Monday, September 1, 2025

Evaraina epudaina [ఎవరైన ఎపుడైనా సరిగా గమనించారా] - Aanandam / Anandam

Title :Evaraina epudaina
Movie:Aanandam
Singers:Pratap, K.S. Chitra గారు
Lyricist:Sirivennela Seetharamasastry గారు
Composer:Devi Sri Prasad గారు
Director:Srinu Vaitla గారు

ఎవరైన ఎపుడైనా సరిగా గమనించారా, చలిచెర అసలెప్పుడు వదిలిందో 

అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా, తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

చూస్తూనే ఎక్కడనుంచో ఛైత్రం కదిలొస్తుంది, పొగమంచును పోపొమ్మంటూ తరిమేస్తుంది

నేలంతా రంగులుతొడిగి సరికొత్తగ తోస్తుంది, తనరూపం తానేచూసి పులకిస్తుంది 

ఋతువెప్పుడు మారిందో బతుకెప్పుడు విరిసిందో, మనసెప్పుడు వలపుల వనమైందో 

ఓ...

ఎవరైన ఎపుడైనా సరిగా గమనించారా, చలిచెర అసలెప్పుడు వదిలిందో 

అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా, తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా, నడిరాతిరి తొలివేకువ రేఖా 

నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే, ఒక చల్లని మదిపంపిన లేఖా 

గగానాన్నీ నేలని కలిపే వీలుందని చూపేలా, ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా 

చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా, అక్షరమూ అర్థంకానీ ఈ విధిరాత 

కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ 

హో..

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా, నడిరాతిరి తొలివేకువ రేఖా 

నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే, ఒక చల్లని మదిపంపిన లేఖా