Showing posts with label ne tolisariga. Show all posts
Showing posts with label ne tolisariga. Show all posts

Saturday, July 11, 2026

ne tolisariga / ni aatemito [నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా / నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా] - Santosham

Title :nE tolisariga / nI Atemito
Movie:Santosham
Singers:Usha గారు
Lyricist:Sirivennela seetarama sastry గారు
Composer:R.P. Patnaik గారు
Director:Dasaradh గారు

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా 

నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా 

స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా 

మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా 

ఇంతలో చేరువై అంతలో దూరమై, అందవా స్నేహమా

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా 

నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా 


రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా 

ఎక్కడ వాలను చెప్పు నువ్వే సావాసమా 

హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా

వద్దకు రాకని ఆపకిలా అనురాగమా 

నడకలు నేర్పిన ఆశవు కదా, తడబడనీయ్యకు కదిలిన కథ 

వెతికే మనసుకు మమతే పంచుమా 

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా 

నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా 


ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా

అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా 

నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా 

తీయ్యని రుచిగల కటిక విషం నువ్వే సుమా 

పెదవులపై చిరునవ్వుల దగా, కనపడనీయ్యవు నిప్పుల సెగ 

నీటికి ఆరని మంటల రూపమా...


నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా

నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా 

తెంచుకోనీయవు పంచుకోనీయవు ఇంత చెలగాటమా 

చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా 

పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా 

నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా

నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా