Showing posts with label raajannaagendran. Show all posts
Showing posts with label raajannaagendran. Show all posts

Sunday, February 17, 2013

Ennenno janmala bandham [ఎన్నెన్నో జన్మల ] - Pooja

Title : Ennenno janmala
Movie: Pooja
Singers: S.P. Bala Subramanyam గారు , Vani Jayaram గారు
Lyricist:
Composer: Raajan Nagendran గారు 

Director: Murugan Kumaran గారు 


ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది

పున్నమి వెన్నెలలోన పొంగును కడలి... నిన్నే చూసినవేళ నిండును చెలిమి
నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చెరనా..చెరనా...
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది

విరిసిన కుసుమము నీవై మురిపించేవు.. తావి నేనై నిన్ను పెనవేసేను
మేఘం నీవై  నెమలిని నేనై ఆశతొ నిన్ను చూసి చూసి ఆడనా.. ఆడనా.. ఆడనా..
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది

కోటి జన్మలకైన కోరేదొకటే.. నీలొ సగమై ఎపుడు నేనుండాలి
నీవున్నవేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ..
ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది...
ఎన్నటికి ఎన్నటికి మాయని మమతా నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను



English
ennennO janmala baMdhaM nIdi nAdi... ennaTiki mAyani mamatA nAdi nIdi 
okka kshaNaM ninu vIDi nEnuMDalEnu.. okka kshaNaM nI virahaM nEtALalEnu 
ennennO janmala baMdhaM nIdi nAdi... ennaTiki mAyani mamatA nAdi nIdi 

punnami vennelalOna poMgunu kaDali... ninnE chUsinavELa niMDunu chelimi 
nuvvu kaDalivaitE nE nadiga mAri chiMdulu vEsi vEsi ninnu chEranA cheranA..cheranA...
ennennO janmala baMdhaM nIdi nAdi... ennaTiki mAyani mamatA nAdi nIdi 

virisina kusumamu nIvai muripiMchEvu.. tAvi nEnai ninnu penavEsEnu 
mEghaM nIvai  nemalini nEnai ASato ninnu chUsi chUsi ADanA.. ADanA.. ADanA..
ennennO janmala baMdhaM nIdi nAdi... ennaTiki mAyani mamatA nAdi nIdi 

kOTi janmalakaina kOrEdokaTE.. nIlo sagamai epuDu nEnuMDAli 
nIvunnavELa A swargamElA I poMdu ellavELalaMdu uMDanI.. uMDanI.. uMDanI..
ennennO ennennO janmala baMdhaM nIdi nAdi... 
ennaTiki ennaTiki mAyani mamatA nAdi nIdi 
okka kshaNaM ninu vIDi nEnuMDalEnu

Saturday, February 16, 2013

Chinukulaa raali [చినుకులా రాలి] - Naalugu Stambhaalaata

Title : Chinukula raali
Movie: Naalugu stambhaalaata
Singers: S.P. Bala Subramanyam 
గారు , P. Suseela గారు 
Lyricist: Veturi Sundara Raama Moorthi గారు 
Composer: Raajan Nagendran గారు 

Director: Haasya Brahmma Jandhyaala గారు 

చినుకులా రాలి... నదులుగా సాగి.... 
వరదలైపోయి... కడలిగాపొంగు... 
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా 

చినుకులా రాలి... నదులుగా సాగి.... 
వరదలైపోయి... కడలిగాపొంగు... 
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 


ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే... కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే 
ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి వుంటనులే ... జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే ..
ఆ చల్లని చాలులే 

హిమములా రాలి .. సుమములై పూసి..
రుతువులై నవ్వి.. మధువులై పొంగి 
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
శిశిరమైన సిధిలమైన... విడిచిపోబోకుమా.. విరహమై పోకుమా

తొలకరికోసం తొడిమనునేనై.. అల్లడుతున్నానులే .. పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే 
నింగికినేలా అంటిసలాడె .. ఆ పొద్దురావాలిలే .. నిన్నలు నీడై.. రేపటి నేడై నాముద్దు తీరాలిలే... 
తీరాలు చేరాలిలే 

మౌనమై మెరిసి... గానమై పిలిచి... 
కలలతో అలిసి...  గగనమై ఎగసి ..
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ 
భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమ.. హా..ప్రేమ మనమే సుమ ...

చినుకులా రాలి... నదులుగా సాగి.... 
వరదలైపోయి... కడలిగాపొంగు... 
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా 

English

chinukulA rAli nadulugA sAgi varadalaipOyi kaDaligApoMgu nI prEma nA prEma nI pErE nA prEma 
nadivi nIvu kaDali nEnu marichipObOkumA hA mamata nIvEsumA 
chinukulA rAli nadulugA sAgi varadalaipOyi kaDaligApoMgu nI prEma nA prEma nI pErE nA prEma 

AkulurAle vEsavigAli nA prEma niTTUrpulE... kuMkumapUse vEkuva nIvai tEvAli OdArpulE 
prEmalukOre janmalalOni nEvEchi vuMTanulE ... janmaludATe prEmanu nEnai nEvelluvoutAnulE ..A challani chAlulE 

himamulA rAli .. sumamulai pUsi..rutuvulai navvi.. madhuvulai poMgi 
nI prEma nA prEma nI pErE nA prEma 
SiSiramaina sidhilamaina... viDichipObOkumA.. virahamai pOkumA

tolakarikOsam toDimanunEnai.. allaDutunnAnulE .. pulakaramUde puvvulakOsaM vEsArutunnAnulE 
niMgikinElA aMTisalADe .. A poddurAvAlilE .. ninnalu nIDai.. rEpaTi nEDai nAmuddu tIrAlilE... tIrAlu chErAlilE 

mounamai merisi gAnamai pilichi kalalatO alisi gaganamai egasi ..nI prEma nA prEma tArADE mana prEma 
bhuvanamainA gaganamainA prEmamayamE suma.. hA..prEma manamE suma ...

chinukulA rAli nadulugA sAgi varadalaipOyi kaDaligApoMgu nI prEma nA prEma nI pErE nA prEma