Showing posts with label ntramarao. Show all posts
Showing posts with label ntramarao. Show all posts

Thursday, May 30, 2024

సడి సేయకో గాలి/ Sadi Seyako Gali

Song Name: సడి సేయకో గాలి/ Sadi Seyako Gali 
Movie:
రాజ మకుటం / Raja Makutam 
Singers:పి.లీల / P Leela
Lyricist:దేవులపల్లి కృష్ణ శాస్త్రి / Devulapalli Krishna Saasthri 
Composer:మాస్టర్ వేణు / Master Venu
Director:బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి / Bommireddy Narasimha Reddy

సడి సేయకో గాలి సడి సేయ బోకే

బడలి ఒడిలో రాజు పవళించేనే .. 

సడి సేయకే

రత్న పీఠికలేని రారాజు నా స్వామి

మణి కిరీటము లేని మహరాజు గాకేమి

చిలిపి పరుగులు మాని కొలిచి పోరాదే

సడి సేయకే

ఏటి గళగళళకే ఎగసి లేచెనే

ఆకు కదలికలకే అదరి చూసేనే

నిదుర చెదరిందంటె నేనూరుకోనే

సడి సేయకే

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే

నీడ మబ్బుల దాగు నిదుర తేరాదె

విరుల వీవన పూని విసిరి పోరాదే

సడి సేయకో గాలి సడి సేయ బోకే

బడలి ఒడిలో రాజు పవళించేనే .. 

సడి సేయకో గాలి

-----------------------

saDi sEyakO gAli saDi sEya bOkE

baDali oDilO rAju pavaLinchEnE .. 

saDi sEyakE

ratna peeTHikalEni rArAju nA swAmi

maNi kirITamu lEni maharAju gAkEmi

chilipi parugulu maani kolichi pOrAdE

saDi sEyakE

ETi gaLagaLaLakE egasi lEchenE

aaku kadalikalakE adari choosEnE

nidura chedarindanTe nEnUrukOnE

saDi sEyakE

panDu vennela naDigi paan&pu tEraadE

nIDa mabbula daagu nidura tErAde

virula veevana pooni visiri pOraadE

saDi sEyakO gAli saDi sEya bOkE

baDali oDilO rAju pavaLinchEnE .. 

saDi sEyakO gAli

Monday, November 17, 2014

Seshasaila vaasa [శేషశైలావాస శ్రీవెంకటేశా.. ] - Sri Venkateswara Mahatyam

Title :Seshasaila vaasa
Movie:Sri Venkateswara Mahatyam
Singers:Ghantasaala గారు
Lyricist: Pendyaala గారు 
Composer: Ghantasaala గారు
Director:P. Pullaiah గారు

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ
ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి..
మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా..

పట్టు పానుపుపైన పవళించర స్వామి..
పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ..
చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము..
చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము.

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

Watch & Listen

SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA..
SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA..

SrIdEvi vaMkaku chilipigA chUDakU.. alamElumaMgaku aluka rAnIyakU
SrIdEvi vaMkaku chilipigA chUDakU.. alamElumaMgaku aluka rAnIyakU
muddusatulIddarini iruvaipulAjErchi.. muddusatulIddarini iruvaipulAjErchi..
muripiMchi lAliMchi..mUchchaTala tElchi.. SEShaSailAvAsa SrIveMkaTESA..

paTTu pAnupupaina pavaLiMchara swAmi..
paTTu pAnupupaina pavaLiMchara swAmi.. bhaktulaMdaru ninnu prastutiMchi pADa..
chirunagavulolukuchU.. niduriMchu nI mOmu..
chirunagavulolukuchU.. niduriMchu nI mOmu.. karuvudIra kAMchi tariyiMchumU mEmu.

SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA..
SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA..