Saturday, December 6, 2025

Manasuna manasuga [మనసున మనసుగ నిలచిన కలవా] - Love Birds

Title :Manasuna manasuga
Movie:Love birds
Singers:Hariharan గారు, K.S. Chitra గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:A.R. Rahman గారు
Director:P. Vasu గారు

మనసున మనసుగ నిలచిన కలవా

పిలిచిన పలకగ ఎదుటనే కలవా 

దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం

మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే ...


మేఘం నేలవొళ్ళో మీటే రాగమల్లే, ప్రేమా వరాలజల్లు కావా

పిలుపే అందుకోని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా 

నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగున 

మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ 

నిరీక్షించు స్నేహం కోరి జతనే రానా రానా

ఉప్పొంగిపోయే ప్రాయం నిన్నువిడువదు ఏవేళైన 

నా శ్వాశ ప్రతిపూట వినిపించు నీ పాట 

ఏడేడు జన్మాలు నేనుంట నీ జంట

మనసున మనసుగ నిలచిన కలవా

పిలిచిన పలకగ ఎదుటనే కలవా 

దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం

మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే ...


పూవ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా..

విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా 

కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై 

వేటాడు ఏ ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై 

నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై 

నువునేను చెరిసగమౌదాం వయస్సుపండించే వరమై 

ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం 

తుదేలేని ఆనందం వేచేనే నీకోసం 

మనసున మనసుగ నిలచిన కలవా

పిలిచిన పలకగ ఎదుటనే కలవా 

దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం

మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే ..