Showing posts with label phalamu. Show all posts
Showing posts with label phalamu. Show all posts

Wednesday, January 21, 2026

Pagale vennela [పగలే వెన్నెలా జగమే ఊయల] - Pooja phalamu

Song Name :Pagale Vennela
Movie:Pooja Phalamu
Singers:S. Janaki garu
Lyricist:C. narayana reddy  garu
Composer:S. Rajeswara rao garu
Director:B.N. Reddy garu

పగలే వెన్నెలా జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే

పగలే వెన్నెలా జగమే ఊయల

నింగిలోన చందమామ తొంగిచూచే, నీటిలోన కలువభామ పొంగిపూచే 

ఈ అనురాగమే జీవనరాగమై 

ఈ అనురాగమే జీవనరాగమై, ఎదలో తేనెజల్లు కురిసిపోదా..

పగలే వెన్నెలా జగమే ఊయల

కడలిపిలువ కన్నెవాగు పరుగుతీసే, మురళిపాట విన్ననాగు శిరస్సునూపే 

ఈ అనుబంధమే మధురానందమై 

ఈ అనుబంధమే మధురానందమై, ఇలపై నందనాలు నిలిపిపోదా 

పగలే వెన్నెలా జగమే ఊయల

నీలుమబ్బు నీడలేచే నెమలి ఆడే, పూలఋతువు సైగ చూచి పికము పాడే 

నీలుమబ్బు నీడలేచే నెమలి ఆడే, పూలఋతువు సైగ చూచి పికము పాడే 

మనసే వీణగా ఝణ ఝణ మ్రోయగా, బ్రతుకే పున్నమిగా విరిసిపోదా..

పగలే వెన్నెలా జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే

పగలే వెన్నెలా ...