Showing posts with label uyyalo. Show all posts
Showing posts with label uyyalo. Show all posts

Thursday, October 3, 2024

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో (Batukamma uyyalo)

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 

ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో 

ఆ రాజు భర్యయూ ఉయ్యాలో అతిసత్యవతియండ్రు ఉయ్యాలో 

నూరు నోములు నోమి ఉయ్యాలో నూరు మందినిగాంచె ఉయ్యాలో 

వారు శూరులయ్యి ఉయ్యాలో వైరులచే హతమైరి ఉయ్యాలో 

తల్లిదండ్రులపుడు ఉయ్యాలో తరగాని శొకమున ఉయ్యాలో 

ధనధాన్యములబాసి ఉయ్యాలో దాయాదులబాసి ఉయ్యాలో 

వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో

కలికి లక్ష్మినిగూర్చి ఉయ్యాలో ఘనతపంబొనరింప ఉయ్యాలో