Showing posts with label sogasu chooda tarama. Show all posts
Showing posts with label sogasu chooda tarama. Show all posts

Monday, June 1, 2026

Sogasu Chooda Tarama [సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా] - Sogasu Chooda Tarama

Title :Sogasu chooda tarama
Movie:Sogasu Chooda tarama
Singers:K.J. Yesudas గారు
Lyricist:Sirivennela Seetarama sastry గారు
Composer:Ramani Prasad గారు
Director:Guna Sekhar గారు

సొగసు చూడ తరమా

సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా

మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా..

సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా

మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా..

సొగసు చూడ తరమా 

కులుకే సుప్రభాతాలై, కునుకే స్వప్నగీతాలై 

ఉషా కిరణము నిషా తరుణము

కలిసె కలికి మేనిగా రతికాంతుని కొలివుగా

వెలసే చెలి చిన్నెలలో...

సొగసు చూడ తరమా 

పలుకా చైత్ర రాగాలే, అలకా గ్రీష్మ తాపాలే

మదే కరిగితే అదే మధుఝరీ

చురుకు వరద గౌతమి, చెలిమి శరద్ పౌర్ణమీ

అతివే అన్నీ ఋతువులయ్యే...

సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా 

మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా..

సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా

మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా..

సొగసు చూడ తరమా