Saturday, May 31, 2025

Soundaryalahari swapnasundari [సౌందర్యలహరి స్వప్నసుందరి] - Pelli Sandadi

Song Name :Soundarya lahari
Movie:Pelli sandadi
Singers:S.P. Bala subramanyam garu, K.S. Chitra garu
Lyricist:Sirivennel Sitarama sastry garu
Composer:M.M. Keeravaani garu
DirectorK. Raghavendra rao garu 

సౌందర్యలహరి .. సౌందర్యలహరి 

సౌందర్యలహరి స్వప్నసుందరి, నువ్వే నా ఊపిరీ

శృంగారనగరి స్వర్ణమంజరి, రావే రసమాధురీ

వన్నె చిన్నెల చిన్నారి నీ జంటకోరి, ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి

కలనుంచి ఇలచేరి కనిపించు ఓసారి 

సౌందర్యలహరి స్వప్నసుందరి, నువ్వే నా ఊపిరీ

పాలచెక్కిళ్ళూ దీపాలపుట్టిళ్ళూ 

పాలచెక్కిళ్ళూ దీపాలపుట్టిళ్ళూ, అదిరేటి అధరాలు హరివిల్లులూ 

ఫక్కున చిందిన నవ్వులలో, లెక్కకు అందని రతనాలు 

యతికైన మతిపోయె ప్రతి భంగిమా, ఎదలోనె పురివిప్పి ఆడింది వొయ్యారి

సౌందర్యలహరి స్వప్నసుందరి, నువ్వే నా ఊపిరీ

నీలి కన్నుల్లూ, నా పాలి సంకెళ్ళూ 

నీలి కన్నుల్లూ, నా పాలి సంకెళ్ళూ, నను చూసి వలవేసి మెలివెయ్యగా 

ఊసులు చెప్పిన గుసగుసలు, శ్వాశకు నేర్పెను సరిగమలు 

కలగంటి తెలుగింటి కలకంఠిని 

కొలువుంటె చాలంట నాకంట సుకుమారి 

సౌందర్యలహరి స్వప్నసుందరి, నువ్వే నా ఊపిరీ

సౌందర్యలహరి స్వప్నసుందరి, నువ్వే నా ఊపిరీ 

Vaana vaana velluvaye [వానా వానా వెల్లువాయె] - Gangleader

Song Name :Vana vana velluvaye
Movie:Gangleader
Singers:S.P. Bala subramanyam garu, K.S. Chitra garu
Lyricist:Bhuvana chandra garu
Composer:Bappilahari garu
DirectorVijaya baapineedu garu 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

ప్రియుని శ్వాశలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం

పక్కన చేరిన మగమహరాజుకి సొంతం 

హో..తొలకరి చిటపట చినుకులలో మకరందం

చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం 

చివురుటాకులా చలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా..

ఒడిలో రేగెను ఎదో తెలియని జ్వాలా..

ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా

బిగిసిన కౌగిట కరిగించెను పరువాలా 

కలవరింతలే పలకరింపులై పదునుమీరగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

ప్రియుని శ్వాశలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

Friday, May 30, 2025

Kalake kalavo [కళకే కళ ఈ అందమూ] - Amavasya Chandrudu

Song Name :Kalake kalavo
Movie:Amavasya Chandrudu
Singers:S.P. Bala subramanyam garu
Lyricist:Veturi Sundararama murthy garu
Composer:Illayaraja garu
DirectorSingeetam Srinivasa rao garu 

కళకే కళ ఈ అందమూ, ఏ కవీ రాయనీ తీయ్యనీ కావ్యమూ 

కళకే కళ ఈ అందమూ

నీలి కురులు పోటీ పడెను మేఘమాలతో..

కోల కనులు పంతాలాడే గండుమీలతో.

వదనమో జలజమో నుదురదీ ఫలకమో 

చెలి కఠం పలికే శ్రీ శంఖము 

కళకే కళ ఈ అందమూ

పగడములను ఓడించినవీ చిగురు పెదవులు .. హా...

వరుసతీరి మెరిసే పళ్ళు మల్లె తొడుగులు 

చూపులో తూపులో చెంపలో కెంపులో 

ఒక అందం తెరలో దోబూచులు  

కళకే కళ ఈ అందమూ

తీగలాగ ఊగే నడుము ఉండిలేనిది

దాని మీద పూవై పూచి నాభి ఉన్నదీ 

కరములో కొమ్మలో కాళ్ళవీ బోదెలో

ఈ రూపం ఇలలో అపురూపము

కళకే కళ ఈ అందమూ 

Sundaramo sumadhuramo [సుందరమో సుమధురమో ] - Amavasya Chandrudu

Song Name :Sundaramo sumadhuramo
Movie:Amavasya Chandrudu
Singers:S.P. Bala subramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundararama murthy garu
Composer:Illayaraja garu
DirectorSingeetam Srinivasa rao garu 

స రి గ మ ప ద ని సప్త స్వరాలు మీకు, అవి ఏడురంగుల ఇంద్రధనుస్సులు మాకు 

స రి గ మ ప ద ని సప్త స్వరాలు మీకు, అవి ఏడురంగుల ఇంద్రధనుస్సులు మాకు 

మనసే ఒక మార్గము, మమతే ఒక దీపము, ఆ వెలుగే మాకు దైవమూ 

స రి గ మ ప ద ని సప్త స్వరాలు మీకు, అవి ఏడురంగుల ఇంద్రధనుస్సులు మాకు 

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

మలయజమారుత శీకరమో, మనసిజరాగ వశీకరమో 

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

ఆనందాలే భోగాలైతే ఆ... హంసానంది రాగాలైతే

నవవసంత గానాలేవో సాగేనులే, సురవీణానాదాలెన్నో మోగేనులే 

వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో

మానుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలో

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

అందాలన్నీ అందేవేళ ఆ.. బంధాలన్నీ పొందేవేళ 

కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే 

కోరికలే శారికలై ఆడెను కూడెను సందడిలో, 

మల్లెల తావుల పిల్లనగ్రోవులు పల్లవి పాడిన పందిరిలో  

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

మలయజమారుత శీకరమో, మనసిజరాగ వశీకరమో 

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో 

Wednesday, May 28, 2025

Idele tara tarala charitam [ఇదేలే తరతరాల చరితం] - Peddarikam

Song Name :Idele taratarala charitam
Movie:Peddarikam
Singers:K.J. Yesudas garu, Swarnalatha garu
Lyricist:Vaddepalli chandra garu
Composer:Raj-Koti garu
DirectorA.M. Ratnam garu 

ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా 

నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా 

ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

ఓడిలో పెరిగిన చిన్నారినే, ఎరగా చేసినదా ద్వేషమూ 

కథ మారదా, ఈ బలి ఆగదా 

మనిషే పశువుగ మారితే, కసిగా శిశువుని కుమ్మితే 

మనిషే పశువుగ మారితే, కసిగా శిశువుని కుమ్మితే 

అభమూ శుభమూ ఎరుగని వలపులు ఓడిపోయేనా 

ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా 

నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా 

ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

విరిసీ విరియని పూదోటలో, రగిలే మంటలు చల్లారవా 

ఆర్పేదెలా ఓదార్చేదెలా 

నీరే నిప్పుగ మారితే, వెలుగే చీకటి రువ్వితే

నీరే నిప్పుగ మారితే, వెలుగే చీకటి రువ్వితే

పొగలో సెగలో మమతల పూవూలు కాలిపోయేనా 

ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా 

నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా 

ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కధనం