| Title : | tummeda oh tummeda |
| Movie: | Srinivasa Kalyanam |
| Singers: | S.P. Balasubramanyam గారు, P. Suseela గారు |
| Lyricist: | Sirivennela Sitarama sastry గారు |
| Composer: | K.V. Mahadevan గారు |
| Director: | Kodi Ramakrishna గారు |
తుమ్మెదా ఓ తుమ్మెదా.. ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద

మగడు లేని వేళ తుమ్మెద, వచ్చి మొగమాట పెడతాడు తుమ్మెద
మాటవరసకంటూ తుమ్మెద, పచ్చి మోటు సరసమాడతాడు తుమ్మెద
అత్త ఎదురుగానే తుమ్మెద, రెచ్చి హత్తుకోబోయాడు తుమ్మెద
తుమ్మెదా ఓ తుమ్మెదా.. ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద
ఎదురుపడితే కదలనీక దడి కడతాడే, పొద చాటుకి పద పదమని సొద పెడతాడే

ఒప్పనంటే వదలడమ్మా, ముప్పు తప్పదంటే బెదరడమ్మా

చుట్టుపక్కలేమాత్రం చూడని ఆత్రం.. పట్టువిడుపు లేనిదమ్మ కృష్ణుని పంతం
మగడు లేని వేళ తుమ్మెద, వచ్చి మొగమాట పెడతాడే తుమ్మెద
మాటవరసకంటూ తుమ్మెద, పచ్చి మోటు సరసమాడతాడే తుమ్మెద
అత్త ఎదురుగానే తుమ్మెద, రెచ్చి హత్తుకోబోయాడు తుమ్మెద
తుమ్మెదా ఓ తుమ్మెదా.. ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద
స్నానమాడ వేళ తాను దిగబడతాడే, మాను మాటు చేసి చూడ ఎగబడతాడే

చెప్పుకుంటే సిగ్గు చేటు, అబ్బ నిప్పులాంటి చూపు కాటు

ఆదమరిచి ఉన్నావా కోకలు మాయం, ఆనక ఏమనుకున్నా రాదే సాయం
మగడు లేని వేళ తుమ్మెద, వచ్చి మొగమాట పెడతాడే తుమ్మెద
మాటవరసకంటూ తుమ్మెద, పచ్చి మోటు సరసమాడతాడే తుమ్మెద
అత్త ఎదురుగానే తుమ్మెద, రెచ్చి హత్తుకోబోయాడు తుమ్మెద
తుమ్మెదా ఓ తుమ్మెదా.. ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద

No comments:
Post a Comment