Thursday, August 7, 2025

Sommu penchaku baabayo telugu lyrics [సొమ్ము పెంచకు బాబయో] - Baabai abbai

Song Name :Sommu penchaku babayo
Movie:Baabai abbai
Singers:S.P. Balasubramanyam garu, 
Lyricist:Veturi Sundararama murthy garu
Composer:K. Chakravarthi garu
Director:Jandhyala garu

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

పెరిగిపోతే పైకం ఎదుగుతుందీ మైకం .. బాబయో.. అబ్బయో .. బాబయో

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

నల్లడబ్బుని దాచడానికి గుడ్డిగ నమ్మాలీ

నానా గడ్డీ కరవాలి, ఎందరి కాళ్ళో పట్టాలి 

తెల్ల డబ్బుపై హక్కు కోసము బొక్కలు వెతకాలి

ఎన్నో ట్రిక్కులు చేయ్యాలీ, టాక్సులు తక్కువ కట్టాలీ 

కుప్ప తెప్పలుగ చెరువు నిండితే కప్పలు చేరుట ఖాయం 

అప్పలంగా వచ్చిన సొమ్ము దిక్కు పెట్టడం ఖాయం 

చెలిమికి చేసిపొవురా గాయం, యూయం యూయం మయం మయం 

యూయం యూయం మయం మయం 

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

డబ్బులెక్కకు ఇంటికుక్కలు తరగక తప్పదురా 

అవి మొరగక తప్పదురా 

నిన్నే కరవక మానవురా 

మనఃశ్శాంతికి ఆరోగ్యానికి తిప్పలు తప్పవు రా, 

గుళికలు మింగక తప్పదురా, చావుకు లొంగక తప్పదురా 

జబ్బు చేసినా, డబ్బు చేసినా తాగక తప్పదురా, మందు తాగక తప్పదు రా 

ఆసుపత్రిలో ఆసుపత్రమో తగలక తప్పవురా మనిషి మారుట తధ్యమురా 

సొమ్ములు కూడబెట్టడం పాపం, శాంతం సౌఖ్యం మాయం మాయం

శాంతం సౌఖ్యం మాయం  మాయం

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో

పెరిగిపోతే పైకం ఎదుగుతుందీ మైకం .. బాబయో.. అబ్బయో .. బాబయో

సొమ్ము పెంచకు బాబయో.. సొమ్మసిల్లకు అబ్బయో 

Tuesday, August 5, 2025

Bhadrasaila rajamandira [భద్రశైల రాజమందిరా శ్రీ రామచంద్ర] - Sri Ramadasu

Song Name :bhadrasaila rajamandira
Movie:Sri Ramadasu
Singers:Hariharan garu, K.S. Chitra garu
Lyricist:Ramadasu garu
Composer:M.M. Keeravani garu
Director:K. Raghavendra Rao garu

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే 

రఘునాథాయ నాథాయ సీతాయః పతయేనమహః 

భద్రశైల రాజమందిరా శ్రీ రామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా 

భద్రశైల రాజమందిరా శ్రీ రామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా 

వేదవినుత రాజమండలా శ్రీ రామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా 

వేదవినుత రాజమండలా శ్రీ రామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా 

సతత రామదాస పోషకా శ్రీ రామచంద్ర వితత భద్రగిరినివేషకా 

భద్రశైల రాజమందిరా శ్రీ రామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా 

బాహుమధ్య విలసితేంద్రియా .. బాహుమధ్య విలసితేంద్రియా 

కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామ 

కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామ 

నీదండనాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దు పరాకు 

కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామ 

తల్లివినీవే తండ్రివినీవే దాతవునీవే దైవమునీవే 

కోదండరామ కోదండరామ రామా రామా రామా కోదండరామ 

దశరథరామ గోవిందా మము దయచూడు పాహీ ముకుందా 

దశరథరామ గోవిందా మము దయచూడు పాహీ ముకుందా 

దశరథరామ గోవిందా 

దశముఖ సంహారా ధరనిజపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర 

దశరథరామ గోవిందా 

తక్కువేమిమనకూ రాముండొక్కడుండు వరకూ

తక్కువేమిమనకూ రాముండొక్కడుండు వరకూ

పక్కతోడుగా భగవంతుడుమును చక్రధారియై చెంతనె ఉండగ 

తక్కువేమిమనకూ రాముండొక్కడుండు వరకూ

తక్కువేమిమనకూ రాముండొక్కడుండు వరకూ

జయ జయ రామా జయ జయ రామా జగధబిరామా జానకిరామా

జయ జయ రామా జయ జయ రామా జగధబిరామా జానకిరామా

జయ జయ రామా జయ జయ రామా జగధబిరామా జానకిరామా

జయ జయ రామా జయ జయ రామా జగధబిరామా జానకిరామా

పాహి రామప్రభో పాహి రామప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో 

పాహి రామప్రభో పాహి రామప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో 

పాహి రామప్రభో  

శ్రీమన్ మహాగుణస్తోమాభిరామా, నీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో 

సుందరాకార మన్ మందిరోద్ధార  సీతేందిరా సంయుతానంద రామప్రభో 

పాహి రామప్రభో  

పాహి రామప్రభో  

పాహి రామప్రభో 

Thursday, July 31, 2025

Poddunne puttindi chandamama [పొద్దునే పుట్టింది చందమామ] - Satruvu

Song Name :Poddunne puttindi chandamaama
Movie:Satruvu
Singers:Mano garu, K.S. Chitra garu
Lyricist:Sirivennela Seetharama sastry garu
Composer:Raj-Koti garu
Director:Kodi Ramakrishna garu

పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

మౌనంగా పుట్టావా గీతిక, స్నెహంతో మీటావా మెల్లగా

తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దరలేచి ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మా ఓ రబ్బరుబొమ్మా లాలిచ్చేదెట్టా చెప్పమ్మా 

మొగ్గంటీ బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జోకొట్టాలయ్యో 

నా కంటిపాపల్లో ఉయ్యాల వెయ్యాలా, ఈ కొంటె పాపాయికి 

ముందు మునుపూ లేని ఈ పొద్దటి వెన్నెల ఆవిరిలో, ముద్దు మురిపాలన్ని పండించేదెట్టాగో 

ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరగని ఈ కొంటె చక్కిలిగింతల ఉక్కిరిబిక్కిరికి 

పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

నీకోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లో గూడే కట్టాను నా బంగరుగువ్వ గుమ్మంలో చూపులు పెట్టాను 

నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురముంటాను నా పచ్చని కొమ్మ పొమ్మన్నా పక్కకి పోలేను 

శృంగార స్నేహాల సంకెళ్ళు వెయ్యాలా, చిన్నారి చిందాటతో 

ఉరికే గోదారంటి నా ఉడుకూ దుడుకూ తగ్గించి, కొంగున కట్టేసేనీ కిటుకేదో చెప్పమ్మా 

పశి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదొ రేయేదో తెలియదులేవయ్యో  

పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

మౌనంగా పుట్టావా గీతిక, స్నెహంతో మీటావా మెల్లగా

తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దరలేచి ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

Sunday, July 27, 2025

Uruko uruko bangarukonda telugu lyrics [ఊరుకో ఊరుకో బంగారుకొండ] - Aatma Bandham

Song Name :Uruko uruko bangarukonda
Movie:Aatmabandham
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Sirivennela Seetharama sastry garu
Composer:M.M. Keeravani garu
Director:Suneel Varma garu

ఊరుకో ఊరుకో బంగారుకొండ నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండ 

దాయి దాయి దాయి దాయి దమ్మనీ, చేయిజారిపోయిన జాబిల్లిని 

తేలేని తల్లిని ఏడిపించకుండా 

ఊరుకో ఊరుకో బంగారుకొండ నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండ 

ఇంకిపోని గంగలా కంటినీరు పొంగినా చల్లబడకుందే ఎడారి.. ఎదలో 

జ్ఞాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా కొంటెఊపిరింకా మిగిలుంది

చల్లనీ నీ కళ్ళలో కమ్మని కలలే చెమ్మగిల్లనీయ్యకుమా కరిగిపోతాను

దాయి దాయి దాయి దాయి దమ్మనీ, చేయిజారిపోయిన జాబిల్లిని 

తేలేని తల్లిని ఏడిపించకుండా 

ఊరుకో ఊరుకో బంగారుకొండ నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండ 

గుక్కపట్టి ఏడ్చినా ఉగ్గుపట్టవేమని తప్పుపట్టి తిట్టేవారేరీ .. తండ్రీ 

అమ్మ వొట్టి మొద్దురా జట్టు ఉండొద్దురా అంటు ఊరడించే నాన్నేరీ 

చెప్పరా ఆ గుండెలో చప్పుడే నేనని జన్మలెన్ని దాటైనా చేరుకుంటానని 

దాయి దాయి దాయి దాయి దమ్మనీ, చేయిజారిపోయిన జాబిల్లిని 

తేలేని తల్లిని ఏడిపించకుండా 

ఊరుకో ఊరుకో బంగారుకొండ నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండ 

దాయి దాయి దాయి దాయి దమ్మనీ, చేయిజారిపోయిన జాబిల్లిని 

తేలేని తల్లిని ఏడిపించకుండా 

Vevela varnala telugu lyrics [వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా] - Sankeerthana - #250

Song Name :VeVela varnala
Movie:Sankeerthana
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennela Seetharama sastry garu
Composer:Illayaraja garu
Director:Geetha Krishna garu

వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా 

అలలూ శిలలూ తెలిపే కథలు, పలికే నాలో గీతాలై  

వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా 

ఓ గంగమ్మా పొద్దెక్కిపొతంది తొరగా రాయే 

ఓ.. తల్లి గోదారి తుళ్ళి తుళ్ళి పారేటి పల్లె పల్లే పచ్చాని పందిరి .. పల్లె పల్లే పచ్చాని పందిరి 

నిండు నూరేళ్ళు పండు ముత్తైదువల్లె ఉండు పంటలకేమి సందడి, పట్ట పంటాలకేమి సందడి 

తందైన తందత్తైన తందైన తందత్తైన తందైన తందత్తయ్యనా తయ్య తందైన తందత్తయ్యనా  

వానవేలితోటి నేల వీణ మీటె, నీలినింగి పాటే ఈ చేలట 

కాళిదాసులాటి ఈ తోటరాసుకున్నా కమ్మనైన కవితలే ఈ పూలట  

ప్రతి కదలికలో నాట్యమె కాదా, ప్రతి ఋతువూ ఒక చిత్రమె కాదా 

ఎదకే కనులుంటే 

వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా 

అలలూ శిలలూ తెలిపే కథలు, పలికే నాలో గీతాలై  

వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా