| Song Name : | Sundari nene nuvvanta |
| Movie: | Dalapathi |
| Singers: | S.P. Bala subramanyam garu, K.S. Chitra garu |
| Lyricist: | Rajasri garu |
| Composer: | Illayaraja garu |
| Director | Mani Rathnam garu |
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా
రేపవలు నిద్దరలోనూ ఎద నీ తోడే కోరును
యుద్ధాన ఏమైన నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శొధనా
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావొ, ప్రేమే నన్నే గెలిచేనే..
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
పూవ్వులే ముళ్ళై తోచు నేవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ యెద మాటున చేరితే
ఆ..మాసాలు వారాలౌను నీవు నేను కూడితే
వారాలు మాసాలౌను మాటేమారి సాగితే
పొంగునీ బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ యెదుట ఉంటే
నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట

సూపర్ 👍👍
ReplyDelete90
ReplyDeleteMy fevaret song
ReplyDeleteSuper song
ReplyDelete