| Title : | Kasta nannu nuvvu |
| Movie: | Student No 1 |
| Singers: | S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు |
| Lyricist: | Chandrabose గారు |
| Composer: | M.M. Keeravani గారు |
| Director: | S.S. Rajamouli గారు |
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట సోకునిప్పు రేగుతుంటే
రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే, మంటచుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట సోకునిప్పు రేగుతుంటే
రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే, మంటచుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది
అమ్మడూ నీ యెవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే
కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే
పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే
మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే
చిన్ననాడే అన్నప్రాసనయ్యిందోయ్ కన్నెదాని వన్నెప్రాసనవ్వలోయ్
అమ్మచేతి గోరుముద్ద తిన్నానోయ్ అందగాడి గోటిముద్ర కావాలోయ్
ఓ....
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే, కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే
చేరుకున్న చోట ఉన్న దీపమారుతుంటే, ఆరుతున్నవేళ కన్నె కాలుజారుతుంటే
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు గివ్వు పువ్వై పూస్తుంది
మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే
గుట్టిగా నీ బంగారం తలకు తగులుతుంటే
కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలౌతుంటే
పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే
బుగ్గలోన పండుతుంది జాంపండు, పక్కలోన రాలుతుంది ప్రేంపండు
రాతిరేళ వచ్చిపోర రాంపండు బంతులాడి పుచ్చుకోర భాంపండు
ఓ...
కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే
ఆపలేక నేను నిన్ను జాలిచూపమంటే
చూపనంటు నేను తీపి ఆస రేపుతుంటే
రేపుతుంటె నేను రేపుకాదు ఇప్పుడంటే
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు గివ్వు పువ్వై పూస్తుంది
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు గివ్వు పువ్వై పూస్తుంది





















