Sunday, April 20, 2025

Ni Prasnalu neeve [నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా] - Kotta Bangaru Lokam

Song Name :Ni prasnalu neeve
Movie:Kotta bangaru lokam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennela Seetarama sastry garu
Composer:Mickey J Mayer garu
Director:Srikanth Addala garu

నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా 
ఏ గాలొ నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లెదో తెలియదంటె చెల్లదుగా
పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననేకనను అంటుందా 
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా  
బతుకంటే బడిచదువా అనుకుంటే అతిసులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా 
ఒక నిమిషం కూడా ఆగిపొదే నువ్వొచ్చేదాకా 

అలలుండని కడలేదనే అడిగేందుకె తెలివుందా
కలలుందని కనులేవని నిత్యం నిదురోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపేదో వలవేస్తుంది వయసేమో అటుతోస్తుంది 
గెలుపంటె ఎదో ఇంతవరకు వివరించేరుజువేముందీ
సుడిలొ పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా

పొరబాటున చెయిజారిన తరుణం తిరిగొస్తుందా 
ప్రతిపూట ఒకపుటలా తన పాఠం వివరిస్తుందా 
మనకోసమె తనలో తను రగిలే రవి తపనంత
కనుమూసిన తరువాతనె పెను చీకటి చెబుతుంద 
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని 
అని తిరగేసాయా చెరితపుటలు, వెనుచూడక వెతికే జతలు 
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందిచాలా ప్రేమికులు 

ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత 
పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననేకనను అంటుందా 
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా  
బతుకంటే బడిచదువా అనుకుంటే అతిసులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా 
ఒక నిమిషం కూడా ఆగిపొదే నువ్వొచ్చేదాకా  

No comments:

Post a Comment