Thursday, May 28, 2026

Vennelaina chikataina [వెన్నెలైనా చీకటైనా] - Pachchani Kapuram

Title :Vennelaina chikataina
Movie:Pachchani kapuram
Singers:K.J. Yesudas గారు,  S. Janaki గారు
Lyricist:C. Narayana Reddy గారు
Composer:Chakravarthy గారు
Director:T. Rama Rao గారు

వెన్నెలైనా చీకటైనా, చేరువైనా దూరమైనా

నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము 

ఏ జన్మదో ఈ బంధము, ఏ జన్మదో ఈ బంధము

నింగి నేలా సాక్ష్యాలు, నింగి నేలా సాక్ష్యాలు 

ప్రేమకు మనమే తీరాలు 

వెన్నెలైనా చీకటైనా, చేరువైనా దూరమైనా

నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము 


జ్ఞాపకమేదో నీడల్లే తారాడే, స్వప్నాలేవో నీ కళ్ళదోగాడే

కౌగిలింతలోన గాలి ఆడకూడదు, చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు

నీ సర్వము నాదైనదీ...

నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే ఏకమైన రాసలీలలోన

వెన్నెలైనా చీకటైనా, చేరువైనా దూరమైనా


అంతంలేనీ ఈ రాగబంధంలో, అంచున నిలిచీ నీవైపే చూస్తున్నా

పున్నమింక తట్టుకున్న పూలడోలలు, ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు 

ఆ ముద్దులే మూడైనవి..

బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా ఇంటిదీపమాయేనంట ప్రేమా..


వెన్నెలైనా చీకటైనా, చేరువైనా దూరమైనా

నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము 

ఏ జన్మదో ఈ బంధము, ఏ జన్మదో ఈ బంధము

నింగి నేలా సాక్ష్యాలు, నింగి నేలా సాక్ష్యాలు 

ప్రేమకు మనమే తీరాలు  

No comments:

Post a Comment