Song Name : | Chakravarthi ki Veedhi bichchagattiki |
Movie: | Money |
Singers: | S.P. Balasubramanyam garu |
Lyricist: | Sirivennela Seetarama sastry garu |
Composer: | Srinivasa Murthy garu |
Director: | Siva Nageswara Rao garu |
చక్రవర్తికీ, వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్ని అంది మనీ మనీ
పచ్చ నోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికీ పాడె కట్టడానికీ మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అందీ మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అందీ మనీ మనీ
డబ్బునే లబ్బుడబ్బనె గుండెల్లొ పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ, వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్ని అంది మనీ మనీ
ఇంటద్దె కట్టావా నా తండ్రి, నో ఎంట్రీ వీధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కపడా రూమూ అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము అమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ, వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్ని అంది మనీ మనీ
ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాల్లో ప్రేమ స్టొరీలా
పార్కులో కనే కలే ఖరీదైనదీ
బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీ
చూపించరుగా ఫ్రీషో వేసీ ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతినిమిషం సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ, వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్ని అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అందీ మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అందీ మనీ మనీ
డబ్బునే లబ్బుడబ్బనె గుండెల్లొ పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
డబ్బురా డబ్బుడబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా
No comments:
Post a Comment