Sunday, June 29, 2025

Manasa tullipadake telugu lyrics [మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే] - Srivaariki Premalekha

Song Name :Manasa tulli padake
Movie:Srivariki premalekha
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Ramesh Naidu garu
DirectorJandhyala garu 


మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

అతనికి నీవు నచ్చావొ లేదో, ఆ శుభగడియా వచ్చేనొ రాదో 

తొందర పడితే అలుసే మనసా తెలుసా 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 


ఏమంత అందాలు కలవనీ, వస్తాడు నిన్ను వలచి

ఏమంత సిరివుంది నీకనీ, మురిసేను నిన్ను తలచి

చదువా పదవా ఏముంది నీకు, తళుకూ కులుకూ ఏదమ్మ నీకు 

శృతిమించకే నీవు మనసా..

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

అతనికి నీవు నచ్చావొ లేదో, ఆ శుభగడియా వచ్చేనొ రాదో 

తొందర పడితే అలుసే మనసా తెలుసా 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 


ఏ నోము నోచావు నీవనీ, దొరికేను ఆ ప్రేమ ఫలము

ఏ దేవుడిస్తాడు నీకనీ, అరుదైన అంత వరమూ 

మనసా వినవే అంత అందగాడు, తనుగా జతగా మనకందిరాడు

కలలాపవే కన్నె మనసా..

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

అతనికి నీవు నచ్చావొ లేదో, ఆ శుభగడియా వచ్చేనొ రాదో 

తొందర పడితే అలుసే మనసా తెలుసా 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే   

Monday, June 23, 2025

Ooru palletooru telugu lyrics [ఊరూ పల్లెటూరు దీనితీరే అమ్మతీరు] - Balagam

Song Name :Ooru palletooru
Movie:Balagam
Singers:Ram miriyala, Mangli
Lyricist:Kasarla Shyam
Composer:Bheems Cecirolio garu
DirectorVenu Yeldandi garu 

ఓరి వారీ, ఇంకా పిండుతున్నావురా పాలు ఇకెప్పుడుపోతావురా ఊర్లోకు నీహ్ యక్కా 

ఇహ పొద్దుపొద్దునే మొదలెట్టినావు. నిహ్ పాసుగాల 

కోలో నా పల్లే కోడికూతల్లే, ఒళ్ళిరుసుకుందే కోడె లాగల్లే

యాపపుల్లలా షేదునమిలిండే రామ రామ రామా 

తలకుపోసుకుండె నా నేలతల్లే, అలికి పూసుకుండె ముగ్గు సుక్కల్లే 

సద్దిమూటల్లే సగబెట్టుకుందే బాయిగిరక నా పల్లే 


తెల్లా తెల్లని పాలధారల్లల్ల పల్లే తెల్లారుతుంటాదిరా 

గుళ్ళోని గంటలు కాడెడ్లమెడలోన జంటగమోగుతు ఉంటయిరా 

నాగలి భుజాన పెట్టూకుంటె దోస్తులు చెయ్యేసినట్టేరా 

గొడ్డూ గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా 

సల్లగాలి మోసుకొచ్చెరా సేనుసిలకలా ముచ్చట్లు

దారిపొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లూ  

గడ్డిమోపులు కాల్వగట్టులు సెమటసుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల 

ఆ.. ఊరూ పల్లెటూరు దీనితీరే అమ్మతీరు, కొంగులోనా దాసిపెట్టీ కొడుకుకిచ్చే ప్రేమ వేరు 

ఊరూ పల్లెటూరు దీని తీరే కన్నకూతురు కళ్ళముందే ఎదుగుతున్నా సంబరాలా పంట పైరు  

ఆ.. వంద గడపలా మంద నా పల్లే గోదకట్టనీ గూడు నా పల్లే

చెహ్రువుల్ల తుల్లేటి జల్ల చాపోలే రామ రామ రామా..


మావా ఒ ధంపడదాం రా, యేలాపాళా లేదానై.. కానీండి కానీండి (Dialogue)

మావా అత్త బావ బాపు వరసల్లే, ఊరంత సుట్టాల ముల్లేలాపల్లే

దారంల ఒదిగీన పూలదండల్లే రంగుల సింగిడి పల్లే 

(Dialogue)

అగో..ఎమయ్యె బావ ఎటో పోతాండవ్.. ఒత్తవ పిల్ల నాతోటి 

సిగ్గులేదు నీకు ఇంకా అత్తరు నీతోటి 

పైసలీయ్.. రాస్కో.. ఎయ్..ఎయ్.. సూపియ్ ... సూడు 

(Dialogue)

ఆలుమగలు ఆడే ఆటలూ అత్తకోడండ్ల కొట్లాటలూ

సదిరి సెప్పాలేని మగని తిప్పలే తిప్పలూ 

రచ్చాబండ మీద ఆటలూ చాయ బండికాడ మాటలూ 

వచ్చి పోయెటోళ్ళ మందలించికునె సంగతే గమ్మత్తీ  

తట్టబుట్టలల్ల కూర తొక్కులూ, సుట్టపట్టాలల్ల బీడి కట్టలూ 

చేతనైన సాయంచేసె మనుషులూ, మావిపూతగాసినట్టే మనసులూ 

ఊరంటే రొజు ఊగాది సచ్చేదాక ఉంటది అది  

ఊరూ నా ఊరు దీని తీరే అమ్మతీరు, కొంగులోన దాసిపెట్టీ కొడుకుకిచ్చే ప్రేమవేరు 

ఊరూ పల్లెటూరు దీని తీరే కన్నకూతురు కండ్లముందే ఎందుగుతున్నా సంబరాల పంటపైరు  

Sunday, June 22, 2025

Mouname nee bhasha telugu lyrics [మౌనమె నీ భాష ఓ మూగమనసా] - Guppedu manasu

Song Name :Mouname ni bhasha
Movie:Guppedu manasu
Singers:Mangalampalli Bala Murali krishna garu
Lyricist:Acharya Aatreya garu
Composer:M.S. Viswanaathan garu
DirectorK. Bala chander garu 

మౌనమె నీ భాష ఓ మూగమనసా 

మౌనమె నీ భాష ఓ మూగమనసా 

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు 

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు 

కల్లలు కాగానె కన్నీరౌతావు 

మౌనమె నీ భాష ఓ మూగమనసా, ఓ మూగమనసా 


చీకటి గుహనీవు చింతల చెలి నీవు 

చీకటి గుహనీవు చింతల చెలి నీవు 

నాటకరంగానివే.. మనసా తెగిన పతంగానివే 

ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో 

ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో 

ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

మౌనమె నీ భాష ఓ మూగమనసా 

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు 

కల్లలు కాగానె కన్నీరౌతావు 

మౌనమె నీ భాష ఓ మూగమనసా, ఓ మూగమనసా 


కోర్కెల చెల నీవు, కూరిమి వల నీవు 

కోర్కెల చెల నీవు, కూరిమి వల నీవు 

ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దెయ్యానివే 

లేనిది కోరేవు ఉన్నది వదిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు 

ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమె నీ భాష ఓ మూగమనసా 

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు 

కల్లలు కాగానె కన్నీరౌతావు 

మౌనమె నీ భాష ఓ మూగమనసా, ఓ మూగమనసా  

Nirantaramu vasantamule telugu lyrics [నిరంతరమూ వసంతములే] - Preminchu Pelladu

Song Name :Nirantaramu vasantamule 
Movie:Preminchu Pelladu
Singers:S.P. Bala subramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorVamsy garu 


నిరంతరమూ వసంతములే మందారములా మరందములే 

స్వరాలు సుమాలుగ పూచే, పదాలు ఫలాలుగ పండె

నిరంతరమూ వసంతములే మందారములా మరందములే 


నిరంతరమూ వసంతములే మందారములా మరందములే 

స్వరాలు సుమాలుగ పూచే, పదాలు ఫలాలుగ పండె

నిరంతరమూ వసంతములే మందారములా మరందములే 


హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం 

తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం

నదులలో వీణమీటే తెమ్మెరే మాకు ప్రాణం

అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం

ఆకశానికవి తారలా, ఆశకున్న విరిజాజులా 

ఈ సమయం ఉషోదయమై, మా హృదయం జ్వలిస్తుంటే 

నిరంతరమూ వసంతములే మందారములా మరందములే 

స్వరాలు సుమాలుగ పూచే, పదాలు ఫలాలుగ పండె

నిరంతరమూ వసంతములే మందారములా మరందములే 


అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయె

మెరుపు లేఖల్లు రాసీ మేఘమే మూగవోయే 

మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే 

మాఘదాహాలలోనా అందమే అత్తరాయె 

మల్లెకొమ్మ చిరునవ్వులా, మనసులోని మరుదివ్వెలా 

ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే 

నిరంతరమూ వసంతములే మందారములా మరందములే 

స్వరాలు సుమాలుగ పూచే, పదాలు ఫలాలుగ పండె

నిరంతరమూ వసంతములే మందారములా మరందములే  

Thursday, June 19, 2025

Tolisaari mimmalni choosindi modalu [తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు] - Srivariki Premalekha

Song Name :Tolisari mimmalni chusindi modalu
Movie:Srivariki premalekha
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Ramesh Naidu garu
DirectorJandhyala garu 


శ్రీమన్ మహారాజ మార్తాండతేజ ప్రియానందభోజ 

మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ..

భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములూ 

సంధ్యారగం చంద్రహారతి పడుతున్నవేళ 

మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ 

ఓ శుభ ముహూర్తాన 


తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ ఎన్నెన్నో కథలు

జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామగోవిందా జో జో

నిదురపోని కనుపాపలకు జోల పాడలేక 

ఈలవేసి చంపుతున్న ఈడునాపలేక 

ఇన్నాళ్ళకు రాస్తున్న ఊహుహు.. ప్రేమలేఖ

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ ఎన్నెన్నో కథలు


ఏ తల్లి కుమారులో తెలియదికానీ, ఎంతటి సుకుమారులో తెలుసునాకు 

ఎంతటి మగధీరులో తెలియలేదుగానీ, నా మనసుని దోచిన చోరులు మీరు 

వలచి వచ్చిన వనితను చులకన చేయక, తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించి 

చప్పున బదులివ్వండీ, చప్పున బదులివ్వండీ

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ ఎన్నెన్నో కథలు 


తలలోన తరుముకున్న తుంటరి మల్లే, తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే 

సూర్యుడు చుట్టూ తిరిగే భూమికి మల్లే, నా ఓర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే 

నీ జతనే కోరుకుని లతలాగ అల్లుకునె నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే 

ఇప్పుడే బదులివ్వండీ ... ఇప్పుడే బదులివ్వండీ 

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ ఎన్నెన్నో కథలు 

Sunday, June 15, 2025

Nemaliki Nerpina [నెమలికి నేర్పిన నడకలివి] - Saptapadi

Song Name :Nemaliki nerpina
Movie:Saptapadi
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 


నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివీ 

శృంగార సంగీత నృత్యాభినయవేళ చూడాలి నా నాట్యలీలా 


కలహంసలకిచ్చెను పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు  

కలహంసలకిచ్చెను పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు   

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలూ, ఏవేవో కన్నుల కిన్నెరలూ 

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలూ, ఏవేవో కన్నుల కిన్నెరలూ 

కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన 

కాళిదాసు కమనీయ్య కల్పనా  మల్పశిల్ప మణిమేఖలనూ శకుంతలను 

నెమలికి నేర్పిన నడకలివి


చిరునవ్వులు అభినవ మల్లికలూ, సిరిమువ్వలు అభినయ దీపికలూ

చిరునవ్వులు అభినవ మల్లికలూ, సిరిమువ్వలు అభినయ దీపికలూ

నీలాల కన్నుల్లో తారకలూ, తారాడే చూపుల్లో చంద్రికలూ 

నీలాల కన్నుల్లో తారకలూ, తారాడే చూపుల్లో చంద్రికలూ 

కురులు విరిసి, మరులు కురిసి మురిసిన

రవివర్మ చిత్రలేఖనాలేఖ్య సరస సౌందర్య రేఖనూ.. శశిరేఖను 


నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివీ 

శృంగార సంగీత నృత్యాభినయవేళ చూడాలి నా నాట్యలీలా 

నెమలికి నేర్పిన నడకలివి 

Sangeeta sahitya [సంగీత సాహిత్య సమలంకృతే] - Swathi Kiranam

Song Name :Sangita sahitya
Movie:Swathi Kiranam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:C. Narayana reddy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 


సా రిగమపదనిసా నిదపమగరిసరీ ఆ...

సంగీత సాహిత్య సమలంకృతే 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

హే భారతీ మనసా స్మరామి 

హే భారతీ మనసా స్మరామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే 


వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసినీ, నాద నాదాంత పరివేషినీ ఆత్మ సంభాషినీ 

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసినీ, నాద నాదాంత పరివేషినీ ఆత్మ సంభాషినీ 

వ్యాస వాల్మీకి వాగ్ధాయిని, వ్యాస వాల్మీకి వాగ్ధాయిని జ్ఞానవల్లీ సముల్లసినీ..

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

సంగీత సాహిత్య సమలంకృతే


బ్రహ్మరసనాగ్ర సంచారిణీ ఆ..

బ్రహ్మరసనాగ్ర సంచారిణీ భవ్య ఫలకారిణీ, నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ 

బ్రహ్మరసనాగ్ర సంచారిణీ భవ్య ఫలకారిణీ, నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ 

సకల సుకళా సమున్వేషిణీ, సకల సుకళా సమున్వేషిణి సర్వ రసభావ సంజీవినీ... 

 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

హే భారతీ మనసా స్మరామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే..

Saturday, June 14, 2025

Cheliraava [చెలీరావా వరాలీవా] - Mouna raagam

Song Name :Cheliraava
Movie:Mouna raagam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Raajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Ratnam garu 

చెలీరావా వరాలీవా, నినే కోరే ఓ జాబిల్లీ 

నీజతకై వేచేను నిలువెల్లా నీవే 

చెలీరావా వరాలీవా


ఈ వేదనా తాళలేనే భామా చందమామ 

వెన్నెల్లనే పూలురువ్వి చూడూ ఊసులాడూ 

చెప్పాలనీ నీతో ఎదో చిన్నమాటా 

చెయ్యాలనీ స్నేహం నీతో పూట పూట 

ఊ అంటే నీ నోటా బ్రతుకే వెన్నెల తోటా 

చెలీరావా వరాలీవా


వొయ్యారాల నీలి నింగి పాడే కథలు పాడే 

ఉయ్యాలగా చల్లగాలి ఆడే చిందులాడే 

సుగంధాల ప్రేమా అందించగ రావా..

సుతారాల మాటా చిందించగా రాద 

ఆకాశం పగ అయితే మేఘం కదలాడేనా 

చెలీరావా వరాలీవా, నినే కోరే ఓ జాబిల్లీ 

నీజతకై వేచేను నిలువెల్లా నీవే 

చెలీరావా వరాలీవా, నినే కోరే ఓ జాబిల్లీ 

Malle Poola challa gaali [మల్లెపూల చల్లగాలి] - Mouna Ragam

Song Name :Mallepoola challagali
Movie:Mouna raagam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Raajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Ratnam garu 


మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా

ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ


వేదికై పోయే మన కథంతా నాటకం ఆయెనూ మనుగడంతా 

శోధనై పోయే హృదయమంతా బాటలే మారెనే పయనమంతా 

పండించవే వసంతం పంచవేలా సుగంధం 

నాగుండె గుడిలో నిలవాలీ .. రా 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా

ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ


తామరల పైన నీటిలాగా భర్తయూ భార్యయూ కలవరంటా

తోడుగా చేరి బతికేందుకూ సూత్రమూ మంత్రమూ ఎందుకంటా

సొంతం అనేదిలేక ప్రేమ బంధాలు లేక 

మోడంటి జీవితం ఇంకేలా... హ

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా

ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ


Sunday, June 8, 2025

Keeravani chilakala [కీరావాణి చిలకలా] - Anveshana

Song Name :Keeravani chilakala
Movie:Thoorpu Padamara
Singers:S.P. Balasubramanyam garu, S, Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorVamsi garu 

సా ని స రీ సా ని 

సా ని స మ గా మ రీ 

ప ద సా ని స రీ సా ని

సా ని స మ గా మ రీ 

ప ద స స స ని, రి రి రి స, గ గ గ రి, మ మ గ గ మా  

స ని ద ప మ గ రి స ని


కీరావాణి చిలకలా కొలికిరో పాడవేమే, వలపులే తెలుపగా 

విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా 

అలరులు కురిసున రుతువుల తడిసిన మధురసవాణి.. 

కీరావాణి చిలకలా కొలికిరో పాడవేమే, వలపులే తెలుపగా 


గ రి స పమగ పా ని

స రి గ రిసగ నీ సా

ఈ పూలలో అందమై, ఈ గాలిలో గంధమై 

నా తోటలో చైత్రమై, ఈ బాటనే నడచిరా 

నీ గగనాలలో నే చిరుతారనై, నీ అధరాలలో నే చిరునవ్వునై 

స్వరమే లయగా ముగిసే..

సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే 

కీరావాణి చిలకలా కలకల పాడలేదు, వలపులే తెలుపగా 

ఇలరాలిన పూవులు వెదజల్లెన తావుల 

అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి.. 

కీరావాణి చిలకలా కలకల పాడలేదు, వలపులే తెలుపగా 


నీ కన్నులా నీలమై, నీ కన్నులా వెన్నెలై 

సంపెంగలా గాలినై, తారాడనా నీడనై 

నీ కవనాలలో నే తొలిప్రాసనై  

నీ జవనాలలో జాజుల వాసనై 

ఎదలో ఎదలే కదిలే  

పడుచుల మనసుల పంజర శుకముల పలుకులు తెలియకనే

కీరావాణి చిలకలా కలకల పాడలేదు, వలపులే తెలుపగా 

విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా 

అలరులు కురిసున రుతువుల తడిసిన మధురసవాణి.. 

కీరావాణి చిలకలా కొలికిరో పాడవేమే, వలపులే తెలుపగా 

Sivaranjani navaragini [శివరంజని నవరాగిణి] - Thoorpu Padamara

Song Name :Sivaranjani navaragini
Movie:Thoorpu Padamara
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:C. Narayana reddy garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu 


శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహినీ ఆ..

శివరంజని నవరాగిణీ ఆ...


రాగాల శిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి 

రాగాల శిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి 

స్వర సుర ఝరీ తరంగానివీ

స్వర సుర ఝరీ తరంగానివీ, సరసహృదయ వీణా వాణివీ..

శివరంజని నవరాగిణీ ఆ...


ఆ కనులు పండు వెన్నెల ఘనులు, ఆ కురులు ఇంద్రనీలాల వనులు

ఆ కనులు పండు వెన్నెల ఘనులు, ఆ కురులు ఇంద్రనీలాల వనులు

ఆ.. వదనం అరుణోదయ కమలం 

ఆ.. అధరం సుమధుర మధుకలశం..

శివరంజని నవరాగిణీ ఆ...


జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహినీ జానకి

వేణుధరుని రథమారోహించిన  విదుషీమణి రుక్మిణీ 

రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా 

లలిత లావణ్య భయత సౌందర్య కలిత చండికా 

రావే.. రావే నా శివరంజనీ ..

మనోరంజనీ.. రంజనీ నా రంజనీ 

నీవే నీవే నాలో పలికే నాదానివీ 

నీవే నా దానివి నా దానివీ .. నీవే నాదానివీ 

Saturday, June 7, 2025

Oka Venuvu vinipinchenu [ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక] - America Ammayi

Song Name :Oka Venuvu vinipinchenu
Movie:America Ammayi
Singers:G. Anand garu
Lyricist:Mylavarapu Gopi garu
Composer:G.K Venkatesh garu
DirectorSingeetam Srinivasa Rao garu 


ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక 

ఒక రాధిక అందించెను నవరాగ మాలిక 

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక 


సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో 

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో 

నవమల్లిక చినబోయెను, నవమల్లిక చినబోయెను, చిరునవ్వు సొగసులో 

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక 


వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెను 

వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెను 

రేరాణియె నా రాణికి, రేరాణియె నా రాణికి పారాణి పూసెను 

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక 


ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా

ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా

నా గుండెలో వెలిగించెను, నా గుండెలో వెలిగించెను సింగార దీపిక