Wednesday, December 31, 2025

Nilavade madi nilavade [నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి] - Satamaanam Bhavati

Title :Nilavade madi nilavade
Movie:Satamaanam Bhavati
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Rama Jogayya sastri గారు
Composer:Mickey J Meyer గారు
Director:Satish Vegesna గారు

నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి

ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ 

దేవదాసే కాళిదాసై ఎంతపొగిడినా కొంతమిగిలిపోయేంత అందం నీది

నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి

ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ 

అలానువ్వు చూస్తేచాలు వెళుతూవెళుతూ వెనుతిరిగి

అదోలాంటీ తేనెలబాణం దిగదా ఎదలోకి 

నువ్వునడిచే దారులలో పూలగంధాలె ఊపిరిగా

జతనడిచే మనసుకదే హాయిరాగాల ఆమనిగా దినమొకరకముగ పెరిగిన సరదా నినువిడి మనగలదా

నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి

ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ 

ఎలా నీకు అందించాలో యదలోకదిలే మధురిమలూ 

నేనే ప్రేమలేఖగమారి ఎదుటేనిలిచాను    

చదువుకుని బదులిదని చెప్పుకొలేవులేమనసా 

పదములతో పనిపడని మౌనమే ప్రేమపరిభాష 

గెలుపొకతెలిపిన వలపొకవరమని కడలిగ అలలెగసా 

నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి

ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ 

దేవదాసే కాళిదాసై ఎంతపొగిడినాకొంతమిగిలిపోయేంత అందం నీది 

Saturday, December 27, 2025

Chikiri Chikiri telugu lyrics [చికిరి చికిరీ - ఆ చంద్రుళ్ళో ముక్క జారిందే దీనక్క] - Peddi

Title :Chikiri
Movie:Peddi
Singers:Mohit Chouhan గారు
Lyricist:Balaji గారు
Composer:A.R. Rahman గారు
Director:Bucchi babu గారు

క్రింది పాటలో ఉత్తరాంధ్ర మాండలిక ప్రయోగాలని సాహిత్యంలో మార్చకుండ రాసాను.

ఓహో.. ల ల ల

ఆ చంద్రుళ్ళో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క 

దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క, నా గుండెల్లో పొత్తాఉందే ఉక్కా  

హో.. చికిరీ చికిరి చికిరి చికిరి చికిరి చిక్కీరీ 

పడతా పడతా పడతా యెనకే యెనకే పడతా 

సరుకు సమాను సూసి మీసంలేసి యేసే కేక 

చికిరి చికిరీ గుండె సురకెట్టేసాకా 

ముందూ ఎనకా ఈడే గాలి పొక్కేసిందే పిల్లా 

చికిరి చికిరీ ఆడంగుల మచ్చైందెల్లా 

ఆ చంద్రుళ్ళో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క 

ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కేరందం, 

చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసే వాటం 

ఏం బొక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు, నీ మత్తే తాగిందా తాటికల్లు

కూసింతే సూత్తే నీలోవగలు రాసేత్తారు గా ఎకరాలు, నువ్వే నడిసిన సోటంతా పొర్లూదండాలూ..

హో.. చికిరీ చికిరి చికిరి చికిరి చికిరి చిక్కీరీ 

పడతా పడతా పడతా యెనకే యెనకే పడతా 

ఆ చంద్రుళ్ళో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క 

దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క, నా గుండెల్లో పొత్తాఉందే ఉక్కా  

నచ్చేసావే మల్లెగంపా నీ అందాలే నాలో దింపా 

ఏం తిన్నావో కాయా దుంపా, నీ యవ్వారం జర దాముంపా 

నీ చుట్టూరా కళ్ళేసీ లోగుట్టే నమిలేసీ లొట్టేసీ ఊరాయీ నోటానీళ్ళూ 

నీ సింగారాన్ని సూత్తావుంటే సొంగకార్చుకుందే గుండే 

బెంగ నిదరని మింగేహిందే సెయ్య్లేసేసీ.. 

చికిరీ చికిరి చికిరి చికిరి చికిరి చిక్కీరీ 

పడతా పడతా పడతా యెనకే యెనకే పడతా 

ఆ చంద్రుళ్ళో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క 

దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క, నా గుండెల్లో పొత్తాఉందే ఉక్కా  

హో.. చికిరీ చికిరి చికిరి చికిరి చికిరి చిక్కీరీ 

పడతా పడతా పడతా యెనకే యెనకే పడతా 

సరుకు సమాను సూసి మీసంలేసి యేసే కేక 

చికిరి చికిరీ గుండె సురకెట్టేసాకా 

Kunti Kumari [కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం] - Rowdy gari pellam

Title :Kunti kumari
Movie:Rowdy gari pellam
Singers:K.J. Yesudas గారు
Lyricist:Jaladi గారు
Composer:Bappi Lahari గారు
Director:K.S. Prakasha Rao గారు

కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం

కన్యాకుమారి తన కాలుజారి చేసింది నా జీవితం

క్షణకాలపాపం కనుమాయ చేసి తనపేగు తెంచిందిరా 

లోకాలుపుట్టే ఆ మురికితొట్టే నను కన్న కడుపాయెరా..

కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం

నీలాలుకారె నా కళ్ళనిండా నీరెండె మిగిలిందిరా 

పాలారబోసె పశిగుండెలోన పగనిండిపోయిందిరా 

లోకాలుతిరిగే ఏకాకిలాగా శోకాన్నిదాచానురా 

గతమంత మరిచే గరళాన్నితాగి బతుకీడ్చుతున్నానురా

కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం

నడివీధిరాళ్ళె గుడిలోనపెట్టి దేవుణ్ణిచేసారురా 

ననుకన్నవాళ్ళే ననువీధినేసి నగుబాటుచేసారురా 

ఏ దేవుడైన నాలాగ పుడితే ఈ బాధ తెలిసేదిరా 

దీపాల గుడికి పాపాల ఒడికి తేడాలు తెలిసేవిరా..

కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం

కన్యాకుమారి తన కాలుజారి చేసింది నా జీవితం

Nacchina fuddu vecchani beddu [నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డూ సిద్ధంరా ఫ్రెండు ] - Indrudu chandrudu

Title :Nacchina fuddu vecchani beddu
Movie:Indrudu Chandrudu
Singers:S.P. Bala subramanyam గారు
Lyricist:Sirivennela Seeta rama sastry garu గారు
Composer:Illayaraja గారు
Director:Suresh Krishna గారు

ఉచ్చంకావో లీచ్చిక్కోవో నీసీనియమ్మా, నచ్చిన్ సిన్మా థుక్షీయంగా వాసీనాయమ్మా 

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డూ సిద్ధంరా ఫ్రెండు 

తక్కినవన్నీ పక్కనబెట్టి పట్టర ఓ పట్టూ 

వెయ్యర సయ్యంటూ నడుంచుట్టూ ఉడుంపట్టు  

చిందెయ్యర రయ్యంటూ పదంవింటు పదా అంటు 

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డూ సిద్ధంరా ఫ్రెండు 

తక్కినవన్నీ పక్కనబెట్టి పట్టర ఓ పట్టూ 

వినరో పిట పిటలాడే పిట్టల కొక్కరొకో.. కొక్కరొకో

పదరో చిటపటలాడే ఈడుకి దిక్కిదిగో 

కసితో కుతకుత ఉడికే కళ్ళకు విందిదిగో 

ఎదలో కితకిత పెట్టే కన్నెల చిందిదిగో  

చెక్కిలి నొక్కుల చిక్కులలో, చిక్కని మక్కువ చిక్కునురో 

చక్కిలిగింతల తొక్కిడిలో ఉక్కిరి బిక్కిరి తప్పదురో 

అక్కరతీర్చే అంగడిలో అద్దాల అందాలు అందాలి పదరా 

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డూ సిద్ధంరా ఫ్రెండు 

తక్కినవన్నీ పక్కనబెట్టి పట్టర ఓ పట్టూ 

వెయ్యర సయ్యంటూ నడుంచుట్టూ ఉడుంపట్టు  

చిందెయ్యర రయ్యంటూ పదంవింటు పదా అంటు 

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డూ సిద్ధంరా ఫ్రెండు 

తక్కినవన్నీ.....

సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో.. మీకాకో..

జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో.. 

త్వరగా కలపడి ఖానా పీనా కానీరో .. ఇక ఉనకో..   

మరిగే కలతకు జాణల దాణా కానుకరో 

తుళ్ళెను అందం కళ్ళెదురా ఒల్లని పందెం చెల్లదురా 

మల్లెల గంధం చల్లునురా అల్లరి బంధం అల్లునురా 

అత్తరుసోకి కత్తెరలా మొత్తంగ మెత్తంగ కూర్చుంది కదరా 

ఉచ్చంటావో లీచ్చిక్కోవో నీసీనియమ్మా, నచ్చిన్ సిన్మా థుక్షీయంగా వాసీనాయమ్మా 

వెయ్యర సయ్యంటూ నడుంచుట్టూ ఉడుంపట్టు  

చిందెయ్యర రయ్యంటూ పదంవింటు పదా అంటు  

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డూ సిద్ధంరా ఫ్రెండు 

తక్కినవన్నీ పక్కనబెట్టి పట్టర ఓ పట్టూ 

ఉచ్చంకావో లీచ్చిక్కోవో నీసీనియమ్మా, నచ్చిన్ సిన్మా థుక్షీయంగా వాసీనాయమ్మా  

Satyam sivam sundaram [సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం] - Pasivadi Pranam

Title :Satyam sivam sundaram
Movie:Pasivadi pranam
Singers:S.P. Bala subramanyam గారు
Lyricist:Veturi Sundara Ramayya garu గారు
Composer:Chakravarthy గారు
Director:A Kodanda Rami reddy గారు

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

మనసే ప్రధానమూ దానికి మనిషే ప్రమాణము 

సుఖమే కోరుకోరా అది స్వార్థం కాదుపోరా 

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

ఆ దేవుడు మస్తుగ తాగి బొమ్మల్నే శృష్టిచేసి

అరె గజిబిజి పడుతున్నాడు తన తప్పే తనకు తెలిసి

ఓయ్ .. ఉన్నవాడిదే దోపిడీ లేనివాడికే రాపిడి 

లోకం ఇట్టా ఏడ్చెరా దీనిని ఎవ్వడు మార్చురా 

ప్రతిఒక్కడు ఏమార్చురా, గుడికెళ్ళినా గుణమేదిరా 

హుష్..తప్పైపొయిందిరో క్షమించరోయ్ క్షమించు

నరుడా మందుకొట్టే వాడు నీకూ పరమ గురుడా.. 

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

ఏ నాయకుడైనా పాపం వచ్చేది సేవకోసం 

అరె కడుపులు వాడే కొడితే, అది కుర్చీలోని దోషం 

రాజకీయ్యాలెందుకు తన్నుకుచచ్చేటందుకు 

రాత్రీపగలు తాగితే రాజూ-బంటు ఒక్కటే  

నా మాటలో నిజముందిరా, అది నమ్మితే సుఖముందిరా 

వాదాలెందుకయ్యా మందు వెసేయ్ ముందు భయ్యా..

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

మనసే ప్రధానమూ దానికి మనిషే ప్రమాణము 

సుఖమే కోరుకోరా అది స్వార్థం కాదుపోరా రేయ్

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం.. నిత్యం ఇదే అనుభవం  

era roi surinni jabilli [ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది ] - Raja Vikramarka

Title :surinni jabilli
Movie:Raja Vikramarka
Singers:S.P. Bala subramanyam గారు
Lyricist:Veturi Sundara Ramayya garu గారు
Composer:Raj-Koti గారు
Director:Ravi Raja Pinisetty గారు

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

తాగినోళ్ళా తందనాలు, వాగకుంటే వందనాలు 

తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కి పోతారు.. 

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

పల్లవొచ్చే నాగొంతులో, వెల్లువొచ్చే నా గుండెలో 

పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో..

మందుకొట్టి వొళ్ళెందుకో, చిందులేసే తుళ్ళింతలో 

కైపులోన ఎన్నెన్ని కావ్యాలో..

రేపన్నదే లేదని ఉమరు ఖయ్యాము అన్నాడురా 

నేడన్నదే నీదని గుడిపాటి చలమయ్య చెప్పాడురా 

రసవీరా కసితీరా ఏడింటి చేపల్లె గాలింటి గువ్వల్లె నే తేలిపోతారోయ్ 

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

దేవదాసు తాగాడురా వేదమేదో చెప్పాడురా, విస్వదాభి రాముణ్ణి నేనేరోయ్..

వొంటికేమో ఈడొచ్చెరా ఇంటికొస్తే తోడేదిరా, పుత్తడంటి పూర్ణమ్మ యాడుందో..

శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా

సంసార శ్రీనాథుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా 

ప్రియురాలా జవరాలా నీచేపకన్నల్లే నీకంటిపాపల్లే నేనుండిపోతాలే 

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

తాగినోళ్ళా తందనాలు, వాగకుంటే వందనాలు 

తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కి పోతారు.. 

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

ఏరా రోయ్...  

Tuesday, December 23, 2025

సల్లంగుండాలే సల్లంగుండాలే [Sallangundale] - Champion

Title :Sallangundale
Movie:Champion
Singers:Ritesh Rao గారు, Manisha గారు
Lyricist:Chandrabose గారు
Composer:Mickey J Meyer గారు
Director:Pradeep Advaitam గారు

సల్లంగుండాలే సల్లంగుండాలే, పెళ్ళిచేసుకొని నువ్వు పైలంగ ఉండాలే 

సల్లంగుండాలే సల్లంగుండాలే, పిల్ల పాపలతొ నువ్వు పచ్చంగ ఉండాలే 

నవ్వుతూ నువ్వుంటే నిన్నిట్టా సూత్తాంటే, కట్టాలల్లా కన్నీళ్ళల్లా ఎంతో సంబురం 

ఇస్తాం నీకై పానమే చేస్తాం నీకై యుద్ధమే బతుకిక ఊరికోసమే 

ఢమ ఢమ ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢోలే మోగాలే 

ఘుమ ఘుమ గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే 

ఢమ ఢమ ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢోలే మోగాలే 

ఘుమ ఘుమ గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే 

సల్లంగుండాలే సల్లంగుండాలే, పెళ్ళిచేసుకొని నువ్వు పైలంగ ఉండాలే 

సల్లంగుండాలే సల్లంగుండాలే, పిల్ల పాపలతొ నువ్వు పచ్చంగ ఉండాలే 

పట్టుసీరనే...నేసుకొస్తినే..ఏ.. 

పట్టగొలుసునే నీకు నే చేసుకొస్తినే, వేటపోతునే నీకు నా కానుకే 

తాళిబొట్టుకై నేను దాంచాను పైకమే, తలువాలా బియ్యం నా ధాన్యమే 

ఊరంతా ఒక్కిల్లు ప్రేమంత పందిళ్ళు, మంచే అయినా చెడ్డే అయిన వస్తామందరం 

పట్టేయ్యాలి పంతమే పొంగించాలి రక్తమే, బతుకిక ఊరికోసమే 

ఢమ ఢమ ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢోలే మోగాలే 

ఘుమ ఘుమ గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే 

ఢమ ఢమ ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢోలే మోగాలే 

ఘుమ ఘుమ గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే 

సింగిడి సింగిడి రంగుల్లొ పొంగుల్లొ సిందిన సందడి నేడే 

సింగిడి సింగిడి రంగుల్లొ పొంగుల్లొ సిందిన సందడి నేడే 

ఒలె లా ఒలె ఒలె ఒలె ఒలె ఓలే

ఒలె లా ఒలె ఒలె ఒలె ఒలె ఓలే

ఎల్లిరమ్మనీ.. ఎల్లకొట్టద్దే ..

ఎదురుసూస్తుంటాయి యేపసెట్టు కొమ్మలే , బెంగట్టిల్లిపోతాయి లేగదూడలే  

సెయ్యి సాస్తుంటాయి బురుజుగోడ నీడలే, కళ్ళు నులుముకుంటాయి బండ్ల బాటలే 

మేమున్నా లేకున్నా ఈ మట్టి ఉంటాది, సీరే సారే అన్నీ నీకే మట్టే పెడతది

సర్వం పోనీ సిద్ధమే, సావేరానీ సిద్ధమే బతుకిక ఊరికోసమే 

ఢమ ఢమ ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢోలే మోగాలే 

ఘుమ ఘుమ గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే 

ఢమ ఢమ ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢమ్మా ఢోలే మోగాలే 

ఘుమ ఘుమ గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే  

సల్లంగుండాలే సల్లంగుండాలే, పెళ్ళిచేసుకొని నువ్వు పైలంగ ఉండాలే  

సల్లంగుండాలే సల్లంగుండాలే, పిల్ల పాపలతొ నువ్వు పచ్చంగ ఉండాలే 

Meriseti puvva [మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ] - Narasimha

Title :Meriseti puvva
Movie:Narasimha
Singers:P.B. Srinivas గారు, Sriram గారు, Nityasree గారు
Lyricist:A.M. Rathnam గారు
Composer:A.R. Rahman గారు
Director:K.S. Ravikumar గారు

మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ, నాతోడురావా నా ఆశ భాష వినవా

మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ, నాతోడురావా నా ఆశ భాష వినవా

రేయిలో నీ గుండెపై నను పవళించనీవా, హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా 

సఖియా, సఖియా, సఖియా... నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా

శృంగార వీరా 

శృంగారవీరా రణధీరా నా ఆజ్ఞ్యతోటి, నా వెంట రారా నా ఆశ ఘోష వినరా 

రాలెడు సిగపూలకై నువు ఒడిపట్టుకోరా, వెచ్చని నా శ్వాశలో నువు చలికాచుకోరా 

మదనా .. మదనా.. మదనా.. నా సందిట్లో ముంగింట్లో గుప్పిట్లో ఉండరా 

శృంగారవీరా...

మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా

నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా 

సా..రిరీరి ససాస నినీని రిరీరి దదాద తకతకిట నిస్సారినిస్సా

మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా, గరిసనిద 

నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా, సా.రీ.ని.స.దా.మ.గ.ని.స 

నా పైట కొంగునుమోయ, నా కురుల చిక్కును తీయ, నీకొక అవకాసమే..

నే తాగ మిగిలిన పాలు, నువ్వు తాగి జీవించంగ, మోక్షము నీకే కదా

నింగే వంగి నిలచినదే, వేడగ రా..

మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ, నాతోడురావా నా ఆశ భాష వినవా

వీరా... వీరా.. 

చంద్రుణ్ణి చెక్కి చెక్కి చేసినట్టి శిల్పమొకటి చూసా  

తన చూపున అమృతం కాదు విషమును చూసా  

తన నీడను తాకిన పాపమని వెళ్ళా...ఆ...

వాలుచూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే, వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే.. 

రా అంటే నే వస్తానా, పో అంటే నే పోతానా, ఇది నువ్వు నేనన్న పోటి కాదు 

నీ ఆజ్ఞలన్ని తలనుదాల్చ్ పురుషులెవరు మునులు కాదూ..

శృంగారవీరా రణధీరా నా ఆజ్ఞతోటి, నా వెంట రారా నా ఆశ ఘోష వినరా ... 

Monday, December 22, 2025

Padaharella vayasu [పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు] - Lankeswarudu

Title :padaharella vayasu
Movie:Lankeswarudu
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Dasari Narayana Rao గారు
Composer:Raj- Koti గారు
Director:Dasari Narayana Rao గారు

clap clap.. 

clap to clap - hand to hands

clap to clap - boys and girls

hand to hand - girls and boys

clap clap clap clap clap clap clap clap clap clap.. 

పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు 

పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు 

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...

everybody పదహారేళ్ళ వయసు that's good

పడి పడి లేచె మనసు 

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

రెండు రెండు కళ్ళు, చూడ చూడ వొళ్ళు

వేడి వేడి సెగలూ..ప్రేమకోరు పొగలు

చూడ గుండెఘొల్లు, లోన వానజల్లు

లేనిపోను దిగులు రేయిపగలు రగులు

ఆడపిల్ల సబ్బుబిళ్ళ రాసుకుంటే.. 

కన్నెపిల్ల అగ్గిపుల్ల రాజుకుంటే..

ఓహ్.. ఆడపిల్ల సబ్బుబిళ్ళ కన్నెపిల్ల అగ్గిపుల్ల, రాసుకుంటే రాజుకుంటే 

హెయ్.. ఒహేయ్..ఎహాయ్..

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...

common girls  పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...

పిల్లదాని ఊపు, కుర్రకారు ఆపు 

పైన చూడ పొగరు, లోనచూడ వగరు 

పిల్లకాదు పిడుగు, గుండెకోసి అడుగు

దాచలేని ఉడూకు, దోచుకోని సరుకు 

అందమైన ఆడాపిల్ల పట్టుకుంటే, చూడలేక చందమామ తప్పుకుంటే 

ఓహ్.. అందమైన ఆడాపిల్ల చూడలేక చందమామ, పట్టుకుంటే తప్పుకుంటే 

హెయ్.. ఒహేయ్..ఎహాయ్..

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...

common girls  పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో 

Inumulo hrudayam molichene [ఇనుములో హృదయం మొలిచెనే] - Robot

Title :Inumulo hrudayam molichene
Movie:Robot
Singers:Kash and Krissy, Suzanne
Lyricist:Suddala ashok teja గారు
Composer:A.R. Rahman గారు
Director:Shankar గారు

you wanna feel my kiss, bro you cant touch this 

nobody hypnotic hypnotic 

super sonic super star come come come get it

super star come come come get it

ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే 

ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే 

పూజించె యంత్రుడు పూవాసనకొచ్చాడు, మరమనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు 

గూగుల్‌కే అందని అందం చూడాలనుకున్నాదు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు

O..oo oh bro

I robo నీచెవిలో ఐ లవ్‌యూ కోరేదా 

I robo నీచెవిలో ఐ లవ్‌యూ కోరేదా 

i am a super girl ప్రేమించే rapper girl

i am a super girl ప్రేమించే rapper girl

వెన్నెల్లో అందాలే నీవే నీవేలే 

నీ నీలి కన్నుల్లో విద్యుత్తే దొంగిలిస్తా 

నా నీలి పన్నుల్తో నీ తోనే నవ్విస్తా 

నా ఇంజిన్ గుండెల్నీ నీ సేవకు అర్పిస్తా 

నీ నిద్ర రాతిరిలో నా స్విచ్‌ని ఆర్పేస్తా 

ఏనాడూ ఏ పొద్దు నీవాడే బొమ్మే అవుతా 

watch me robo shakin, i know you wanna breakit 

కట్టి మాట గా నా నువ్వే షాక్కొడితే ప్రేమ కోరెవేళ మోటర్ వేగమైతే 

కౌగిలి రాతిరి బ్యాటరీ ఐపోతే 

మెమోరీలో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే 

షట్‌డౌనే చెయ్యనుపో రోజంతా చూస్తానే

O..oo oh bro

సెన్సార్లన్నీ అరిగేదాక నీలోవన్ని చదివానే 

నీవల్లె నా నియమం హద్దులు అన్నీ మరిచానే 

ఎంగిలి లేని దొంగ ముద్దు వద్దనకుండా తీస్కోవా 

రక్తం లేని లోహం గుండే వద్దుపోరా అంటావా  

జీవశాస్త్రం భాషల్లోనా యంత్రుణ్ణే ఓ చెలి

తారాలోకం భాషల్లోన చంద్రుణ్ణే నా సఖి 

చావేలేని శాపంపొంది భూమి పైకే వచ్చానే 

నా ప్రేమ పూవల్లే మాడిపోదు అంటానే 

హేయ్ రోబో మసకొద్దూ...

you want it come and get it boy, are you just a robo toy

i dont wanna break you, even it will takes him***

kinda like a break through, you dont even need a clue 

you be my man's backup, i think you need a check up

i can melt your heart down, may be if you got one

we're doing that for ages, since its time of sages

నువ్ దు.దు.దూరం పో, కాళ్ళకి బంధం వెయ్యకు పో 

ప్రేమ కోరే రోబో, నీ అవసరం లేదు పో పో ..

ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే 

ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే 

పూజించె యంత్రుడు పూవాసనకొచ్చాడు, మరమనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు 

గూగుల్‌కే అందని అందం చూడాలనుకున్నాదు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు

O..oo oh bro

I robo నీచెవిలో ఐ లవ్‌యూ కోరేదా 

i am a super girl ప్రేమించే rapper girl

I robo నీచెవిలో ఐ లవ్‌యూ కోరేదా 

i am a super girl ప్రేమించే rapper girl

I robo నీచెవిలో ఐ లవ్‌యూ కోరేదా  

i am a super girl ప్రేమించే rapper girl

nobdy hypnotic hypnotic 

super sonic super star come come come get it

super star come come come get it

boy, you cant touch this.. 

Saturday, December 6, 2025

Manasuna manasuga [మనసున మనసుగ నిలచిన కలవా] - Love Birds

Title :Manasuna manasuga
Movie:Love birds
Singers:Hariharan గారు, K.S. Chitra గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:A.R. Rahman గారు
Director:P. Vasu గారు

మనసున మనసుగ నిలచిన కలవా

పిలిచిన పలకగ ఎదుటనే కలవా 

దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం

మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే ...

మేఘం నేలవొళ్ళో మీటే రాగమల్లే, ప్రేమా వరాలజల్లు కావా

పిలుపే అందుకోని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా 

నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగున 

మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ 

నిరీక్షించు స్నేహం కోరి జతనే రానా రానా

ఉప్పొంగిపోయే ప్రాయం నిన్నువిడువదు ఏవేళైన 

నా శ్వాశ ప్రతిపూట వినిపించు నీ పాట 

ఏడేడు జన్మాలు నేనుంట నీ జంట

మనసున మనసుగ నిలచిన కలవా

పిలిచిన పలకగ ఎదుటనే కలవా 

దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం

మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే ...

పూవ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా..

విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా 

కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై 

వేటాడు ఏ ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై 

నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై 

నువునేను చెరిసగమౌదాం వయస్సుపండించే వరమై 

ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం 

తుదేలేని ఆనందం వేచేనే నీకోసం 

మనసున మనసుగ నిలచిన కలవా

పిలిచిన పలకగ ఎదుటనే కలవా 

దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం

మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే .. 

Sunday, November 23, 2025

Gundello emundo [గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది] - Manmadhudu

Title :Gundello emundo kallallo
Movie:Manmadhudu
Singers:Venu గారు, Sumangali గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Devi Sri prasad గారు
Director:Vijay bhaskar గారు

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం, నువ్వు ఎదురుగ నిలబడితే 

కదలదు కద సమయం, నీ అలికిడి వినకుంటే 

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా ఓ మనసా 

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నదీ

నువ్వు ఇప్పుడన్నదీ నేనెప్పుడూ విననిదీ 

నిన్నిలా చూసి పైనించీ, వెన్నెలే చిన్నబోతోందీ 

కన్నులే దాటి కలలన్ని, ఎదురుగా వచ్చినట్టుంది 

ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

ఎందుకో తెలియనీ కంగారు పుడుతున్నది

ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది

పరిమళం వెంట పయనించే, పరుగు తడబాటు పడుతోంది 

పరిణయం దాక నడిపించే పరిచయం తోడుకోరింది 

దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం, నువ్వు ఎదురుగ నిలబడితే 

కదలదు కద సమయం, నీ అలికిడి వినకుంటే 

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది 

మనసా మనసా మనసా ఓ మనసా 

Aakasavidhilo [ఆకాశవీధిలో..వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే] - Akasavidhilo

Title :Aakasavidhilo
Movie:Aakasavidhilo
Singers:Devi Sri Prasad గారు, Ganga గారు
Lyricist:bhuvana chandra గారు
Composer:M.M. Keeravani గారు
Director:Singeetam Srinivasarao గారు

వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే, వెచ్చని అల్లరి నాదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నేనైతే, వెచ్చని అల్లరి నీదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

మేఘాలె ముగ్గులుపెట్టే మేడల్లో, దేహాలె ఉగ్గులుకోరే నాదంలో 

చందమామే మంచం సర్దుకుందాం కొంచెం 

అహో రాత్రులు, ఒకే యాత్రలు, రహస్యాల రహదారిలో 

ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నేనైతే, వెచ్చని అల్లరి నాదైతే 

భూదేవే బిత్తరపోయే వేగంలో, నాదేవే నిద్దురలేచే విరహంలో 

తొకచుక్కై చూస్తా, ఒహోహో సోకులెక్కే రాస్తా 

ముల్లోకాలకే ముచ్చెమటేయగా ముస్తాబంత ముద్దాడుకో 

ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే, వెచ్చని అల్లరి నాదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

Saturday, November 22, 2025

Narmada nadi teeramlo [నర్మదా నదితీరంలో] - Rathasarathi

Title :Narmada nadi teeramlo
Movie:Rathasarathi
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Raj Koti గారు
Director:Sarath గారు

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో, గీటుతో గిచ్చుకో 

చూపులా చుట్టుకో ఊపులో..

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట

ఎగుడు దిగుడు ఎదలోన మొగలిపొదలు రగిలేనే

పగలె మసక పడుతుంటే పెదవి పెదవినడిగేనే 

తోయకే మల్లెలా మాయలో మత్తులా 

చేయకూ చిత్తిలా అందనీ ఎత్తులా 

సొంపుకో సొగసుని చూపి, దింపకే దిగులు సఖి

చెపకో చెరుకుల ముద్దు పంపర పదసరుకి

ప్రేమలో ఏదటో ఏదిటో....

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట

చిలిపి చిలిపి కలలెన్నో, నెమలి కనులు నెమరేసే 

వదులు వదులు వలదంటే చిగురు వలపు ముదరేసే 

పాడకే కోకిలా ఈడులో కోడిలా 

ఆడితే షోకిలా వేడిలో వెన్నెలా 

సందెకో చలి అటువచ్చీ అందమే వణికెనుగా 

పొద్దుకో పొడుపులు వచ్చీ నిద్దరే చిరిగెనులే 

ప్రేమలో ఏవిటో ఈడిటో..

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో, గీటుతో గిచ్చుకో 

చూపులా చుట్టుకో ఊపులో.. 

Sunday, November 16, 2025

Meghama maruvake [మేఘమా మరువకే, మోహమా విడువకే] - Seetharatnam gari abbayi

Title :Meghama maruvake
Movie:Seetharatnam gari abbayi
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Raj Koti గారు
Director:E.V.V Satyanarayana  గారు

మేఘమా మరువకే, మోహమా విడువకే 

మాఘమాస వేళలో మల్లెపూల మాలగా 

మరుని కూడి మెల్లగా మరలి రావె చల్లగా 

మదిలో మెదిలే మధువై....

మేఘమా మరువకే, మోహమా విడువకే 

నిదుర కాచిన కన్నె పానుపే రా రా రమ్మంటుంటే 

కురులు విప్పి నా అగరువత్తులే అలకలు సాగిస్తుంటే

సిగ్గే ఎరుగని రేయిలో తొలిహాయిలో అలివేణీ 

రవికే తెలియని అందము అందించనా నెలరాజా

కలలా అలలా మెరిసీ ...

మేఘమా మరువకే, మోహమా విడువకే 

గడుసు ఒడుపులే పరుపు విరుపులై గిచ్చే సందండిలోనా 

తడవ తడవకి పెరుగుతున్నది ఏదో మైకం భామ 

మరుగే ఎరుగని కోనలో ఆ మోజులో మహరాజా 

నలిగే మల్లెల సవ్వడి వినిపించనా నెరజాణా 

జతగా కలిసి అలిసి...

మేఘమా మరువకే, మోహమా విడువకే 

Goruvanka valagane [గోరువంక వాలగానె గోపురానికి ] - Gandeevam

Title :goruvanka valagane
Movie:Gandeevam
Singers:S.P. Balasubramanyam గారు, Srikumar గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:M.M. Keeravani గారు
Director:Priyadarsan  గారు

గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగనేల 

గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కలకిలా పువ్వులే పుట్టలేదా

బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా 

వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంచలన్ని  పల్లవించగా

నందుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై 

గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగనేల 

గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కలకిలా పువ్వులే పుట్టలేదా

ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా 

పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా 

నల్ల నల్ల నీళ్ళల్లోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లొమల్లో ఆకశాన చుక్కల్లు 

అమ్మాయంటి జాబిల్లమ్మ అబ్బాయంటి సూరీడమ్మ ఇంటిదీపాలవ్వాలంట దిక్కుల్లో 

ఎవరికివారే...యమునకు నీరే 

రేవునీరు నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే 

గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగనేల 

గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కలకిలా పువ్వులే పుట్టలేదా

ప్రేమ రుతువులు పూలు తొడిగిన తేనెమనసుల నీడల్లో 

మురిపాల నురగలు పంటకెరిగిన మాలసొగసుల మాటల్లో 

ముగ్గందాల ఇళ్ళునవ్వే సిగ్గందాల పిల్లనవ్వే బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో 

పైరందాల చెలు నవ్వే, పేరంటాలా పూలు నవ్వే, గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో 

పరవశమేదో ...పరిమళమాయే 

పువ్వు నవ్వే దివ్వె నవ్వే జివ్వుమన్న జన్మనవ్వే పాడుతుంటే 

గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగనేల 

గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కలకిలా పువ్వులే పుట్టలేదా 

బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా 

వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంచలన్ని  పల్లవించగా

నదుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై 

Sunday, November 2, 2025

Danchave menatta kutura [దంచవే మేనత్త కూతురా] - Mangamma gari manavadu

Title :Danchave menatta kutura
Movie:Mangamma gari manavadu
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:C. Narayana reddy గారు
Composer:K.V. Mahadevan గారు
Director:Kodi Ramakrishna  గారు

దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదర 

దంచు దంచు బాగా దంచు 

హా దంచు దంచు బాగా దంచు 

దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా 

దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా 

దంచు దంచు బాగా దంచు 

అరె దంచు దంచు బాగా దంచు 

దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా

ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ 

దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా 

పోటుమీదా పోటువెయ్యి పూత వయసు పొంగనియ్యి 

ఎడమచేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు 

పోటుమీదా పోటువెయ్యి పూత వయసు పొంగనియ్యి 

ఎడమచేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు 

ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి 

ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి 

కొట్టీనా నువ్వే పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే 

హా దంచుతా మంగమ్మ మనవడా.. ఓయె

నేను దంచితే నీ గుండె దడ దడా 

దంచుతా మంగమ్మ మనవడా.. ఓయె హొయ్

నేను దంచితే నీ గుండె దడ దడా 

కోరమీసం దువ్వబోకు కోకచుట్టు తిరగమాకు

ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకూ 

కోరమీసం దువ్వబోకు కోకచుట్టు తిరగమాకు

ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకూ

ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి 

ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి 

నువ్వు పుట్టంగనే బట్ట కట్టంగనే, నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను 

దంచవే మేనత్త కూతురోయ్, వడ్లు దంచవే నా గుండెలదరదరదర అదరా 

హా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడా 

Malli malli idi raani roju [మళ్ళి మళ్ళి ఇది రానిరోజు] - Rakshasudu

Title :Malli malli idi raani roju
Movie:Rakshasudu
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Kodanda Rami reddy  గారు

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

జాబిలంటి ఈ చిన్నదాన్ని, చూడకుంటే నాకు వెన్నెలేది 

ఎదో అడగాలని, ఎంతో చెప్పాలని

రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమికాను

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం 

దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం

ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో, ఒక్కరం ఇద్దరం అవుతున్నా 

వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది

గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది 

నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా..

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

కళ్ళనిండ నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం

దేహమున్న లేవు ప్రాణాలే నీవుకాదా నాకు ప్రాణం

సందిట్లో ఈ మొగ్గే పూయని, రాగాలే బుగ్గల్లో దాయని

గులాబీలు పూయిస్తున్నా, తేనెటీగ అథిదేడి 

సందెమబ్బులెన్నోస్తున్నా స్వాతిచినుకు తడుపేది

రేవులో నావలా నీ జతే కోరగా 

జాబిలంటి ఈ చిన్నదాన్నీ, చూడకుంటే నీకు వెన్నెలేదీ 

ఎదో అడగాలని, ఎంతో చెప్పాలని 

రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమికాను 

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

Saturday, November 1, 2025

Kolo Kolamma kalla [కోలో కోలమ్మగళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ ] - Kondaveeti DOnga

Title :Kolo kolamma kalla
Movie:Kondaveeti Donga
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Kodanda Rami reddy  గారు

కోలో కోలమ్మగళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా 

చేలో నీసోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా 

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా, ఘాటుగా కౌగిళ్ళిచ్చీ మాటుకోమంటావా 

కోలో కోలమ్మగళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా 

చేలో నీసోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా 

కొండకోనల్లో చాటుగా ఎత్తుపల్లలు తెలిసెలే 

కంటికోణాలు సూటిగా కొంటెబాణాలు విసిరెలే 

సోకినావొళ్ళూ కోకలోగళ్ళు పడ్డనీవొళ్ళు వదలను

చూపుకే సుళ్ళూ తిరిగెనావొళ్ళు పట్టుకౌగిళ్ళూ వొదలకు 

కుదేసాక అందాలన్ని కుదేలైన వేళల్లో 

పదేసాక వల్లో నన్నే వొడేచాలు ప్రేమల్లో

కందె వో షేపు చిందే వో వైపు అందే నీ సోకులే

తనకుధిన్న, చేలో నీసోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా 

కోలో కోలమ్మగళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా 

మెత్తగాతాకు చూపుకే మేలుకొన్నాయి సొగసులే, 

కొత్తగాతాకు గాయమే హాయి అన్నాయి వయసులే 

కుర్ర నా ఈడు గుర్రమై తన్నె గుట్టూగా గుండెలదరగా 

కళ్ళతో నీకు కళ్ళెమేసాను కమ్ముకో నన్ను కుదురుగా 

భరోసాల వీరా రారా భరిస్తాను నీ సత్తా 

శృతేమించు శృంగారంలో రతేనీకు మేనత్తా 

ముద్దు ఆవైపు రుద్దు ఈవైపు హద్దులే లేవులే 

తనక్కుధిన్న 

కోలో కోలమ్మగళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా 

చేలో నీసోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా 

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా, ఘాటుగా కౌగిళ్ళిచ్చీ మాటుకోమంటావా 

కోలో కోలమ్మగళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా 

చేలో నీసోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా 

Wednesday, October 29, 2025

Jagada jagada jagadam [జగడ జగడ జగడం చేసేస్తాం] - Geetanjali

Title :Jagada jagada jagadam
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 

మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం 

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 

ఆడేదే వలపు నర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సయ్యంటే సయ్యాటరో..హే హే

మా వెనకే ఉంది ఈ తరం, మా శక్తే మాకు సాదనం, ఢీ అంటే ఢీయ్యాటరో..

నేడేరా నీకు నేస్తమూ రేపేలేదు, నిన్నటే నిండుసున్నరా రానేరాదూ

ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే.. తకతకధిమి తకఝణు 

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 

పడనీరా విరిగి ఆకశం, విడిపోనీ భూమి ఈ క్షణం, మా పాట సాగేనులే.. హో హో 

నడిరేయే సూర్య దర్శనం, రగిలింది వయసు ఇంధనం, మా వేడి రక్తాలకే 

ఓ మాటా ఒక్క బాణము మా సిద్ధాంతం, పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం

జోహారుచెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడే.. తకతకధిమి తకఝణు 

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 

మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం 

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

తకిట తకిట తకఢిమి తకధిమితక 

తకిట తకిట తకఢిమి తకధిమితక 

తకిట తకిట తకఢిమి తకధిమితక తాం తాం తాం తాం 

Saturday, October 25, 2025

Nandi konda vagullona [నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో] - Geetanjali

Title :nandi konda vaagullo
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitraగారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

ఓ... ఓ... 

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 

నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా 

నా ఊరేది ఏదీ, నా పెరేది ఏదీ..నా దారేది ఏదీ, నా వారేరీ... ఓ... ఓ... 

ఏనాడో ఆరింది నావెలుగు, నీ దరికే నా పరుగు

ఆనాడే కోరాను నీ మనసు, నీ వరమే నన్నడుగు 

మోహినీ పిశాచి నా చెలిలే, డాకినీ విశూచి నా సఖిలే 

మోహినీ పిశాచి నా చెలిలే, డాకినీ విశూచి నా సఖిలే 

విడవకురా వదలనురా ప్రేమే రా నీ నీడా 

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

భూత ప్రేత పిశాచ బేతాళ మారిచం భం జడం భం భం 

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 

నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా 

నీ కబళం పడతా నిను కట్టుకుపోతా, నీ భరతం పడతా నిను పట్టుకుపోతా 

ఆ.... ఓ....

ఢాకిని ధక్కా ముక్కల చెక్కా ఢంబో తినిపిస్తాన్, తాటకివనిపిస్తే తాటను వొలిచేస్తాన్

తుంటరి నక్క డొక్కల చొక్క అంభో అనిపిస్తాన్, నక్కను తొక్కిస్తాన్ చుక్కలు కక్కిస్తాన్ 

రక్కసి మట్ట తొక్కిస బుట్ట పంబేదులిపేస్తాన్, తీతువు పిట్ట ఆయువుచిట్టా నేనే తిరగేస్తాన్

రక్కసి మట్ట తొక్కిస బుట్ట పంబేదులిపేస్తాన్, తీతువు పిట్ట ఆయువుచిట్టా నేనే తిరగేస్తాన్

అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్ ఫట్, వస్త్రాయ ఝట్ ఝట్ ఝట్ ఫట్

గోపాలా మసజసతతగ శార్ధూలా 

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 

నీడల్లే ఉన్నా.. న...నా , నీతో వస్తున్నా 

నీ కబళం పడతా నిను కట్టుకుపోతా, నీ భరతం పడతా నిను పట్టుకుపోతా 

ఆ.... ఓ....

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో  

Oh Priya priya [ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా] - Geetanjali

Title :Oh priya priya
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitraగారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

ఆ....

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఏల గాలిమేడలు రాలు పూలదండలు 

నీదో లోక నాదో లోకం, నింగినేల తాకేదెలాగా

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఏల జాలిమాటలు మాసిపోవు ఆశలు 

నింగినేల తాకెవేళ నీవే నేనైపోయె వేళయి

నేడు కాదులే రేపు లేదులే, వీడుకోలిదే వీడుకోలిదే 

నిప్పులోన కాలదు నీటిలోన నానదు, గాలిలాగ మారదు ప్రేమ సత్యము 

రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము, పేదవాడి కంటిలో ప్రేమరక్తము

గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో, జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో  

ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు, రాజశాశనాలకి లొంగిపోవు ప్రేమలు

సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ 

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

కాళిదాసు గీతికి, కృష్ణ రాసలీలకి, ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లవి

ఆ అనారు ఆశకి, తాజ్‌మహల్ శొభకి, పేదవాడిప్రేమకి చావుపల్లకి 

నిధికన్న ఎదమిన్న గెలిపించు ప్రేమని, కథకాదు బ్రతుకంటే బలికానీ ప్రేమని

వెళ్ళీపోకు నేస్తమా ప్రాణమైన బంధమా, పెంచుకున్న పాశమే తెంచివెళ్ళిపోకుమ 

జయించేదిఒక్కటే ఓ నీ ప్రేమ 

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

కాలమన్న ప్రేయశి తీర్చమంది లే కసి 

నింగినేల తాకెవేళ నీవే నేనైపోయె క్షణాన, లేదు శాశనం లేదు బంధనం 

ప్రేమకే జయం, ప్రేమదే జయం.. 

Monday, October 20, 2025

Kurisenu virijallule [కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే] - Gharshana

Title :kurisenu virijallule
Movie:Gharshana
Singers:S.P. Balasubramanyam గారు, Vani Jayaram గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను

శృంగారమునకీవె శ్రీకారమేకావే 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

ఆకులపై రాలు... ఆ... ఆ...

ఆకులపై రాలు హిమబిందువు వోలె, నా చెలి వొడిలోన పవళించనా 

ఆకులపై రాలు హిమబిందువు వోలె, నా చెలి వొడిలోన పవళించనా 

రాతిరిపగలు, మురిపాలు పండించు చెలికాని ఎదచేర్చి లాలించనా

నేను నీకు రాగతాళం, నీవు నాకు వేదనాదం

ఆ... ఆ... 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను

శృంగారమునకీవె శ్రీకారమేకావే 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

కన్నుల కదలాడు ఆశలు శృతిపాడు వన్నెల మురిపాల కథ ఏమిటో 

తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేవిటో  

పెదవుల తెరలోన మధురాల సిరివాన మధురిమలందించు సుధలేమిటో 

పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో 

పల్లవించే మోహబంధం ఆలపించే రాగబంధం 

ఆ... ఆ... 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను

శృంగారమునకీవె శ్రీకారమేకావే 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే  

Sunday, October 19, 2025

Kuchi kuchi kunamma [కుచ్చికుచ్చి కూనమ్మ ] - Bombay

Movie : Bombay
Song : Kuchi kuchi kunamma
Music Dir: A.R. Rahman garu
Singer: Hari Haran garu, Swarna latha garu
Director: Mani Rathnam garu
Lyrics: Veturi Sundara Rama murthy garu

కుచ్చికుచ్చి కూనమ్మ పిల్లనివ్వు, కుందనాల కూనమ్మ పిల్లనివ్వు

ఊరువాడా నిద్దరోయే, కోడికూడా సద్దుచేసే, కుచ్చి కుచ్చి కూనమ్మ, కుందనాల కూనమ్మ

కుచ్చికుచ్చి కూనమ్మ పిల్లనివ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్లనివ్వు

ఊరువాడా నిద్దరోయే, కోడికూడా సద్దుచేసే, కుచ్చి కుచ్చి కూనమ్మ, కుందనాల కూనమ్మ

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఆటనెమిలికీ మెరుపు సుఖం, గానకోకిలకు పిలుపు సుఖం 

చెట్టువేరుకు పాదు సుఖం, హే అమ్మడన్ను పిలుపు సుఖం  

రాకుమారుడికి గెలుపు సుఖం, చంటి కడుపుకి పాలు సుఖం 

మొగుడు శ్రీమతి అలకలలో ముద్దు కన్న ముడుపు సుఖం 

రేయిపగలు కన్నీట్లో ఉన్నా రాదు మీనుకి చలికాలం 

అల్లిబిల్లిగా లాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం 

బుజ్జి బుజ్జి పాపనివ్వు, పోకిరాట వేషమొద్దు 

బుజ్జి బుజ్జి పాపనివ్వు, పోకిరాట వేషమొద్దు 

వేడెక్కా అందాలెపెట్టు వేధిస్తే నామీదే ఒట్టు 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

చిరుత రెక్కలే పక్షివిలే, చిటికె వెలుగులే దివ్వెవిలే  

తోడు నీడ ఇక నీదేలే, తరగని పుణ్యమిదే 

తనువు తోటివే తపనలులే, ఉరుముతోటివే మెరుపులులే 

ఉన్న తోడు ఇక నీవేలే విలువలు తెలియవులే 

భూమి తిరగడం నిలబడితే, భువిని కాలమే మారదులే 

మగని ఆదరణ కరువైతే ఇల్లాలి ప్రేమంత వేసంగిపాలే 

పొద్దుకోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ 

పొద్దుకోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ 

బుద్ది ఉంటె మంచిదంట దూరాలు కోరింది ఆశ 

కుచ్చి కూనమ్మ, కుందనాల కూనమ్మ

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

Kanulu kanulu kalise samayam [కనులు కనులు కలిసే సమయం] - Pallavi anupallavi

Movie : Pallavi anupallavi
Song : kanulu kanulu lakise
Music Dir: Illayaraja garu
Singer: S.P. Balasubramanyam garu, S. Janaki garu
Director: Mani Ratnam garu
Lyrics: Raja Sri garu

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ చేరువలో నీ చేతలలో వినిపించెను శ్రీరాగం 

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ నవ్వులో విరిసె మందారము, నీ చూపులో కురిసె శృంగారము 

నీ మాటలోవుంది మమకారము, నా ప్రేమకేనువ్వు శ్రీకారము 

పరువాలు పలికేను సంగీతము, నయనాలుపాడేను నవగీతము 

నేనే నీకు కానా ప్రాణం, నీవే నాకు కావా లోకం 

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ గుండెగుడిలో కొలువుండనీ, నీ వెంటనీడల్లె ననుసాగని

నీపూల ఒడిలో నను చేరనీ, నీ నుదుట సింధూరమై నిలవనీ

చెవిలోన గుసగుసలు వినిపించనీ, ఎదలోన మధురిమలు పండించనీ 

నీలో నేనే కరగాలంట, రోజూ స్వర్గం చూడాలంట  

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ చేరువలో నీ చేతలలో వినిపించెను శ్రీరాగం  

Saturday, October 18, 2025

Ni andam na prema gita [నీ అందం నాప్రేమగీత గోవిందం] - Vaarasudochchadu

Movie : Vaarasudochchadu
Song : ni andam na prema gita
Music Dir: Illayaraja garu
Singer: S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Director: Mohan Gandhi garu
Lyrics: Veturi Sundara Rama murthy garu

నీ అందం నాప్రేమగీత గోవిందం, నీ వర్ణం నా కీరవాణి సంకేతం 

నీ రఘం ఏ ప్రేమవీణ సంగీతం, ఈ యోగం ఏ జీవధార సంయోగం 

వొయ్యారి రూపం గాంధార శిల్పం శృంగారదీపం వెలిగిస్తే 

నీ చూపుకోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే

నీ అందం నాప్రేమగీత గోవిందం, ఈ యోగం ఏ జీవధార సంయోగం 

జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల మారాణి వేదాలు గమకించగా 

కోరాడు మీసాల తారాడు మోసాల నామందహాసాలు చమకించగా 

ఆరారు రుతువుల్లొ అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా 

ఆషాఢ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త భావాలు సవరించగా 

నీకోసమే ఈడూనేనూ వేచాములే, నీకోసమే నాలో నన్నే దాచానులే 

నిను పిలిచాను మలిసందే పేరంటం, ఇక మొదలాయె పొదరింటి పోరాటం ఆరాటం 

నీ అందం నాప్రేమగీత గోవిందం, ఈ యోగం ఏ జీవధార సంయోగం

హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా 

మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా   

రెప్పల్లోకొచ్చింది రేపల్లెకాడింది నానువ్వు నీనేను క్రీడించగా 

గాధల్లో నిదరోయి రాధమ్మ లేచింది నా వేణువే నాకు వినిపించగ 

నీ పింఛమే కిలికించితాలు చేసిందిలే నాకోసమే ఈ పారిజాతం పూసిందిలే 

మన హృదయాలలో ప్రేమ తారంగం, స్వరబృందావిహారాల చిందేటి ఆనందం 

నీ రఘం ఏ ప్రేమవీణ సంగీతం, ఈ యోగం ఏ జీవధార సంయోగం 

వొయ్యారి రూపం గాంధార శిల్పం శృంగారదీపం వెలిగిస్తే 

నీ చూపుకోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే

నీ అందం నాప్రేమగీత గోవిందం, ఈ యోగం ఏ జీవధార సంయోగం  

Vivaha Bhojanambu vintaina vantakambu [వివాహభోజనంబు వింతైన వంటకంబు] - Maya bazar

Movie : Maaya bazaar
Song : Vivaha bhojanambu 
Music Dir: Ghantasala garu
Singer: Ghantasala Venkateswara rao garu
Director: K. V. Reddy garu
Lyrics: Pingali Nagendra rao garu

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

అహహ్హ ఆహహ్హ అహహ్హ ఆహహ్హ 

ఔరౌర గారెలల్ల అయ్యరె బూరెలిల్ల 

ఔరౌర గారెలల్ల అయ్యరె బూరెలిల్ల ఒహ్హోరె అరిసెలిల్ల హహహ్హహా 

ఈవెల్ల నాకె చెల్ల...  

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

అహహ్హ ఆహహ్హ అహహ్హ ఆహహ్హ 

భళీరె లడ్డులందు, వహ్ ఫేణిపోణిలిందు 

భళీరె లడ్డులందు, వహ్ ఫేణిపోణిలిందు 

భలే జిలేబిముందు ఈవెల్ల నాకె విందు హహహ్హహ్హా

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

అహహ్హ ఆహహ్హ అహహ్హ ఆహహ్హ 

మఝారె అప్పడలు పులిహోర దప్పడాలు  

మఝారె అప్పడలు పులిహోర దప్పడాలు  

వహ్వారె పాయసాలు హహహ్హహ్హా

ఈవెల్ల నాకె చాలు  

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

అహహ్హ ఆహహ్హ అహహ్హ ఆహహ్హ