసేదెట్టా 

ఆకారం చూస్తే సరిపోదంటా ఒకటే గురుతూ తెలిసేదెట్టా 

ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ 

ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ 

గుట్టూ మట్టూ తీసీ పుట్టూమచ్చను చూసీ, టక్కున పట్టేయ్యాలి నక్కను తొక్కేయ్యాలీ 

పొరపడి పరులకు దొరకక

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ, ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క 

ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ, టక్కుల టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట

మచ్చున్న భామా కనులకు కనరావా , ఉన్నను రావా నలు చరగులు తిరుగుదు మరి

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ, ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క 

ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ, టక్కుల టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట

కృష్ణా హరే, రామా హరే - కృష్ణా హరే, రామా హరే - కృష్ణా హరే, రామా హరే - పద్మినీ జాతి స్త్రీ 

అయ్యో అమ్మా అబ్బా - అయ్యో అమ్మా అబ్బా - అయ్యో అమ్మా అబ్బా - అయ్యో అమ్మా అబ్బా - పద్మినీ జాతి స్త్రీ 

నా నా నా లా లా లా - నా నా నా లా లా లా - నా నా నా లా లా లా - నా నా నా లా లా లా - పద్మిని జాతి స్త్రీ 

శ్రీదేవీ వాణీ పశుపతి రాణీ, ఎదురై నిలిచే సమయములోన 

శ్రీదేవీ వాణీ పశుపతి రాణీ, ఎదురై నిలిచే సమయములోన 

ఎల్లాగనీ గుర్తించనూ శ్రీదేవినీ ఆ దేవినీ, ఎల్లాగనీ గుర్తించనూ నా దేవీ ఏదో 

గుర్తులు గుట్టుగ దాచీ అల్లరి పెట్టే వేళ, ఎవ్వరి నవ్వులు నమ్మను గుండెను ఎవ్వరికివ్వను 

హరి హరి ఇక మన పని సరి