Song Name : | edo oka raagam |
Movie: | Raja |
Singers: | S.P. Balasubramanyam garu |
Lyricist: | Sirivennela Sita rama sastry garu |
Composer: | S.A. Rajkumar garu |
Director | Muppalaneni Siva garu |
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపూ జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పూ జ్ఞాపకాలే ఓదార్పు

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపై నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపురానీ ప్రేమే మధుర జ్ఞాపకం
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపూ జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పూ జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
No comments:
Post a Comment